Thursday, 3 September 2009

tel13



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

 
121. తలపోత
1201
మధువుఁ ద్రాగినంత మైకమ్ము గ్రమ్మును
కామమట్లు గాదు గనిన చాలు.
1202
ఎట్టులైన నేమి ఇంపౌను కామమ్ము
తలచినంతఁ దీరు తాపభరము.
1203
తలచినట్లు దలచి తలుక మానెనో
వచ్చినట్లు వచ్చి వదలె తుమ్ము.
1204
మేము వారి మదిని మెలగుదుమో లేమొ
మరువ మతని మాదు మానసముల.
1205
తలపఁ డతడు నన్ను తానెట్లు వలపింప
సిగ్గు మాలి నాదు చెంతవచ్చు.
1206
ఇన్నినాళ్ళు బ్రతికి యున్నది యెట్లన్న
దలచి తలచి ముందు వలపులన్ని.
1207
మరచుటన్ను మాటె మండించు హృదయమ్ము
మరచి బ్రతుకు మాట మాట యగునె.
1208
ఎంత దలచుకొన్న నేమని కినయండు
ప్రియుడొనుగునట్టి ప్రియమదౌను.
1209
ఎంతగానొ జెప్పె నిర్వుర మొకటని
చెంతలేక నివుడు చింతబెట్టె.
1210
విడచినట్టివాని వెదకి పట్టెడుదాక
గదలిపోకుమోయి కలువరాజ.
 
122. స్వప్నసుఖము
1211
దూతగాగ ప్రియుని తోడుక వచ్చిన
కలకు విందుజేతు కనులముందె.
1212
కాటుక కనులందు కలవచ్చి ప్రియుడున్న
సిగ్గువిడచి యన్న జెప్పుకొందు.
1213
ఎదుట లేనివాని నిదురలో గల గని
ఉసురు నిల్పుకొందు నున్నదనుక.
1214
నేరుగాను జూడ నేరనివారిని
నిదుర లోన దెచ్చి నిలుపు వలపు.
1215
కామ సుఖమునందు కలయు నిజము రెండు
ఒకటిగానె తోచుచుండు ప్రియుల.
1216
మేలు కలయె జూడ మేల్కోలు లేకున్న
వదల దగుత ప్రియుడె స్వప్నమందు.
1217
నిజ సుఖమ్ము నీయనేరని ప్రియు దేల
కలను వచ్చి యిట్లు కలతబెట్టు.
1218
నిదురలోన ప్రియుడు హృదయమ్ము పైనుండు
నెదనుజేరు నతఁడు నిదురలేవ.
1219
కలలు గనినయట్టి కాముకు లందఱు
పగలు పొగలుచుంద్రు వలపు దలచి.
1220
వాడుకొంద్రు ప్రియుడు వదలినాడని యూర
కలను వచ్చుటెల్ల కానలేరు.


123. సంధ్యా సమయము
1221
సంధ్య సంధ్య కాదు చంపంగ వచ్చిన
గాల మగునుగాదె కాముకులను.
1222
సంధెవయ్యు నీవు మంద మందెదవేల
నీకు గూడ తోడు లేకనేన.
1223
మంచుకనుల సంధ్య మంద మందమ్ముగా
వచ్చి వచ్చి బాధ హెచ్చుపవచు.
1224
విరహులందు సంధ్య ప్రియుడుండ నిదిజూచి
పగను దీర్చుకొనును వైరివిధము.
1225
ఉదయమునకు నెట్టి యుపకార మొనరించి
సంధ్య కేమి జేయజాలనైతి.
1226
సంధ్యకాల మింత సంకటంబని నేను
తెలియనైతి ప్రియుని గలిసినపుడు.
1227
ప్రొద్దుతోడబుట్టి పెద్దదై దినమంత
నిరియు సంధ్యవేళ విరహ బాధ.
1228
వేణుగాన మపుడు వినిపించె మధురమై
చేదు గాగ నిపుడు చెవిని బడును.
1229
సద్దుమణిగియుండు సంధ్యలో నూరెల్ల
నాయకుండు లేని నావిధంబు.
1230
సఖుని వెడచిపెట్టి చావకుండెడి నన్ను
చంపుతున్న దిపుడు సంధ్య వచ్చి.


124. కృశత
1231
ఏడ్చి యేడ్చి ప్రియుని యెడబాటు కోర్వక
కనులు చిన్నవోయె కలువ లెదుట.
1232
విరహ బాధనెల్ల వెలిబుచ్చగా నేమొ
పరితపించి కండ్లు పాలిపోయె.
1233
బలిసి యున్న నాటి బాహువులే సడలుట
తెలియఁబరచు ప్రియుడు తొలగియుంట.
1234
కంకణములు జూరు కరపద్మములనుండి
తోడులేని యట్టి దుఃఖమునకు.
1235
క్రూరుడుంచు నూరి వారల కెఱిగించు
వాడివత్తలైన బాహు యుగళి.
1236
గాజు లూడఁజూచి కాంతుని దూరంగ
వినగ జూలనైతి ప్రీతి దొఱగి.
1237
గొప్పబడవె మనస చెప్పుచు ప్రియునితో
చెన్ను దఱిగెనంచు చేతులెల్ల.
1238
సడలినంత కొంత దృఢ బాహుబంధమ్ము
మందమయ్యె కాంతి మగువ నొసట.
1239
కౌగిలింపు సడలి గాలి దూరిన యంత
నల్లనైన కండ్లు తెల్లనయ్యె.
1240
వన్నె దొఱగినట్టి నెన్నుదురును గని
కన్నులింక కొంత వన్నె దఱిగె.


125. నిర్వేదము
1241
తెలిసియున్న నీకు దెలుపవే హృదయమ్ము
మదన తాపమునకు మందునొకటి.
1242
వలతువేల నీవె వలపుగాడిట లేక
బ్రతుక జేతగాని పాడు మనస.
1243
ఏను నీవు వగచి యేమౌను హృదయా
వలపుగాడు కరుణ దలుపఁడేని.
1244
కనులఁగూడ నీతొ గొనిపొమ్ము హృదయమా
కోపపడును ప్రియుని చూపుమందు.
1245
ప్రేమజూపి వెనుక విడచినాడని తాను
విడువనగునె నేను వెఱ్ఱి మనస.
1246
బింకమేల మనస ప్రియుని జూచినతోడ
విరహకోపమెల్ల పరుగుదీయు.
1247
వదలవలయు నొకటి వలపైన సిగ్గైన
వశముగావు రెండు వలపునందు.
1248
వలచినట్టివాడు వదలంగఁ జూచియు
వెంటబడుదువేల వెఱ్ఱిమనస.
1249
తలచునట్టి ప్రియుడు తలపులో నుండఁగఁ
గానడంచు వెదకనౌనె మనస.
1250
తలపు లేనివాని దలపోయ దలపోయ
జూడ జూడ మేని పొంపు దఱగు.

126. భంగపాటు
1251
ఎగ్గు సిగ్గులనెడి యినుప సంకెళులెల్ల
పగిలిపోవు కామ పరశు హతికి.
1252
కామమునకు వేరె కార్యమ్ములేదొకో
పగలు రాత్రి యనక బాధబెట్టు.
1253
మరతు మరలు నెంతొ మదన వేదన నన్ను
తోచుకొనుచు వచ్చు తుమ్ము వోలె.
1254
పట్టువడక యింటి గుట్టుగా నేనేమె
బట్టబయలు జేవె వలపు నన్ను.
1255
‘ఛీ’ యటన్న వారి చెంత జేరని గొప్ప
కామకాళి యందు గానరాదు.
1256
విసుగు గొన్నవారి వెంబడింపగ నన్ను
బట్టు కొన్న కామ మట్టి దగును.
1257
వలసినట్లు నన్ను వలసించు ప్రియునితోఁ
గూడినపుడు సిగ్గు గూడనైతి.
1258
పురుషడాడు కల్లబొల్లి మాటల తీరు
మమ్ము మోసగించు మరుబలమ్ము
1259     
కోపదంచఁ జోతి గోపించు నంతలో
మనసు దీర నతని మరలు గొంటి
1260
వేడిజేయ గరుగు వెన్నవంటి మనసు
కొంతు గలియువేళ కరుగకున్నె.

127.  ఉత్కంఠ
1261
కాచి కాచి కనులు కాయలైపోయెను
ఎంచి యెంచి వ్రేళ్ళ యంచు లరిగె.
1262
అందమెల్ల దొరగి యాభరణము లూడు
నప్పుడైన మరువ నైతి ప్రియుని.
1263
దూరమేగి నట్టి వారి రాకనుగోరి
బ్రతుకుచుంటి నెన్ని బాధలున్న.
1264
కలసినట్టి వాని కలియంగ నా బుద్ధి
కొమ్మ కొసల కెక్కు కోర్కె లెదిగి.
1265
కనుల ముందు ప్రియుడు కనిపించినంతనే
పాండురంపు తనువు పసిమికెక్కె.
1266
ఒక్కసారి వచ్చి వచ్చి నీ చెలికాడు
కామ బాధదీర గరచి తిందు.
1267
ఏమి చేతొ దెలియనేతేరఁ జెలికాడు
చిత్తమంతలోనె తత్తరించు.
1268
రాజు గెలుచుగాఁత రమణితో యూ ప్రొద్దె
సంధెకాల విందు నందుకొందు.
1269
ఒక్క దినమెయైన యుగముగాఁ దోఁచును
కాండు నెదురు జూచు కామినులకు.
1270
ఉన్న మనసు కొంత నూడిపోయిన వెన్క
కలియుటైన యెకటె కలియకొకటె.

128. భావప్రకటన
1271
దాచఁబూను కొనిన దాగక చెలికఁడ్లు
భావమొండు దెలియ బరుచు నాకు.
1272
కనుల సొంపు, సిగ్గు కరవల్లవంబులు
స్త్రీల శోభకెల్ల జీవమిచ్చు.
1273
మణుల దారమెట్లు గనిపిఅమ్చునట్టులే
మగువ సొంపునందె మనసు తెలియు.
1274
మగువ మర్మ మెల్ల మందహాసము దెల్పు
పరిమళంబు దెలుపు పగిది మొగ్గ.
1275
గాజులు కదలంగఁ గాదన్న ప్రేయసి
మర్మమందె నాకు మందు దొఱికె.
1276
వలచి రాక నన్ను తిలకించుటను జూడఁ
నలుక యేమొ వదలి తంచుముందు.
1277
ప్రియుడు లేదటన్న వేదన నాకన్న
ముందుగానె గాజులందు దెలినె.
1278
నిన్న ప్రియుని విడచు టెన్నంగ నామేను
వారమైన యట్లు పాలిపోయె.
1279
కంకణములు జూచి కాల్జూచి నొయ్యన
భావమొండు భామ బయట బెట్టు.
1280
కామ బాధనెల్లఁ గనుచూపులో నిల్పి
నిలువుకొనుటె కలికి వలపు బలము.

129. కలయిక
1281
కన్నఁ దలచుకొన్న గామమ్మునకు మత్తు
కల్లు ద్రాగినపుడె కలుగు మత్తు.
1282
అలుక బూనరాదు యావంత యైనను
గుమ్మడివలె వలపు కోర్కెలున్న.
1283
నన్ను గనని యట్టి నాధుని గననని
చెప్పు లేక గనులు కలపె నతని.
1284
కలహ మాడ దలచి కదలితి నో సఖి
దాని మరచి కలయ దలచె మనసు.
1285
లేఖ ప్రాయునపుడు లేఖిని గననట్లు
కాంతుజూడ దప్పు గాంచనైతి.
1286
ఉన్న నాడు దోస మొక్కటి దెలియదు
దూరమైన దెలియు దొసగులన్ని.
1287
మునుగటెరిగి నదికి బోవుట వంటిది
వలపు గానితోడ కలహమాడ.
1288
మాన నౌనె కల్లు మర్యాద గాదని
విడువనగునె ప్రియుని విటుడటంచు.
1289
కోమలంబు వలపు కుసుమంబు కన్నను
ననుభవించు వార లరుదు దాని.
1290
కోపగించెగాని కోర్కెను దీర్చంగ
ముందు బడెను కౌగిలందుకొనగ.

130. ఆక్రోశము
1291
వారి వారి మనసు వారితో సుండంగ
నీవు నట్లె యుండ వేల మనస.
1292
ప్రేమలేని వాని ప్రియుడంచునో మనస
చూచునంత జేర చూచుటేల.
1293
కాముకులకు వేరె గతిలేమి యెఱిగియో
వెంట దగులుచుంటి వెఱ్ఱిమనస.
1294
ప్రణయ కోపమందు భయపెట్టినట్లుగా
వలపు దీర్చుకొనక వగతువేల.
1295
చేరకున్న బాధ చేరిన విడబాధ
బాధ దప్ప దింక బాడు మనస.
1296
మనస! నీవు నన్ను దినివేయు చున్నావు
ఒంటరిగను నెట్టు లుండ నింక.
1297
మరువరాని సిగ్గు మరచితి ప్రియునందు
మనసు దగలి వేరుమార్గ మరయ.
1298
జీవతాశ నతని చెడుగుల వర్ణింప
తనకె లోపమంచు దలచి దలచి.
1299
మనసుకన్న తోడు మరి యెవ్వరుందురు
తోడులేదటంచు దుఃఖమేల.
1300
తనదు మనసె తనకు ననువు గానప్పుడు
చుట్టరికము వేరు చుట్టుకొనునె.

131. ప్రణయ కలహము
1301
చేర్చి కౌగిలంప జేయంగ పొలయల్కు
ప్రణయ మందు మధుర భావమగును.
1302
వలపునందు నలుక వంటకమం దుప్పు
హెచ్చు తగ్గులైన హితము దప్పు.
1303
ఉన్న కోపమట్లె నుచ్చదశకుఁ జీవ
గౌగలింపనై తిఁగలిసి ప్రియుని.
1304
పొలతి నలుక బాపి బుజ్జగింపక యున్న
లతను వ్రేళ్ళతోడ లాగినట్లు.
1305
రసిక వరుల టన్న రమణుల బొలయల్క
నెడద విరియ జేయు గడుసుదనమె.
1306
పండు టెక్కువైన పండకగాయైన
నిష్ఫలంబె యలుక నియమ మిట్లు.
1307
విరహ మరుగనట్టి ప్రియునితోఁ గలహింపఁ
గలియడేని మరలఁ గష్టమబ్బు.
1308
అలిగి లాభమేమి యర్థంబుగాకున్న
విరహబాధ హెచ్చి విసుగుబుట్టు.
1309
నీరుతోడ నీడ నెమ్ముది నిచ్చును
కలహ భావమిట్లు వలపు గలప.
1310
విరహమందు ముంచి వెడలిన వానితో
కోపపడక కోర్కె కూడనెంచు.

132. కలహ సూక్ష్మత
1311
అతని వెడద రొమ్ము నంటనైతిని దాకి
ముగ్దలెల్ల జూచి మురిసిరౌట.
1312
తుమ్మె తుమ్మునంత తుమ్ముకు నూరని
పలుకరింతు ననుచు నలుక మాని.
1313
మాల వేసుకొంటి మానిని వెంటనే
ఎవరు చూడ వేషమిట్టు లనియె.
1314
ఎక్కువ గలదంటి మక్కువ నీపైన
అందు కలిగె నెవరి కన్న యనుచు.
1315
ఇంక నిన్ను విడువ నీ జన్మకని జెప్ప
కార దొడగె నీరు కండ్లనుండి.
1316
తలచుచుంటినంటి తలుపంగ మరచితో
అనుచు విడచె గౌగిలిని తనంత.
1317
మంగళమనె తుమ్ము మరునిముసమ్ము కే
ఎవరి దలచి తుమ్మితివనె యలుక.
1318
తుమ్ము నణచుకొంటి తొయ్యలి వెంటనే
తలచుకొన్న దెవరు దెలుపమనియె.
1319
కొసరి కొసరి యెట్లొ కోపంబు దీర్పగా
ఎవరు నేర్పరనుచు యింతి యలిగె.
1320
మౌనముగను జూడ మనసులో నీకున్న
మగువ యెవ్వతె యని మరల యలిగె.


133. పొలయలుక సుఖము
1321
వారియందు నెట్టి నేరమ్ము లేకున్న
కలహమందె వలపు పులకరించు.
1322
ప్రణయ కలహమందు వలపు వాడినగాని
హానికన్న మేలె యధికమగును.
1323
కామమందు ప్రణయ కలహమ్ము కన్నను
సౌఖ్యమిచ్చు వేరె స్వర్గమేది
1324
కలహమాడి యీడ్చి కౌగలించిన బలము
తలచుకొన్న నిపుడు దడను బుట్టు.
1325
దూరమగుట మంచి, నేరమ్ము లేకున్న
కలసియుంట కన్నఁ గౌగలించి.
1326
ఆరగింపుకన్న నరుగుటలో నింపు
కౌగలింపుకన్నఁ గలహ మింపు.
1327
కలహమునను గెలుపు వలపునం దోటమి
కలయికందుఁ దానిఁ దెలియనగును.
1328
రసము ప్రణయమునను నొసలు జెమర్చఁగా
కామకేళిఁ దనియఁ గలహమాడి.
1329
రమణి యలుక నుండ రాతిరి పెఱుగంగఁ
గౌసరి యాసఁదీర్పఁ గోరుకొందు.
1330
కామమునకు ప్రణయ కలహమ్ము జీవమ్ము
భోగమునకు నదియె పూర్ణరక్ష.

No comments:

Post a Comment