Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
61.
అలసత్వము
|
|
0601
|
వెలుగు
గలుగు గృహము మలిగిపోకున్నను
గోళ్ళు
గిల్లుకొన్న గ్రిడ్డిదగును.
|
0602
|
అలసత
కలసతను కలిగింత్రు తమ యిల్లు
విల్లుగాగనుండ
నెంచువారు.
|
0603
|
గోళ్ళు
గిల్లుకొనుచు కూర్చున్న కాపుర
మంతరించు
వానికన్న ముందు.
|
0604
|
ఇల్లు
గనినవేరు గుల్లయైపోవును
మందు
డగుచు యత్నమందకున్న
|
0605
|
మఱవు,
జాగు, నిద్ర, మందతయును నాల్గు
చెడగ
నుండు వాని తొడవు లగును.
|
0606
|
ఖ్యాతి
తరుగకున్న నీతిగా దలసత
పొందఁదగినదైనఁ
జొందలేము.
|
0607
|
పాలుమారుటైన
పనిపాట్లు లేకుండా
పోటుగాను
నిందమాట వచ్చు.
|
0608
|
భవ్య
గృహము నందు ప్రాల్మారి కేర్పడ్డ
శత్రువులకు
సేవ సలుపవలయు.
|
0609
|
మరుగుపడిన
వేరు మెరుగౌను శీఘ్రమ్మె
మందముడిగి
కార్యమగ్నుడైన.
|
0610
|
అడుగులందు
దార విడచిన రాజ్యమ్ము
మరల
పొందవచ్చు మందముడుగ.
|
|
|
62.
ప్రయత్నము
|
|
0611
|
విలుగాదటంచు
వినుగొందగా నేల
దాని
కగును విలువ పూనుకొనిన.
|
0612
|
పూనుకొన్న
పనిని పూర్తిగా జేయక
విలువు
వాని జగము నిందజేయు.
|
0613
|
ఉపకరింప
గల్గు నుత్తమ గుణములు
సాహసాత్ము
జూచి మోహపడును.
|
0614
|
జేడి
చేతనుండు వాడి ఖడ్గమురీతి
కార్య
శూన్యు డాద గల్గుటెల్ల
|
0615
|
సుఖము
మఱచి కార్యముఖమున కన్నున్న
వానివలన
బ్రతుకు వన్నెకెక్కు.
|
0616
|
సాహసమ్ము
దెచ్చు సంపదలిన్నింట
నడ్డిలేమి,
లేమి కంతులేదు.
|
0617
|
సోమరి
యగువాని జొచ్చు మూదేవి
లక్ష్యపరుని
గూడి లక్ష్మి దిరుగు.
|
0618
|
లేకయున్న
నింద లేదండ్రు యత్నంబు
జేయనవుడె
నింద జేరు నతని.
|
0619
|
విధయె
శత్రువైన విశ్రాంతి నెఱుగక
పాటుబడ్డ
కూలి లోటులేదు.
|
0620
|
సాహసాత్మ
తోడఁ సహకరించును లక్ష్మి
సోమరి
యగువానిఁ లేమివూను
|
63. నిబ్బరము
|
|
0621
|
దుఃఖములను
పారదోలంగ మార్గంబు
నొవ్వకుండ
జూచి నవ్వుకొనుటె.
|
0622
|
పొంగివచ్చు
దుఃఖముల నెల్ల ప్రాజ్ఞుండు
మనసులోనె
ద్రిప్పి మాన్పుకొనును.
|
0623
|
కష్టములను
జూచి కష్టపడనివారు
కష్టవెట్టగలరు
కష్టములనె.
|
0624
|
ఎట్టులున్న
మార్గ మెద్దులాగును బండి
పట్టుబట్ట
వెతలు పలచబడును.
|
0625
|
వెతలు
వేరుకొన్న మతి చలింపదయిన
వెతలు
వెతలు పడెడు గతికివచ్చు.
|
0626
|
పోయెనంచు
దిగులు పొందుటను తెలియ
రున్ననాడు
లోభ ముడుగువారు.
|
0627
|
కష్టములకె
మేను కలదను వెద్దలు
తొట్రుపాటు
బడరు దుఃఖములకు.
|
0628
|
సహజమనుచు
వెతలు సహించి సౌఖ్యమ్ము
కోరకున్న
దుఃఖ భారముడుగు.
|
0629
|
సుఖము
గల్గు పట్లఁ జొక్కిపోవని వారు
వెతలు
గల్గుపట్ల వెఱ్ఱిగారు.
|
0630
|
కష్టమనుభవింప
నిష్టపడెడి వారి,
వైరులైన
జూచి గౌరవింత్రు.
|
64. మంత్రి
|
|
0631
|
సాధ్య
సాధనములు సమయమ్ము స్వప్రజ్ఞ
యచితమగును
జూడ సచివునందు.
|
0632
|
అభయ,
మాలకింపు, ప్రభవమ్ము, జ్ఞానమ్ము,
తంత్రమైదు
వలయు మంత్రి కెవుడు.
|
0633
|
సచివుఁ
డెరుగవలయు సామ దానమ్ములు
చెదరగొట్టి
మఱలఁ జేరదీయ.
|
0634
|
స్థిరముగాను
దెలిసి స్థిరముగాఁ జెప్పెడి
కార్యవాది
మంత్రిగాఁగఁ దగును.
|
0635
|
ధర్మమెరిగి
మాట ధాటిగ జెప్పెడి
కర్మటుండె
మంత్రిగాగ దగును.
|
0636
|
ప్రజ్ఞతోడఁ
శాస్త్ర పరిచయంబున్నచో
నంతకన్న
విజ్ఞ తరయ గలమె.
|
0637
|
ఎంత
దెలిసియున్న నిల సాంప్రదాయమ్ము
మరువ
దగదు కార్య మార్గమందు.
|
0638
|
తనకు
దెలివిలేదు, వినమన్న వినడట్టి
వాని
దిద్దగలుగు వాడె మంత్రి.
|
0639
|
మర్మమైనయట్టి
దుర్మంత్రి కన్నను
పదియు
కోట్లు మేలు పగతుడైన.
|
0640
|
కాగల
పనులైన కాకనే జెడిపోవు
చేతగాని
మంత్రి చెంతనున్న.
|
|
|
65. వాక్చాలత
|
|
0641
|
మాటకారితనము
మానిత సంపద
విలువలందు
దాని విలువవెరు.
|
0642
|
మాట
కోడవచ్చు మంచి చెడుగులన్ని
నిలువుకొనుము
మంచి పలుకు లెఱిగి.
|
0643
|
మిత్రవరుల
వోలె శత్రువులైనను
“జార”
యనుటె మాట సౌరనంగ.
|
0644
|
మాట
తిరెరింగి మాటాడు మాటాడ
దానిలోనె
ధనము ధర్మముండు.
|
0645
|
పలుకబూన
మారు బలుకని రీతిగా
తెలిసి
పలుకునదియె పలుకనంగ.
|
0646
|
మధుర
భాషణముల నెదిరి జెప్పిన దాన
మంచి
నెఱుఁగు నతఁడె మాటకారి.
|
0647
|
వాగ్విలాస
మెఱిఁగి వదరక విర్భీతి
పలుకు
నతని గెలువ వశముగాదు.
|
0648
|
పలికి
నట్లు జగతి పనిచేయు వాక్శుద్ధి
కలిగి
పలుకు నతఁడు పలికెనేని.
|
0649
|
అతిక
జెప్పు వారు మితభాషణమ్ముల
యుక్తియుక్త
మెరుగకున్న వారె.
|
0650
|
పరిమళమ్ము
లేక విరిసిన పూగుత్తి
చదివి
వ్యక్తపరుప జాలకున్న.
|
|
|
66. సత్క్రియ
|
|
0651
|
తోడు
మంచిదైన తోడాను సంపద
శిష్ట
వృత్తి సకల సిరుల నిచ్చు.
|
0652
|
ఆచరింప
గవల దపకీర్తి దెచ్చెడి
కార్యములను
సర్వకాలమందు.
|
0653
|
రాను
రాను వైకి రాగోరు వారలు
బొగడఁబడని
బనులఁ దెగడవలయు.
|
0654
|
గాసితోడ
నెన్ని కష్టాల పాలైన
చిత్త
బలులు హీనవృత్తి దిగరు.
|
0655
|
చేయరాదు
వెనక జింతించు పనులను
చేసియున్న
మఱల చేయవలదు.
|
0656
|
కన్నతల్లి
యాకలన్నను, దానికై
తప్పుదారి
ద్రొక్క దగవు గాదు.
|
0657
|
దుష్కృతంబు
వలన దొర యౌటకన్నను
వేదవడిన
శిష్టవృత్తి మేలు.
|
0658
|
చేయదగని
పనుల జేయంగ లాభమ్ము
కలుగుటైన
కీడు గలుగు మఱల.
|
0659
|
దుఃఖ
పెట్టి యొరుల దోచిన ద్రవ్యమ్ము
దుఃఖ
పడగ జేసి తొలగిపోవు.
|
0660
|
మోసగించు
వృత్తి దాచిన సంపద
యోటికుండలోని
నీటి విధము.
|
|
|
67. కార్యసిద్ధి
|
|
0661
|
సర్వకార్యసిద్ధి
సంకల్ప సిద్ధియే
అన్ని
దాని యందె యైక్యమగును.
|
0662
|
చిక్కులందు
బడమి, శ్రేష్టమ్ము పడినచో
చొక్కి
పోమి కార్యసూరు మతము.
|
0663
|
పూనుకొన్న
పనిని పూర్తిగావింపక
నిలువుకొన్నవాడు
నిందపాలు.
|
0664
|
చెప్పవచ్చు
నెన్నొ చెప్పిన రీతిగా
ననుసరించు
వార లరుదు జూడ.
|
0665
|
కీర్తి
దెచ్చుపనుల కృతకృత్యు డైనచో
చక్రవర్తియైన
సత్కరించు.
|
0666
|
కోరు
వారి శ్రద్ధ కొఱతఁగాకున్నచో
కోరుకొన్న
దెల్లఁ గూడివచ్చు.
|
0667
|
ఆకృతిగని
యెంచ కల్పుగా నొకనిని
తేరును
కడచీలె తిరుగబెట్టు.
|
0668
|
శంక
లేక నొకటి సంకల్ప శుద్ధితో
విసుగు
లేకఁ జేయ దొసఁగు రాదు.
|
0669
|
విఘ్నములకు
వెఱచి విడువక సత్కర్మ
పూర్తిజేయ
వలయు పూనినట్లు.
|
0670
|
ఎన్ని
యున్న లోక మన్నదు, దృఢచిత్త
మొండు
లేని యెడల బెండుగాన.
|
68. కార్యదీక్ష
|
|
0671
|
నిర్ణయమున
కెల్ల నిర్వాహ దీక్షయే
యాలసింప
దాని కవగుణమ్ము.
|
0672
|
ఆలసింప
దగిన దాలసించుట లెస్స
వేగపడగ
నున్న జాగుచెడువు.
|
0673
|
కార్యమెట్టిదైన
కడతేర్చవలయును
సాధ్య
మెట్లొ యట్లు జంకువిడచి.
|
0674
|
శత్రుశేషమున్న
శ్రమశేషముండిన
నగ్ని
కణము నార్పనట్టి విధము.
|
0675
|
కలిమి
బలిమిస్థలము కాలమ్ము పక్వమ్ము
నెఱిగి
జేయ పనులు మెరుగు పడును.
|
0676
|
అగునొ
కాదొ దెలసి యగుటైన నద్దాని
ఫలితమెఱిగి
జేయనలయుపనిని.
|
0677
|
అనుభవజ్ఞుడైన
నడిగి జేసిన కార్య
మెప్పటికిని
చెడక మెప్పు వడయు.
|
0678
|
కార్యమునకు
తోడు కార్యమ్ముగైకొమ్ము
యేన్గు
నేన్గు తోడ నీడ్చినట్లు.
|
0679
|
ఆప్తు
కన్న మేలు సత్యంత త్వరగాను
కాని
వారితోడ కలియుటగును.
|
0680
|
తగ్గుదలను
జూచి తడయక వెంతనే
భీతి
దీర్ప సంధి నీతి యగును.
|
69.
దూత
|
|
0681
|
ప్రేమ
సత్కులమ్ము పృధినీళు సంప్రీతి
కలుగు
నతఁడు దూత గాగ దగును
|
0682
|
ప్రేమ,
ప్రజ్ఞ, విషయ విశ్లేషణా శక్తి
దూతకు
నివి మూడు తొడవు లగును.
|
0683
|
విదురులందు
గొప్ప విదురుండు ద్యూతమ్ము
క్ష్మాతలేంద్రు
లెదుట సలువు నతఁడు.
|
0684
|
తగిన
రూపు, తెలివి తరుగని విద్యయు
మూడు
దౌత్యమునకు ముఖ్యమగును.
|
0685
|
ప్రియపడంగ
జెప్పి వెగటును తప్పించి
నయము
గూర్చు నతఁడె స్వయము దూత.
|
0686
|
నీతి
నిర్ణయమ్ము నిలకడ నిర్భీతి
దోహదమ్ములగును
దౌత్యమునకు.
|
0687
|
బాధ్యతెరిగి
కాలపక్యమ్ము గుర్తించి
స్థానమెఱిగి
పలుకు జ్ఞాని దూత.
|
0688
|
సత్ప్రవర్తనమ్ము
సఖ్యమ్ము తుల్యత
దూత
లక్షణముగఁ జూతురెల్ల.
|
0689
|
తప్పు
బలుక డెవఁడొ తడబాటుగానైన
వాఁడె
తగిన రాయబారి యగును.
|
0690
|
చావు
మూడుటైన క్ష్మాతలేంద్రుల మేలు
గోరు
నతఁడె రాయబారి యగును.
|
70. రాజాశ్రయము
|
|
0691
|
తగిలి
తగలకుండ పెగ గాచుకొన్నట్లు
బ్రతుకవలయు
నృపుని పాలనున్న.
|
0692
|
కోరరాదు
రాజు కోరెడి కోర్కెల
నట్టి
యాశ్రితునకు నమరు సిరులు.
|
0693
|
మెలగవలయు
నెంతొ మెలకువగా నుండి
శంకరాగ
మాన్ప శక్యపడదు.
|
0694
|
చెవిని
జెప్పరాదు చేరి నవ్యగరాదు
విడిచి
చెప్పునేని వినుట మేలు
|
0695
|
మర్మ
మడుగరాదు మర్మంబు వినరాదు
వినుమటన్న
దానిఁ వినుట లెప్ప.
|
0696
|
ఊహ
నరసి కాలమూహించి విన్నది
వినయముగను
బల్కు వెగటు విడక.
|
0697
|
వినగ
దగ్గ వాని వినిపించి వినరాని
వడిగెనేని
జెప్ప దొడఁగ రాదు.
|
0698
|
బాలుఁడనియు
తనకు బంధువనియు నెంచ
వలదు
రాజ్యపదని గలిగినపుడు.
|
0699
|
ఎన్నబడితి
మనుచు నేదైన జేయరు
సుస్థిరమతులైన
నుజనులెపుడు.
|
0700
|
ప్రాతవాళ్ళ
మనుచు నీతికి దూరమై
నడచుకొన్న
పదవినష్టమగును.
|
No comments:
Post a Comment