Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
91.
స్త్రీలోలుఁడు
|
|
0901
|
స్త్రీల
ననుసరింపఁ జెడుపోను, కార్యజ్ఞు
లిష్టపడని
కార్యమిది యటండ్రు.
|
0902
|
మగువలందు
దగిలి మఱచిన సర్వమ్ము
వచ్చుదాని
కన్నఁ వగపు హెచ్చు
|
0903
|
మగువ
కణఁగి యుండు మగవానికే ప్రొద్దు
సుజనులుండు
చోట శోభరాదు.
|
0904
|
మగువ
కణఁగ మోక్ష మార్గమ్ము శూన్యమ్ము
పూనుకొన్న
పనులు పూర్తిగావు
|
0905
|
సతికి
వెఱచు నతఁడు సతతమ్ము వెరచును
సాయపడుటకైన
సజ్జనులకు.
|
0906
|
అమర
పదవులందు నమరినవాడైన
నాతిఉ
కణఁగి యున్నఁ ఖ్యాతిరాదు.
|
0907
|
పొలతి
మాటఁ వినెడి పురుషన కన్నను
మానదృష్టి
నున్న మగువ మేలు.
|
0908
|
మిత్రహితము
లేదు మిగలదు ధర్మము
లతివ
మాట దాట నతని కెందు.
|
0909
|
పొలతి
కణగుఁ నతండు పురుషార్థముల మాని
పుణ్యలార్యములను
బోనడంచు.
|
0910
|
దీర్ఘదృష్టియందు
స్థిరపడ్డ వారలు
స్త్రీల
మోహమందు జిక్కుకొనరు.
|
|
|
92.
వెలయాలు
|
|
0911
|
వేశ్య
వినయమెల్ల వెలకోసమేగాన
ముచ్చటింపులెల్లఁ
ముప్పుఁదెచ్చు.
|
0912
|
వెలకు
దగ్గప్రేమ వెలయాలు చూసించు
మోసపోకు
దాని మోహమునకు.
|
0913
|
పడుపుకాంత
సుఖము, నడిరెయి దెలియక
శవముతోడ
గలియు చందమగును.
|
0914
|
సానిదాని
పొందు సత్యర్థ మెఱిగిన
వారు
గోరుకొనరు వాస్థవముగ.
|
0915
|
గౌరవమ్ము
గోరువారలు వెలయాలి
యందచందములకుఁ
జిందిపోరు.
|
0916
|
సొంత
తెలివితేట లెంతేని గలవారు
వారవనిత
సుఖముఁ గోరుకొనరు.
|
0917
|
తలపునందులేక
వలపించు వగలాడి
గూడువారు
లేత గుండెవారు.
|
0918
|
మూర్ఖుడైన
వాని మోహని దయ్యమ్ము
వంచగించునట్టి
వారవనిత.
|
0919
|
సిగ్గు
లేనిదాని నిగ్గైన కౌగిలి
పాప
మంటగట్టు పాశమగును.
|
0920
|
జూదము,
వెలయాలు, బోరత్వ మిమ్మూడు
సిరి
దొఱంగు వాని స్నేహమగును.
|
93. త్రాగుబోతు
|
|
0921
|
కీర్తి
మాయమగును, కేవల పడనగును
కల్లు
ద్రాగు గుణముఁ గలిగెనేని.
|
0922
|
పెద్దవారి
మంచి వద్దనుకొన్నచో
త్రాగి
తందనాల నూఁగవచ్చు.
|
0923
|
త్రాగువాని,
కన్నతల్లియే రోసిన
నార్యులైన
వారి నడుగనేల?
|
0924
|
మానహానుడైన
మదుపానరక్తుని
చేష్టఁజూడఁ
సిగ్గె సిగ్గుపడును.
|
0925
|
వైక
మొసగి బదులు మైకమ్ము గొనునట్టి
మందబుద్ధికేమి
మంచి గలుగు.
|
0926
|
నిద్ర,
చావువాని నియమమ్ము సమమౌను
విషము
మదువు రెంటి విధము నట్లె.
|
0927
|
ఎఱుగనట్లు
మరుగు మరుగున త్రాకిన
ఉమ్మి
వేతురతని నూరివారు.
|
0928
|
త్రాగుబోతువాఁడు
త్రాగలే డనలేడు
తప్పు
దాచ వాని తరముగాదు.
|
0929
|
దీపమెత్తి
నీళ్ళ దేవిన చందమ్ము
త్రాగువాని
మాన్పఁ దరముగాదు.
|
0930
|
బోదలేనివేళ
బోదలో బడియున్న
వానిఁజూడ
బుద్ధి వచ్చునేమొ.
|
94. జూదరి
|
|
0931
|
చేప
గాలమందు జీక్కెడు విధమౌను
గెలుపు
సిద్ధమైన వలదు జూదు.
|
0932
|
ఒకటి
వచ్చినట్టి యుత్సాహమున నూరు
వదలు
వాని బ్రతుకు బదిలమగునె?
|
0933
|
దొల్లి
పోవువాని దొడ్డగా నమ్మన
ద్రవ్యమెల్ల
నెదిరి దారిబట్టు.
|
0934
|
కీడుఁ
మూడఁజేసి కీర్తిని పోగొట్టి
పేదవడఁగ
జేయుఁ జూదమొండె.
|
0935
|
హస్తకౌశలమ్ము
నక్షపాటమున్న
పేదరికమె
వచ్చుఁ జూదమాడ.
|
0936
|
తనిక
బెక్కు బాధ లనుభవింప దగెను
జూదమందు
జిక్కి చొక్కు నతడు.
|
0937
|
తరతరాల
నుండి తనదాక వచ్చిన
యాస్తి
జూదమాడ నంతరించు.
|
0938
|
కల్ల
లాడజేసి కనికరమ్ము బాపు
నాంది
జూదమగును నరకమునకు.
|
0939
|
కూడు
గుడ్డ సొత్తు కోవిదత్వము కీర్తి
మంట
గలియు జూద మంటుకొనిన.
|
0940
|
ఆడుచుండు
జూద మోడంగ నోడంగ
బాధలన్ను
నాశ బ్రతుకునందు.
|
|
|
95. మందు
|
|
0941
|
హెచ్చుతగ్గులందు
వచ్చు నస్వస్థత
వాత
పిత్తశ్లేష్మ రీతిగాను.
|
0942
|
తిన్న
దరిగెనంచు దెలిసి భోంచేసిన
మానవునకు
వేరె మందు వలదు.
|
0943
|
జీర్ణమైన
వెనుక జేసిన భోజన
మల్పమైన
వృద్ధి యాయువునకు.
|
0944
|
ఆకలి
యగునప్పు డనువైన యాహార
మెఱిఁగి
సరిగ దిన్న మరుగు బబ్బు.
|
0945
|
కానిదాని
దినక నైనది మితముగా
నారగింప
వ్యాధు లంటవండ్రు.
|
0946
|
అతిగ
దినని వాని కారోగ్యమున్నట్లు
అతిగ
దినెడువాని కబ్బు జబ్బు.
|
0947
|
రుచికి
దిన్నయెడల రోగంబు లెక్కువై
పెక్కు
బాధలతని లెక్కబెట్టు.
|
0948
|
జబ్బు,
కారణమ్ము, శమనమ్ము గుర్తించి
మందు
నొసంగ వైద్య మార్గమగును.
|
0949
|
వైద్యఁడైనవాడు
వ్యాధిని గుర్తించి
వయసు
కాల మెఱిగి వ్యాధి దీర్చు.
|
0950
|
వ్యాధియు,
పరిచర్య, వైద్యఁడు, రోగియు
వైద్యశాస్త్ర
పాటవంబు నాల్గు.
|
|
|
96. వంశము
|
|
0951
|
మంచి
యింటఁ గాక మానమ్ము సమదృష్టి
నితర
గృహములందు వెదక గాదు.
|
0952
|
సత్యనిష్ట,
లజ్జ, సత్వర్తనంబును
సంప్రదాయమునకు
సహజ గుణము.
|
0953
|
మాట
సొగసు, నీవి, మందహాసము మూడు
గుణములుండు
గొప్పకులమునందు.
|
0954
|
గొప్ప
యింటివారు తప్పు దారికి బోరు
కోట్లకొలది
ధనము కూడుటైన.
|
0955
|
ఇచ్చునట్టి
గృహము నొచ్చిపోయినగాని
ప్రాత
గుణము మిగిలి పరిమళించు.
|
0956
|
మచ్చరాక
బ్రతుక నిచ్చగించినవారు
ప్రతినకైనఁ
బాడుపనులఁ దిగరు.
|
0957
|
పెద్దయింటి
తప్పు పెద్దగాఁ దెలియును
చంద్రబింబమందు
చాయ విధము.
|
0958
|
గుణము
విడచి దోషగుణములఁ బాల్పడ్డ
వంశమందు
బుట్టు సంశయమ్ము.
|
0959
|
పుట్టునపుడె
మొలక మట్టిసారము దెల్పు వ్
వంశ
మెట్టి దగునొ వాక్కు దెల్పు.
|
0960
|
మంచి
వలయునన్న మర్యాదవలయును
వినయ
మవసరమ్ము వెలయఁ గులము.
|
|
|
97. మానము
|
|
0961
|
ఎంత
గొప్పదైన నింటికిఁ దగకున్న
దానిఁ
మానుకొనుటె మానమగును.
|
0962
|
గౌరవమ్ము
కీర్తి గావలె ననువారు
మరువరాదు
యింతె పరువు నెరిగి.
|
0963
|
పెరుగునప్పు
డహము తరుగంగ వలయును
తరుగునప్పు
డహము పెరుగవలయు
|
0964
|
పదని
భ్రష్ఠులైన పతితకేశములట్లు
విలువ
చెడుట లోక విదితమగును.
|
0965
|
ఏనుగంటివాడు
యెలుకయైపోవును
చెయరాని
పనులఁ జేపెనేని.
|
0966
|
పూజ్యతయునురాదు
పుణ్యంబు దక్కదు
తుంటరులగువారి
వెంటఁదిరుగ.
|
0967
|
అడిగి
బ్రతుకనేల నవమదించెడివారి
చెడినమేలె
వారి నడుగకుండ.
|
0968
|
చెడియు
గౌరవమ్ము జీవించుటన్నది
మందు
దినుచు బ్రతుకు చందమగును.
|
0969
|
ఉసురు
విడచు చెమరి యొక్కరోమముబాయ
ప్రాణమిడుదు
రట్లె మానధనులు.
|
0970
|
మానరక్ష
కొఱకు ప్రాణమ్ము బలిజేయు
వారి
నెఱిఁగి జగతి ప్రస్తుతించు.
|
98. పెద్దరికము
|
|
0971
|
ఖ్యాతి
వారివారి కార్యమందానక్తి
వెలితి
దానితందు విముఖడైన.
|
0972
|
జన్మ
మందఱికిని సమమౌను కర్మలే
వారి
వారి గౌరవమ్ము నిచ్చు.
|
0973
|
పీఠమెక్కినంత
వెద్దగా డల్పుండు
వెద్ద
చిన్నగాడు గద్ద దిగిన.
|
0974
|
ఖ్యాతి
తన్నుతాను కాపాడుకొనుటండె
ధర్మపత్ని
విధము నిర్మలముగ.
|
0975
|
శ్రేష్ఠలైనవారె
జేతురు చేసిన
చేతదగిన
పనులు శ్రేష్ఠముగను.
|
0976
|
అల్పుల
మదికంద దార్యుల శక్యమ్ము
పోదవలయు
ననెడి బుద్ధులెల్ల.
|
0977
|
అల్పులైనవారి
కధకారమిచ్చిన
స్వల్ప
పనులజేయ సాహసింత్రు.
|
0978
|
అణిగియుండు
గొప్పతనమెల్లరందును
చిన్నతనము
గర్వ శిఖరమెక్కు.
|
0979
|
పెద్దతనము
గర్వ పద్ధితి నెఱుగఁబో
డల్పు
డెవుడు దాని దెల్పుచుండు.
|
0980
|
తప్పు
మఱచు పెద్దతన మెప్పుడైనను
చిన్నతనము
దాని జెప్పి దిరుగు.
|
99.
ఆదర్శము
|
|
0981
|
మార్గదర్శకులగు
మహనీయలెల్లరు
నీతిఁ
దప్పనట్టి నిష్ఠపరులు.
|
0982
|
గుణమె
గొప్పవారి ధనమగు మిగిలిన
ధనము
లన్ని ధనము లనరు వారు.
|
0983
|
ప్రియము
నయము భయము దయయు సత్యమ్ము
గొప్పదనము
నైదు గుంజలగును.
|
0984
|
తాపసాంశమనఁగఁదగు
నహింసావృత్తి
నేరమెన్నహున్న
నీతివృత్తి
|
0985
|
వినయవంతుడైన
విక్రమవంతుడు
శత్రువులనుజేయు
మిత్రువులగ.
|
0986
|
శీలమునకు
గుర్తు చిన్నలనెడనైన
తప్పు
నెఱిగి దాని నొప్పుకొనుటె.
|
0987
|
ఉపకరింపకున్న
నపకారమెంచుచో
శీలమున్నదనుచు
జెప్పలేము.
|
0988
|
లేమి
కాదు ధనము లేనంతమాత్రాన
గుణముఁ
గల్లియుంటె గొప్పదనము.
|
0989
|
గుణసముద్రు
లుర్వి మునిఁగిపోవగ నున్న
నాశయంబు
దొలఁగ రడుగుగూడ.
|
0990
|
ఆర్యులందు
నున్న నాదర్శ మెఱిగిన
ధరణి
మునిఁగి పోకఁ దప్పుకొనునె.
|
100. శీలము
|
|
0991
|
అందఱియెడఁ
గలసి యన్యోన్యముగ నుంట
సుగుణమునకు
నుండు సులభ గుణము.
|
0992
|
కనికరమ్ము
వంశ గౌరవ మీరెండు
చాటి
చెప్పు నొకని సద్గుణంబు.
|
0993
|
కాదు
దేహభావ మెదియు సమమన
సద్గుణాళి
సమమె సమమనంగ.
|
0994
|
నీతి
నియమములను ప్రీతితో పాటించి
మెలఁగువారి
నెందు మెచ్చు జగము.
|
0995
|
సరసమైన
కీడె స్తబ్ధులతోనాడ
విరసమైనమేలు
విజ్ఞులందు.
|
0996
|
ఉత్తములగువార
లుండుటచేతనే
మహిని
మహియటండ్రు మట్టియనక
|
0997
|
సూదివంటి
బుద్ధి సూక్ష్మతయున్నను
గుణములేమి
వృక్ష గణసమమ్ము.
|
0998
|
స్నేహముడిగి
చెడువుఁ జేపెడి ప్రబలందు
ప్రీతి
జూపుచుండు నీతిపరుఁడు.
|
0999
|
కలుపుగోలుతనము
గఱవైన వానికి
చిట్టుచీకటగును
పట్టపగలే.
|
1000
|
బుద్ధిహీను
నొద్దఁ దద్దయు ధనముంత
మురికి
పాత్ర పాలుఁ బోసినట్లు.
|
No comments:
Post a Comment