Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
21. అపకృతి
|
|||
0201
|
క్రూర కర్ముఁడన్ని కృత్యంబులను జేయు
పాపమునకు వెఱచు పండితుండు.
|
||
0202
|
ముప్పు వలన ముప్పు మూడును గాబట్టి
నిప్పు నొప్పు ముప్పు దప్పుకొనుము.
|
||
0203
|
విజ్ఞతయన దన్ను వేధించు నారికిన్
చెడుపు జేయకున్న శిక్ష గుణము.
|
||
0204
|
ఒకరి కీవు కీడు నొనరింపఁ దలచిన
దాని నీకు ద్రిప్ప ధర్మముండు.
|
||
0205
|
ఏమి తేనివాడ నేనేమి జేసిన
న్నేమి యన్న వాని లేమి పూను.
|
||
0206
|
చిక్కు లొరుల కెవుడు చేయని వాడైన
చిక్కులందుఁదాను చిక్కకుండు.
|
||
0207
|
దీర్ఘ వైరమునను దెరవుండు బ్రతుకంగ
దుష్ట కర్మపలన కష్ట మబ్బు.
|
||
0208
|
అడుగు లండి సీడ నడయాడు నట్లుగా
చెడువు విడువ దెవుడు చెడ్డవాని.
|
||
0209
|
హాని జేయ వలవ దల్పంబు గానైన
దనకుఁ దానె రక్ష దలచుటైన.
|
||
0210
|
చెప్పవచ్చు నతఁడు చెడిపోవడని రూఢి
చెడువు పరుల కెపుడు చేయడేని.
|
||
|
|
||
22. ఉపకృతి
|
|||
0211
|
వాన కొరదేది వర్షించి నందుల
కుపకరించు వార లుందు రల్లు
|
||
0212
|
వివిధ వృత్తులందు విత్తంబు జేర్చుట
నీయ దగినవారి కిచ్చు కొఱకె.
|
||
0213
|
ఉపకృతి సరియగు నుత్తమ ధర్మంబు
భువిని లేదు మరియు దివిని లేదు.
|
||
0214
|
ఉపకరించువార లున్నట్లుగా లెక్క
సాయ పడనివారు చచ్చినట్లె.
|
||
0215
|
ఊరివారికెల్ల నుపయోగపడు నుయ్యి
నిండినట్లె దాత కుండు ధనము.
|
||
0216
|
మార్గ మధ్యమందు మాధుర్య ఫలవృక్ష
మున్న విధము దాతకున్న ధనము.
|
||
0217
|
సకల రోగములకు సంజీవి మూలిక
ధనము దాతకున్న క్షణము నందు.
|
||
0218
|
దాతయైనవాడు దారిద్ర్యమున నున్న
మాన డుపకరించు మార్గ మతఁడు
|
||
0219
|
ఈయలేని సమయ మేర్పడినప్పుడే
దాత వేదనంచు దలంచు టెల్ల.
|
||
0220
|
ఉపకరింపఁ దనకు నపకారమేయైన
కూలిజేసి యైన గొనుము దాని.
|
||
|
|
||
23. ఈవి
|
|||
0221
|
లేవడి
కిడు దాని సీవిగాఁ భావింత్రు
ప్రతి
ఫలమ్మె మిగత వన్ని జాడ.
|
||
0222
|
అడుగరాదు
మేలుకై యున్ను నొకనిని
ముక్తి
లేదటన్ను యుక్త మీవి.
|
||
0223
|
లేవడి
యడుగంగ లేదని నొప్పింప
కిచ్చువాని
దుగును హెచ్చు కులము.
|
||
0224
|
సానుభూతి
తగదు సాయంబు గోరెడ్
ముఖము
నందు నగవు మొలచు దనుక.
|
||
0225
|
శక్తిపరుల
శక్తి శమియించు టాకలి
దాని
కన్న శక్తి దాని దీర్ప.
|
||
0226
|
ఆకలనెడి
నొప్పి యంచుకే చేరదు
వంచి
తినెడు గుణము నుంచుకొనిన.
|
||
0227
|
ఈవి
వలనఁ దృస్తి నెరుగునే ద్రవ్యమ్ము
కూడబెట్టి
విడచి కుములు లోభి.
|
||
0228
|
లేనివాని
కిడక తనకు తానె తినుట
వరమ
సీచమగును పస్తుకన్న.
|
||
0229
|
చావె
కష్టమండ్రు లేవడి యడుగంగ
సియలేమి
కన్న నింపె చావు.
|
||
0230
|
దేహి
యన్నవారి కాహర మిడుటయే
తనకు
వెనుక మిగులు ద్రవ్యమగును.
|
||
|
|
||
24. కీర్తి
|
|||
0231
|
ఇచ్చుటందు
కీర్తి వచ్చుట కన్నను
ఫలిత
మొండు లేదు బ్రతుకు నందు
|
||
0232
|
చెప్పువారు
మిగుల జెప్పుకొందురటన్న
పేదవారి
కిడిన పెద్ద తనమె.
|
||
0233
|
మిగులు
నట్టి దొకటి మేదిని సత్కీర్తి
యంతమగును
మిగతవన్ని తుదకు.
|
||
0234
|
నిలచెనేని
కీర్తి కలకాల మిల మీద
నమరపరుల
కన్న నధికు డతఁడు.
|
||
0235
|
చాపునందు
కీర్తి శంఖంబునకు వోలె
ప్రాప్తమగుట
గొప్ప పండితులకె.
|
||
0236
|
వెలయ
వలయు కీర్తి వెలయంగ లేకున్న
మనుట
కన్న ముంచి మరుగు పడుట.
|
||
0237
|
కీర్తి
లేనివారు కించపడుట మాని
దుష్ట
డన్నవారి దూరనేల.
|
||
0238
|
యశము
తోడఁ బ్రతుక వశముగాకున్నచో
కర్మవశము
వలన గలిగె నండ్రు.
|
||
0239
|
కీర్తిమరులు
పుట్టి మూర్తీభవించని
యట్టి
నేల చవటి పట్టుగాదె.
|
||
0240
|
బ్రతుకు
కీర్తితోడఁ బ్రతికినవారిదే
కీర్తిలేని
బ్రతుకు కేవలమ్మూ.
|
||
|
|
||
25. కరుణ
|
|||
0241
|
ధనములందు
ధనము దయతోడ నుండుటే
వ్యర్థునందు
గూడ నర్థ ముండు.
|
||
0242
|
కరుణ
కన్న మంచి కానంగ లేమొక్క
టాదరించు
మతము లన్ని దాని.
|
||
0243
|
కరుణ
గల్గినట్టి ఘనులకు లేనట్టి
దంధకార
మందు కుందు బ్రితుకు.
|
||
0244
|
తనకు
జరగదంచుఁ దలపొయగా నేల
పరుల
యందు తాను కరుణఁ జూప.
|
||
0245
|
కరుణ
కష్టములను కలిగింప దనుటకు
వా
యుమండలమ్మూ వనుధె సాక్షి.
|
||
0246
|
కరుణ
దొరఁగి మిగుల కష్టవెట్టినవారె
దుఃఖపడుదు
రిపుడు తోడులేక.
|
||
0247
|
ఇహము
ధనములేక నింపొందగాఁలేము
పరము
కరుణలేక బడయలేము.
|
||
0248
|
అర్థ
మెడలి మరల ననుభవింపగవచ్చు
కరుణ
దొరగి మరల మెరుగుపడము.
|
||
0249
|
కరుణలేక
ధర్మ కార్యంబు జేయుట
జోధవడకఁ
జదువు పొ త్త మట్లు.
|
||
0250
|
తన్న
దలతువేని, తన్నలు దిన్నది
తలచుకొన్న
కరుణ తానె వచ్చు.
|
||
|
|
||
26.
జీవహింస
|
|||
0251
|
బలియ
గోరి తాను బలిజేయు జీవుల
నట్టి
కెట్టు లమరు తరుణ
|
||
0252
|
దాచనట్టి
చేత ధన ముండనట్లుగా
మాంస
భక్షణమున మరుగు కరుణ.
|
||
0253
|
నేన
నున్నవాని చిత్తంబు రీతిగా
మాంస
భక్షకునికి మానసమ్ము.
|
||
0254
|
జాలి
యనిన ప్రాణి జంపమితొఁబాటు
మాంస
భక్షణమును మానుటగును.
|
||
0255
|
జీవహింస లేమి జీవిత ధర్మంబు
నంజు
డారగింప నరక మబ్బి.
|
||
0256
|
మాంస
మెవరు దినక మానిన వారైన
నమ్మువారు
భునిని వమ్ముగారె.
|
||
0257
|
మాంస
భక్షణమ్ము మానుట మంచిది
చింత జేయ వ్రణమె జీవి కద్ది.
|
||
0258
|
జీవులందు
నెల్ల జీవు డొక్కడె గాన
చంపు
తినరుదేని సాధు జమలు.
|
||
0259
|
వేయి
యజ్ఞములను జేయుట కన్నను
చంసి
తినక యున్న చాలు నదియె.
|
||
0260
|
ప్రాణికోటి
భక్తి భావాన ప్రణమిల్లు
ప్రాణ
ఘాతకమును మాను వాని.
|
||
|
|
||
27. తపస్సు
|
|||
0261
|
బాధలెల్ల
నొర్చి బాధింపకుండుటే
తపముఁ
జేయువారి తత్వమగును.
|
||
0262
|
తపము
తాపనులకె తనకును తగునని
వేషధారణమ్ము
వెట్టి తనము.
|
||
0263
|
తపము
జేయువారి కుపచరించగనేమొ
నన్యసింపరైరి
నకల జనులు.
|
||
0264
|
కాని
వారిఁజెరువ నైనవారిని గావఁ
దలచినంత
జేయ దగు తపస్వి.
|
||
0265
|
అనుభవింపవచ్చు
ననుకొన్న రీతిగాఁ
దపము
తప్పకున్న తథ్యముగను.
|
||
0266
|
తాపసాళి
క్రమము దప్పక వర్తింతు
రితరు
లీషణముల మతి భ్రమింత్రు.
|
||
0267
|
పుటముఁ
బెట్ట బెట్టఁ బొల్పొందు బంగారు
బాధ
పడను పడను బోధపడును.
|
||
0268
|
తాను
నేనటన్న దానిని విడనాడు
నతని
గొల్చు జగతి నుతుల కృతుల.
|
||
0269
|
తవము
దప్పనట్టి ధైర్యమ్ము గలవాడు
కాల
యముని గూడ కాలదన్ను.
|
||
0270
|
లేనివార
లధిక మైనట్టి హేతువు
వ్రతము
సల్పువారు స్వల్ప మగుటె.
|
||
28. బాహ్యవేషము
|
|
0271
|
ధూర్తుఁడొప్పిదముగ
మూర్తిభనించిన
నతని
చేష్ట లెఱిగి యాత్మ నవ్వు.
|
0272
|
పొగడవచ్చు
తన్ను గగనము దాహంగ
నందులోని
సత్య మాత్మ కెఱుక.
|
0273
|
పొలము
మేయునట్లె పులితోలుతో నావు
తిరిపమునకు
జేయు తీవ్ర తపము.
|
0274
|
వలలు
పన్ను విధము వ్యాధుండు పొదనుండి
దుష్ఠుఁడొదిగి
చేయు దొంగ తపము.
|
0275
|
చంపుకొనక
నాశ సన్యాసి ననునాడు
దిక్కు
మొక్కు లేక దిగులువడును.
|
0276
|
విగ్రహింప
లేక నియతాత్ము లట్లుండు
వారికన్న
ద్రోహపరులు లేరు.
|
0277
|
ఎఱ్ఱని
గురిగింజ కెటులుండు నల్లుపట్లు
మంచివారి
యందు మసి యొకింత.
|
0278
|
మనను
తేటగాక మాటిమాటికి నీట
మునిఁగి
తేలు జనులు మూల మూల
|
0279
|
ములుకు
బాధనిచ్చు ముచ్చటగానుండి
వీణ
ముదమునిచ్చు కోణయయ్య.
|
0280
|
గొరగ
వద్దు పెంచుకొనఁగ వద్దు జగతి
దోసమన్న
దాని త్రోసిపుచ్చ.
|
29. దొంగతనము
|
|
0281
|
బ్రతుకఁదలతువేని
పరిహాస పడకుండ
మదిని
దొంగతనము మరచిపొమ్ము.
|
0282
|
దొంగిలింపకున్న
దొంగిలించిన యట్లె
యట్టి
తలపు మనసునందు గలుగ.
|
0283
|
వెరిగినట్లు
వెరిగి వెరిగిన దంతయుఁ
తరిగిపోవు
దొంగతనపు ధనము.
|
0284
|
చోర
బుద్ధి వచ్చి చొచ్చుకపోయిన
బ్రతుకు
కాలమెల్ల పతన మగును.
|
0285
|
జాలిగుండె
కలుఁగ జాలదు చిర్చింప
దుష్టబుద్ధి
కలుఁగ దొంగిలింప.
|
0286
|
నీతిగాను
బ్రతుకఁ జేతగా దొకనికి
యాశ
గలిగెనేని మోసగింప
|
0287
|
చిక్కనముగ
బ్రతుక చేతైన వానికి
నపహారింప
దలఁచు నెపము లేదు.
|
0288
|
మేర
నెఱుఁగు నతఁడు మీరడు ధర్మంబు
మోర
నెపమునందె చోరుడుండు.
|
0289
|
చోర
వృత్తికన్న వేరెరుంగని యట్టి
చీడవురుగు
చెడును శీఘ్ర గతని.
|
0290
|
దొంగవాని
కిహమె దూరమై పోవంగ
నిగ్రహునికి
దక్కు నింగి సుఖము.
|
30. సత్యము
|
|
0291
|
సత్యమేదియన్న
స్వల్పమ్ముగా నైన
దోషముండ నట్టి భాషణమ్ము.
|
0292
|
సత్య
దూరమైన సత్యంబుగా నొప్పు
దోహదంబుగాగ
దోషముడిగి.
|
0293
|
మనను
తెల్పు దాని మరుగుపఱచు వాని
చిత్తమందు
సతము జిచ్చురగులు.
|
0294
|
అన్యత
మాడకున్న నాత్మసాక్షిగఁ దాను
మసలు
సకల జనుల మనసు లందు.
|
0295
|
సత్యదృష్టి
యాత్మ సాక్షాత్కరించిన
యజ్ఞకర్త
కన్న విజ్ఞుఁ డతడు.
|
0296
|
నిజముకన్న
కీర్తి నిక్కంబు లేదొండు
కష్ట
రహిత మన్ని నిష్ట లందు.
|
0297
|
నిర్వహించినట్లె
సర్వ ధర్మంబులు
నిజము
నిజముగాను నిలుపుకొన్న.
|
0298
|
అంగశుద్ధి
స్నానమాడిన సరిపోవు
నాత్మశుద్ధి
సత్య మందుటందె.
|
0299
|
మెలుఁగులన్ని
మెలుఁగు వెలిగింపజాలవు
సజ్జనాళి
మెలుఁగు సత్య మగును.
|
0300
|
అరయ
సత్యమొకటె పరమార్థమైనది
సత్యమునకు
సాటి జగతి లేదు.
|
No comments:
Post a Comment