Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
I. ధర్మ కాండము
1.
దైవ
ప్రార్థన
|
|
0001
|
అచ్చుమూలమైన దక్షరంబుల కెల్ల
వేద వేద్యు డాది విశ్వమునకు |
0002
|
చదివినన్దుకేమి సఫలమ్ము సర్వజ్ఞు
చరణములకు బూజ సలుపకున్న |
0003
|
సుమన గమను పాద కమలమ్ములకు సేవఁ
జేయువారి బ్రతుకు క్షేమ మిలను |
0004
|
వలయు వద్దులేని వాని పాదము లంద
శాశ్వతముగ దొలగు సంకటములు |
0005
|
బంధ ముక్తుడగును ద్వంద్వ కర్మలనుండి
విశ్వమయుని కీర్తి వినుతిజేయ |
0006
|
ఇంద్రియమ్ము లణచి యింద్రియాతీతుని
సత్య మార్గమరయ నిత్యసుఖము |
0007
|
నిరుపమాను దివ్య చరణ సేవలు దప్ప
మనసు శాంతి బొందు మార్గమరుదు |
0008
|
ధర్మవార్ధియైన
దైవమ్ము
పద
సేవఁ
గర్మవార్ధి దాట గలుగు నావ |
0009
|
చేష్ట లుడిగినట్టి చెవి కన్ను ముక్కటు
లష్టగుణుని మ్రొక్కనట్టి శిరము |
0010
|
భవ మహా సముద్ర మవలీల యభవుని
పాద మందుకొన్న వారికెల్ల |
|
|
2.
వర్షమహిమ
|
|
0011
|
వాన గురియుచుండ వర్ధిల్లు లోకంబు
లందుచేత దాని నమృత మండ్రు |
0012
|
వాన కలుగఁజేయు
ప్రాణి
కోటికినెల్ల
కూడు నీళ్ళు రెండు కొఱఁత లేక |
0013
|
ఆకలి దహియించు, లేకున్నఁ వర్ష
మ్ము
జలధి దిరిగియున్న జగతినైన |
0014
|
మడకబట్టి దున్న మరతురు రైతాంగ
మదను లోన వర్ష మల్ప మైన |
0015
|
పాడు జేయు పాడు పడినట్టి వారిని
బాగుజేయు నదియు వానయగును |
0016
|
వాన తొలకరింపఁ మానినచో
పఛ్ఛి
గఱికయుఁ దలఁజూపఁ వెఱచుఁనేల |
0017
|
ఎత్తుకొన్న నీటి నివ్వనిచోఁ మబ్బు
మేటి సంద్రమైన లోటుఁ బడును |
0018
|
దేవ పూజలేదు దినకృత్యములు లేవు
వాన గురియకున్న వసుధపైన |
0019
|
తపముఁ జెడును దాన ధర్మంబు లుడుగును
నీరు జారకున్నఁ నింగి నుండి |
0020
|
నీరు లేకఁ జగతి
నిలువగా
దేరికి
నూర దూట వాన లుండకున్న |
|
|
3.
ముక్తులు
|
|
0021
|
తనదు ధర్మపథముఁ దప్పని
ముక్తులఁ
బ్రస్తుతించు నెల్ల పుస్తకములు |
0022
|
యతుల మహిమ లెన్న మృతులైన వారల
నెంచి చెప్ప సాహసించినట్లు |
0023
|
కల్ల నిజములం గనుఁగొని
సన్యసించిన
మునుల కీర్తి లోకమునకు వెలుఁగు |
0024
|
చిత్త మంకుశముగఁ జేసి
యైదింటిని
నణఁచు నతఁడు మోక్షమునకు విత్తు |
0025
|
నిగ్రహిఁచుకొన్న
నిష్ఠ గరిష్ఠుని
కమర ప్రభువె సాక్షి యంబరమున |
0026
|
చేయ దగ్గ పనులె
చేతురు
పెద్దలు
చిన్నలట్టిపనులు చేయఁలేరు |
0027
|
వినుట కనుట వంటి వివరమ్ము లైదింటి
నెఱుఁగు జ్ఞాని లోక మెఱిగి యుండు |
0028
|
ఋషులు
జెప్పినట్టి విషయమ్ములేనాఁడు
మంత్రములుగ నేడు మహిమఁగాంచు |
0029
|
గుణము లనెడు కొండ గూర్చున్న వారికి
విలువ దాగ్రహంబు నిముసమైన |
0030
|
కరుణ జూపువారె కష్టపెట్టకొకరి
బ్రాహ్మణులుగ జెప్పఁబడెడువారు |
|
|
4.
ధర్మోద్ఘాటన
|
|
0031
|
ధనమునిచ్చు మోక్ష
ధనము
నిచ్చును
ధర్మ
మంతకన్న వలసినట్టి దేది? |
0032
|
ధర్మనిష్ఠ కన్నఁదగు
మంచి లేదొండు
వీడ దాని కన్నఁ గీడు లేదు. |
0033
|
చేయఁదగిన
విధులఁ జేయుటే ధర్మంబు
ధర్మమెడలి బ్రతుకఁ దగవు గాదు. |
0034
|
ఆత్మశుద్ధి కన్న నన్యధర్మము లేదు
మెప్పు కోసముండు మిగత వన్ని. |
0035
|
ఈర్ష్య , యాశ , కోప మెడలుట తోఁబాటు
ప్రల్లదములు లేమి పాడి యౌను. |
0036
|
ధర్మమొకటె వచ్చుఁదాఁ జనునప్పుడు
నేడు నాఁడు లెక్కఁ జూడఁదగదు. |
0037
|
పల్లకి నొకఁడెత్త పైనుండు
నొక్కఁడు
ధర్మ మింతె యనుచుఁ దలచరాదు. |
0038
|
ఉన్ననాళ్ళు మరువకున్నచో ధర్మంబు
భవము నడ్డగించు బండ యదియె. |
0039
|
ధర్మమందె సుఖము తక్కిన దంతయు
సుఖముగాదు కీర్తి శూన్యమగును. |
0040
|
ఆచరింప వలసినట్టి దగును ధర్మ
మాచరింప రాని దగును నింద. |
|
|
5.
గృహమేధి
|
|
0041
|
కాపురస్తుడన్నఁ గాపాడగలవాఁడు
ముఖ్యమతని నమ్మి మువ్వురుండ్రు |
0042
|
సాదు, పేద, దీను లాదిగ మువ్వుర
కండగాను గేస్తు డుండు నెపుడు. |
0043
|
పితరు, దైవ మతిధి పేదలు తానైదు
ధర్మములను గేస్తు తప్పకుండు. |
0044
|
నింద బడక నున్న దందఱికిని బెట్టి
కుడుచు నతని గృహము కొఱతఁ వడదు. |
0045
|
నిర్మల మగుప్రేమ నీతియు నియమము
లున్న కాపురమ్ము వన్నె కెక్కు. |
0046
|
నీతితోడ నిల్లు నిలబెట్టు కొన్నచో
నన్ని వ్రతములందె యణిఁగి యుండు. |
0047
|
క్రమము దప్ప నట్టి కాపురస్తుఁడు
మేటి
ఘోర తపము జేయువారి కన్న. |
0048
|
యుక్తరీతి ధర్మయుక్తుడౌ గృహమేధి
యజ్ఞ యాగ ఫలము లనుభవించు. |
0049
|
ధర్మ మనఁగఁ జెల్లు
దాంపత్య
భావమ్మె
మాట బడమి దాని మంచి గుణము. |
0050
|
బ్రతుక వలసినట్లు బ్రతికినచో నింట
మింట సురలు బిలచి మెత్తురతని. |
|
|
6.
ఇల్లాలు
|
|
0051
|
తగిన గుణము లుండి తన భర్త
చేతిని
మిగులఁ బెట్టఁగలుగు మగువె భార్య. |
0052
|
పత్ని గుణము లేక ప్రఖ్యాతి ఇతరత్ర
నెంత యున్నఁదన కదేమి ఫలము. |
0053
|
లేని దేది?
భార్య
జ్ఞానమ్ము
గలదైన!
ఉన్నదేది? గుణము సున్నయైన! |
0054
|
స్త్రీ ల కన్నఁ గొప్పఁ జెప్ప నేమున్నది
చూపు మానమందు మోపిరేని |
0055
|
పతిని దైవముగను వ్రతమున్న యిల్లాలు
కురియు మన్న క్షణమె కురియు వాన |
0056
|
తనదు గౌరవమ్ము తన భర్త గౌరవ
మరసి కాచుకొన్న యామె భార్య , |
0057
|
కంచ నాటి స్త్రీలఁ గనిపెట్ట
గా
లేము
మాన మందు వారి మనసులేమి . |
0058
|
ధవుని సేవయందు ధర్మంబు దప్పని
సాధ్వి కమర లోక సౌఖ్యమబ్బు |
0059
|
పరువుఁ గాచునట్టి
పత్నియే
లేకున్న
నడగ ఠీవిరాదు నలువురందు. |
0060
|
సాధ్వికిఁ దగినట్టి
సంతాన
మబ్బిన
మంగళముగ గృహము మహిమ గాంచు . |
|
|
7.
బిడ్డలు
|
|
0061
|
తెలియలేము మంచి తెలివైన బిడ్డలు
కలుగు దానికన్నఁ గలిమి వేరు. |
0062
|
ఏడు జన్మములకు నేదోష మంటదు.
ఏహ్యపడని బిడ్డ లింటనున్న. |
0063
|
తన ధనమ్మ టండ్రు,
తన
సంతతినె
బుధులు
వారి వారి కర్మ వారి సుతులు , |
0064
|
కన్నబిడ్డ తనదు చిన్నారి
చేతులఁ
దులుపు కూడె యమృత తుల్యమగును. |
0065
|
తనువు పులకరించు తాకినఁ దన
బిడ్డ
మాటవిన్న చెవుల మధుర మగును. |
0066
|
వారి వారి బిడ్డ గారాబు మాటలు
విన్న వినరు వీణ వేణురవళి . |
0067
|
బుధుల సభల యందు పొగడొందునట్లుగ
తనయుఁదీర్చు టగును తండ్రి ఋణము. |
0068
|
తనదు సుతుని ప్రతిభ తా మెచ్చుటకు ముందె
యుర్వి జనులు మెత్తు రుత్సవముల |
0069
|
కన్న నాటికన్న మిన్నగా నుప్పొంగు
తనయుని పొగడంగ వినిన తల్లి |
0070
|
ఎట్టి తపముఁజేయ
నిటువంటి
పుత్రుండు
పుట్టె ననిన దీరు పుత్రు ఋణము. |
8.
ప్రేమ
|
|
0071
|
తలుపు తాళమేది నిలుపంగ ప్రేమను
భాష్ప రూప మగుచుఁ బయలు వెడలు.
|
0072
|
దయఁద్రలంచు నతఁడు తమవెల్ల
వెచ్చించు
నదయు డన్ని తనకె యనుచు దలఁచు.
|
0073
|
జీని కిటుల దనువు గావలె నిలువంగ
బ్రతుక వలయునన్న వలయు ప్రేమ.
|
0074
|
ప్రేమ యధికమైనఁ బెరవారు దమవారె
న్నేహమునకు నదియె బిహ్నమగును.
|
0075
|
అతని బ్రతుకుఁ జూడ నానంద
మయమన్న
ఖ్యాతికెల్లఁ బ్రేమ కారణమ్ము.
|
0076
|
పుణ్యమునకెగాక
పురుషత్యమునకైన
వదల
రాని దుగును వసుధ ప్రేమ.
|
0077
|
ప్రేమలేని
వానిఁబీడించు ధర్మంబు
ఎముక
లేని ప్రాణి నెండ విధము.
|
0078
|
చవటి
నేలఁజెట్టు చివురించనట్టుల
ప్రేమలేని
బ్రతుకు పేలనమ్ము.
|
0079
|
అంతరంగమందు
నమరనిచో ప్రేమ
బాహిరముల
వలన ఫలమదేమి?
|
0080
|
జీవమునకు
ప్రేమె జీవమ్ము యడిలేని
నారి
దేహ మస్తిపంజరంమ్ము.
|
9.
ఆతిథ్యము
|
|
0081
|
ఇల్లు
గాచి ధనము నినుమడించుట యెల్ల
నతిథి
నాదు కొనఁగ నగును జూవె.
|
0082
|
అతిథి
బయటనుంచి యమృతమే యైన దా
నారగింప
న్యాయ దూరమగును.
|
0083
|
ఆశ్రితాళి
నెఱిగి యాతిథ్యమిచ్చిన
నందుచేత
లేమి నొందడెవడు.
|
0084
|
అతిథి
రాక కలరి యాతిథ్యమిచ్చెడి
వారి
యింట లక్ష్మి వలచి నిలచు.
|
0085
|
అతిథి
తినఁగ మిగులు నన్నంబు దినువాని
నేల
విత్తనంబు లేల జల్ల?
|
0086
|
ఒకరి
నుపచరించి నొకరికి నెదురొడ్డు
నతఁడు
దేవతాళి కతిథి యగును.
|
0087
|
విందు
యజ్ఞమగును వితరణ ఫలితమౌ
యర్థరహిత
మింత యంత యనుట.
|
0088
|
పెట్టలేని
వారె చెట్టు పుట్టల జేరి
యాశ
లెడలి నట్టు లలమ టింత్రు.
|
0089
|
ఉండి
యువచరింపకుండెడి దారిద్ర్య
ముండు
నజ్ఞులందె మెండుగాను.
|
0090
|
అనిచమనెడు
పుష్ప మాప్రూణమున వాడు
జూచినంత
నతిథి లేచిపోవ.
|
10.
ఇంపుమాటలు
|
|
0091
|
కల్మషమ్ము
లేని కమ్మని మాటలు
నిజముగన్ను
వారె నేర్చి యుంద్రు
|
0092
|
నగుమొగమ్ముతోడ
నయముగా మాటాడ
నీని
కన్న దాని చేవమెండు.
|
0093
|
విధిత
ధర్మమగును వినిసింప ప్రేమతో
నగుమొగమ్ముతోడ
నయముగాను.
|
0094
|
బాధ
పరచునట్టి పేదరికము బాపు
తీపిగాను
జెప్ప దెలుసుకొన్న.
|
0095
|
తొడవు
లేల నుడుల దొణికిన మధురమ్ము
వినయ
సంపదగల మనుజ తతికి.
|
0096
|
పరుల
మేలెఱింగి పలికిన పలుకులు
పాప
మెడలజేసి చూపు నిరతి.
|
0097
|
పలుకు
లందు మేలు కలుగంగ నయ్యది
గుణము
దప్పకున్న గురుతరమ్ము.
|
0098
|
ఎదిరి
కదురులేని యింపైన మాటలే
యిహాపరాల
రెంట నిచ్చు సుఖము.
|
0099
|
ఇంపుగ
నుడువంగ నీడేరు సకలమ్ము
బండ
బూతులేల బలుక వలయు?
|
0100
|
ఇంపు
మాటలుండ నేలకో పరుషొ క్తి
పండువదలి
కాయఁ బట్టినట్లు.
|
No comments:
Post a Comment