Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
III. కామకాండము
109.
మోహనాంగి
|
|
1081
|
అమర
కాంతయౌనొ నెమలౌనొ యా భామ
మోహజలధి
నిట్లు ముంచుటేమి!
|
1082
|
దండుకోడఁ
వచ్చి తాకినట్లున్నది
చూడఁజూడ
నన్ను సుందరాంగి.
|
1083
|
ఎఱుంగ
నెముడనంగ నెవ్వాడొ మున్ముందు
కంటి
దేవి వెడద కండ్లనిపుడు.
|
1084
|
కనినయంత
కనులు తనివేయు ప్రాణమ్ము
మోహమెందు
బోయె ముగ్ధకనుల.
|
1085
|
చంచలాక్షి
కనుల స్మరుడుండు జముడుండు
లేడితోడఁ
మూడు తోదుగాను.
|
1086
|
వంకదీరకున్న
వామాక్షి కనుబొమల్
విచ్చుకనులు
బాధబెట్ట విల్లు.
|
1087
|
మత్తగజము
కంటి మరుగు పచ్చడనుట్లు
స్నిగ్ధ
బిగువు చనుల జీలుగుపైట.
|
1088
|
పగతుఁదునుము
నట్టి పౌరుషం బడుగంటె
వెలఁది
నొసటినున్న వెలుఁగు గనిన.
|
1089
|
హరిణ
నేత్ర్రికేల యాభరణంబులు!
నిగ్గు
దేరినట్టి సిగ్గె చాలు.
|
1090
|
కల్లు
ద్రాగకున్న గలుగదు మైకమ్ము
కామ
మట్లుగాదు కనినఁ జాదు.
|
|
|
110.
ఆలోకనం
|
|
1091
|
కలికి
జూపు నొప్పి గలిగించు నొక్కటి
మందుగాగఁ
దాని మాన్పు నొకటి.
|
1092
|
భొగమందు
నర్థభాగమ్ము కన్నను
అధికమగును
చూపులందె సుఖము.
|
1093
|
చూచెఁ
జూచెనంచు జూడంగఁ దలపంచె
మొలకవోయునేమొ
వలపు లిట్లు
|
1094
|
నేనుఁ
జూడఁ దాను నేలపైఁ జూచును
జూడకున్న
నోరజూచి మురియు.
|
1095
|
నవ్వుకొనును
లోన ననుజూడ నట్లుగాఁ
జూచి
యోరగంటఁ సుందరాంగి.
|
1096
|
పగచుకొన్న
విధము బలికిన బలుకులే
స్నేహలతను
బెంచు చిత్తమలర.
|
1097
|
పొలఁతి
చూపు మాట పొడిచినట్లున్నను
వలపు
లేదనంగ వలనుగాదు.
|
1098
|
చూచినంత
నన్ను జూచిన నొయ్యారి
మందహాసమందు
మరులు గలదు.
|
1099
|
తెలియనట్లుగానె
తెలికించు ప్రక్రియ
కాముకులకు
వచ్చు కైవశమ్ము.
|
1100
|
కండ్లు
కండ్లుతోడ గలసిన పిమ్మట
మాటలేటి
కింక నోటిచేటు.
|
111. పరవశమ్ము
|
|
1101
|
పరవశమ్ము
జెందు పంచేంద్రియమ్ములు
పంకజాక్షి
తోడు ప్రాప్తమైన.
|
1102
|
చాలినన్ని
గలవు జబ్బుకు మందులు
వలపు
జబ్బుకెల్లఁ వనితె మందు.
|
1103
|
పద్మ
నేత్రుపథము పడతి కొగిలికన్న
నద్జిక
సుఖమునిచ్చు నదియెకొదు.
|
1104
|
తాకకున్న
వేడి తాకిన చల్లన
నింతనిప్పు
వనిత చెంతఁ గలది.
|
1105
|
కలసినప్పుడెల్ల
నలివేణి కాగిలి
చొక్కఁ
జొక్కఁ మిగుల సుఖమునిచ్చు.
|
1106
|
కలికి
కరములందు గల దమృతం బొకో
తాకినంతఁ
దనియుచుండు నొడలు.
|
1107
|
అతివ
కొగలింపు లాకలిదప్పుల
మాన్ప
గలుగునట్టి మహిమగలది.
|
1108
|
విందుబెట్టి
కుడుచు చందంబుగా నుండు
కలికి
కొగలింప గలుగు సుఖము.
|
1109
|
కలిసినట్లు
గలసి కలహించి కూడుట
కామకళకు
ప్రణయ ధామమగును.
|
1110
|
తెలియ్ఁ
దెలియఁ దెలియుఁ దెలియనిదేమని
కలియఁ
గలియనట్లె కామ కళయు.
|
112. ప్రశంస
|
|
1111
|
కుశలమా!
శిరీష కుసుమమా! నీకన్న
మృదు
శరీర నాదు హృదయరాణి.
|
1112
|
పూలఁజూచి
మనస పొంగిపోయెదవేల?
చూడఁదగిన
కలికి చూపులుండ.
|
1113
|
పరిమళించు
మేను పండ్లన్ని ముత్యాలు
తలిరు
బోడి బొమలె యలరువిల్లు.
|
1114
|
కలువపూలకెల్లఁ
గనులున్న వనుకొన్న
కలికి
కనులఁజూచి తలలవంచు.
|
1115
|
కాడలున్న
పూలు కలికికి భారమ్ము
తురుమ
వెరచు నడుము తుణుగునంచు.
|
1116
|
చంద్రుడన్న
భ్రమతో చంచలాక్షిని జూచి
చుక్కలెల్ల
మింట బిక్కరించె.
|
1117
|
పూర్ణచంద్రునందు
బొరలుండుఁ గానంగ
కలికి
మోమునందు గలదె మచ్చు.
|
1118
|
పొలఁతి
మోము రీతి మురిపింప గలవేని
గౌరవింతునోయి
కలువరాజ.
|
1119
|
ఉత్పలాక్షి
మోము నొప్పుగాఁ దలచిన
కంట
బడకు మింతఁ గలువరాజ.
|
1120
|
అలరులైన
గాని హంసతూలికలైన
కలికి
పాదములకు కంటకములె.
|
|
|
113. తలపోత
|
|
1121
|
పాలు
తేనెగలసి జాలువారిన రీతి
మగువ
పంటినీరు మధుర మగును.
|
1122
|
ఊపిరికిని
నొడలి కున్నట్టి సామ్యమ్ము
యామె
తోడి నాదు ప్రేమ చెలిమి.
|
1123
|
కానరాకపొమ్ము
కంటిలో పాపాయి
వలపు
రాణి కందు వలయు స్థలము.
|
1124
|
బ్రతుకు
సుందరాంగిఁ బడయుటలో నుండు
దూరమైనఁ
చావు చేరువగును.
|
1125
|
తలచుకొనుట
మఱవు కలిగిననేగాద
మరువలేకపోతి
మగువ సోగను.
|
1126
|
నేర్పుగాడె
ప్రియుడు నేత్రమధ్యము లందు
రెప్పలార్చు
బాధఁ దప్పుకొనును.
|
1127
|
కలఁడు
ప్రియుండు మాదు కనులంటి కాటుక
నలద
నతఁడు మరుగు నంచునెంచి.
|
1128
|
మనసులోనె
ప్రియుండు మాకుండు గాఁబట్టి
వేడి
దినము నతఁడు వాడునంచు.
|
1129
|
కన్ను
మూయ ప్రియండు కనిపించడని నేను
అందు
కతని నేల నిందజేయ.
|
1130
|
వదలకుండ
ప్రియుండు హృదయంబునందుండ
దూరు
డందురేల యూరివారు.
|
|
|
114. సిగ్గు
|
|
1131
|
బ్రతుకదేది
కామ బాధకుఁ జిక్కిన
సిగ్గు
విడచి బయట ముగ్గకున్న.
|
1132
|
తాళలేక
విరహ తాపమ్ము తనువది
సిగ్గు
విడచి తిరుగ సిద్ధమయ్యె.
|
1133
|
మగత, మానమెల్ల మాయమైపోయెను
బలముగాను
నిలచె భంగపాటు.
|
1134
|
వలపు
వరదదాట వశమౌనె సిగ్గును
చేవ
గల్గినట్టి నావ నెక్కి.
|
1135
|
సంధ్య
నన్నదేల సాధించు బగబట్టి
లేని
కతనఁగాదె లేమచెంత.
|
1136
|
విరహ
బాధ నిద్ర కరువయ్యె నడిరేయి
న్దలచి
తలచి ముందు వలపు లన్ని.
|
1137
|
ఉదధి
యట్లు కామ ముప్పొంగుచున్నను
మాన
రక్షజేయు మగువకెనయె.
|
1138
|
నిగ్రహించుకొన్న
నిలువ దీ కామమ్ము
బయటెఁబడక
నెట్లు భ్రతపరుప.
|
1139
|
దాచుకొన్న
వలపు దాగక నూరెల్ల
బట్టబయలు
జేయ బరుగులెత్తు.
|
1140
|
ఏనుబడినపాటు
లితరులు పడియున్న
నవ్వ
రిటుల వారు నన్ను జూచి.
|
|
|
115. వదంతి
|
|
1141
|
ఎగిరిపోక
ప్రాణ మీదాక నుండుట
మరుగు
మరుగు నాడు మాటగాదె.
|
1142
|
రట్టుబెట్టి
వారె రచ్చకు దెప్పించి
సభ్యమునకు
మిగుల సాయపడిరి.
|
1143
|
ఊరివారికెల్ల
నూరిపోసిరిగాన
వలపు
అతకు వ్రేళ్ళు బలుసుకొనియె.
|
1144
|
వృద్ధిపొందె
వలపు వేమారు దృఢముగా
నోట
నోట బడిన మాటవలన.
|
1145
|
మైక
మబ్బు కల్లు మరి మరి ద్రాగంగ
చెప్ప
చెప్ప వలపు చిగురు దొడగు.
|
1146
|
ఒక్క
దినమె కలసి యున్నది; యూరెల్ల
గ్రహణ
చంద్రు విధము గాంతురేల.
|
1147
|
ఎరువు
నిళ్ళుబెట్టి యెదిగించు కామమున్
ఊరు
గలిసి తల్లి దూరుటైన.
|
1148
|
ఆడిపోసుకొన్న
నాగునె కామమ్ము
ఆజ్యధార
నగ్ని నాపనగున!
|
1149
|
రట్టుబెట్టి
వీధి గుట్టు దీసిన యట్టి
భంగపాటె
మాకు భద్రమింక.
|
1150
|
ఉల్లమలరె
మమ్ము నల్లరిపాల్జేయ
మేలె
ప్రియుడు విడువ కేలు కొనగ.
|
116. నిర్వియోగము
|
|
1151
|
విడువలేని
నన్ను నడుగుము విడుటైన
వచ్చుచఱకు
నుండువారి నడుగు.
|
1152
|
సుఖముఁ
జూపులందెఁ జూచితి మున్ముందు
దూరమగుట
నెంచ దుఃఖ మొదవు.
|
1153
|
బుద్ధిమంతులకును
పోసగును విడిపోవ
విడువ
ననుట నమ్మ వీలుగాదు.
|
1154
|
వదల
నన్నవాడు వదలుచో నాశతో
నంటుకొన్న
దాని దగునె తప్పు.
|
1155
|
కాచుకొనుటె
లెస్సకాంతుని విడనీక
వీడిపోయెనేని
కూడు టరుదు.
|
1156
|
వెళ్ళి
వత్తునంచు విడబడు నవ్వాడు
మళ్ళి
వత్తునన్న మాట నిజమె.
|
1157
|
విరహ
బాధ నెఱుకబరచెడి విధముగా
గాంతు
దిట్టఁదొడగె గాజు లూడి.
|
1158
|
వారివారు
లేని వాసమ్ము కష్టమ్ము
అరయగా
వియోగ మంతకన్న.
|
1159
|
అగ్గివంటి
బాధ ననగాదు వలపును
తగులు
బాధ దీని దాకకున్న.
|
1160
|
సాగనంపి
బాధ సహియించి జీవింప
నిష్టపడెడివార
లెంద రిలను.
|
117.
వియోగము
|
|
1161
|
దాచుకొన్నకొలది
దాగకఁ గామమ్ము
ఊట
నీటినోలె నూరుచుండు.
|
1162
|
కప్పి
పుచ్చ వీలుఁగానట్టి దీ బాధ
చెప్పి
పంపనైన సిహ్హుగలది.
|
1163
|
ప్రాణదండమునకు
వలపును, సిగ్గును
కావడట్లు
వంగి కష్టపెట్టు.
|
1164
|
ఉదధి
పోలెఁ గామమున్నది దాటంగఁ
దగిన
యెడలేకఁ దల్లడిలుదు.
|
1165
|
కష్టపట్టునతని
కిష్టమున్నప్పుడే
ఇష్టపట్టగలడె
కష్టమున్న.
|
1166
|
కలసినపుడు
సుఖము కడలివంటిదగును
కలయనపుడు
దిగులు కడలికన్న.
|
1167
|
విరహబాధ
నీద వీలుగాకుండఁగా
అర్ధరాత్రి
నొంట నలమటింతు.
|
1168
|
అందఱీకిని
నిద్ర నందించు నీరాత్రి
నన్ను
తోడు జేసుకొన్న దేమి.
|
1169
|
విరహ
బాధకన్న వేదన గలిగించు
దినదినమ్ము
నిశలు దీర్ఘమగుచు.
|
1170
|
మనసుతోడఁగూడి
కనులేగియున్నచో
మోహజలధి
నిట్లు మునుగహుందు.
|
118. నిరీక్షణ
|
|
1171
|
కండ్లు
గాదె ముందు కలిగించె కామమ్ము
పరితపించు
నిపుడు విరహమునకు.
|
1172
|
కాంచినంతప్రేమ
కలిగినందుకుగాను
దుఃఖపడగవలయు
దూరమైన.
|
1173
|
ముందుపోయి
కనులు మోహమ్ము కొనితెచ్చె
తాళకున్న
నివుడు గేలికాదె.
|
1174
|
తీర్చలేని
బాధ దెచ్చిన వీకండ్లె
యేడ్వవలయు
నీర మింకు వఱకు.
|
1175
|
మోహజలధి
నన్ను ముంచిన వీకండ్లె
కుములవలయు
నిట్లు కునుకురాక.
|
1176
|
సరియె
కన్నులిట్లు పరితపించుట జూడ
కష్టపెట్టలేదె
కామమిచ్చి.
|
1177
|
ఏడ్చి
యేడ్చి కన్ను లింకిపోవలయును
చొక్కి
చొక్కి ముందు జూచెగాన.
|
1178
|
మాయమాతలాడి
మరుగైనవానినే
చూడ
గోరుచుండు చూపులెల్ల.
|
1179
|
రానినాళ్లు
నిద్ర రాదాయె వచ్చినన్
నీరసించె
కండ్లు నిద్రలేక.
|
1180
|
ఊరివారికెల్ల
నోరెత్తి చాటించు
దాపలేక
కండ్లు తాప భరము.
|
119. పాలిపోవుట
|
|
1181
|
వలపుగాని
విడచి పాలితి నీరీతి
ఎవరికోడ
దీని నెఱుకబరతు.
|
1182
|
ప్రియుడె
దీని నీకుఁ బ్రియమార విడెనని
మోహమునకుఁ
బాలె దేహమెల్ల.
|
1183
|
సిగ్గు
చెలువుతాను జేకొని బదులుగాఁ
దాపమిచ్చె
మెరుగు తఱుగఁ దనువు.
|
1184
|
మరువ
కతని వలపు మరిమరి చింతిప
పసదొరంగి
మేను పాలుటేల.
|
1185
|
అదిగొ
ప్రియుడుదాటె నంతలో నామేన
బాలిపోవదొడగె
బసిమి చాయ.
|
1186
|
దీపకాంతి
తగ్గఁ దిమిరమ్ము బైకొను
విధము
పాలె మేను ప్రియుని బాయ.
|
1187
|
ప్రక్కనుండి
ప్రియుఁడు చెక్కిలి నిమురుచు
ప్రక్కజూచినంత
బాలెమేను.
|
1188
|
మోహమునకు
బాలిపోయిన దనువారు
దిట్టరేమి
వదలి నట్టివాని.
|
1189
|
మంచిగాను
ప్రియుడు మనసీయజాలును
పారిపోవుటైన
వగవు జెంద.
|
1190
|
పాలిపోవుటకును
భయమొందగాలేదు
దుష్టుడంచు
ప్రియుని దూరరేని.
|
120. విరహతాపము
|
|
1191
|
ఒకరి
నొకరు వలచి వలసించు కొన్నచో
వారి
వశమె కామఫల సుఖమ్ము.
|
1192
|
బ్రతుకు
బాగుజేయు వర్షంబు పోలిక
ప్రియుండు
ప్రేయసియెడ ప్రేమ గనుట.
|
1193
|
కోరుకొన్న
ప్రియుని గూడిన కాంతకు
ప్రేమ
గర్వ మొండు పెనగుచుండు.
|
1194
|
ప్రియుని
ప్రేమలేని ప్రేయసి నెవరెంత
గొప్పఁ
జెప్పుకొన్న గొఱత గొఱత.
|
1195
|
తలపఁ
డతడు నన్ను తానెట్లు వలచినంత
సిగ్గు
మాలి నాదు చెంతవచ్చు.
|
1196
|
ఇన్నినాళ్ళు
బ్రతికి యున్నది యెట్లన్న
దలచి
తలచి ముందు వలపులన్ని.
|
1197
|
మరచుటన్న
మాటె మండించు హృదయమ్ము
మరచి
బ్రతుకు మాట మాట యగునె.
|
1198
|
ఎంత
దలచుకొన్న నేమని కినయండు
ప్రియుణానుగునట్టి
ప్రియమదౌను.
|
1199
|
ఎంతగానొ
జెప్పె నిర్వుర మొకటని
చెంతలేక
నిపుడు చింతబెట్టె.
|
1200
|
విడచినట్టివాని
వెదకి పట్టెడుదాక
గదలిపోకుమోయి
కలువరాజ.
|
No comments:
Post a Comment