Thursday, 3 September 2009

tel04



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

31. కోపము

0301
చెల్లు నెడలనైన చెల్లంపకుండుటే
కోపమణఁచుకొన్న గుణమనంగ

0302
అనువు గానిచోట నాగ్రహించుట చెఱు
పంత కన్న నేర మనువు చోట.

0303
కోప మెవరి యందుఁ జూపుట సరిగాదు
కష్టములకు నదియె కారణమ్ము.

0304
మనను కుములఁ జేయ మందహాసముఁ దీయ
ఆగ్రహంబె శత్రువగు నిజంబు.

0305
కోరనేల రక్ష కోపముడిగెనేని
కోరనెల్ల శిక్ష కోపమున్న.

0306
ఆగ్రహంబు కాల్చు నైనవారిని దన్ను
అంటకొన్న వరకె మంట కాల్చు.

0307
ఆగ్రహమున కార్య మగునని దలచుట
బండను తనచేత బాదినల్లు.

0308
నిప్పు బెట్టినట్లు నొప్పించు చుండిన
నాగ్రహింప వలవ దట్టి యెడను.

0309
లేశమైన మదిని లేకున్న కోపమ్ము
సకల మతని కడకు సాగివచ్చు.

0310
కోపగాడు మృత్యు కూపంబులోబడు
శాంతపరుఁడు మోక్ష సౌధ మెక్కు.




32. దుష్కృతము

0311    
సకల సంవదలును సమకూరుటే యైన
నార్యులొల్ల రకృత మాచరింప

0312
కంటుబెట్టి యొకఁడు కలిగించగా కీడు
బదులు జేయఁజోరు బుధులు దాని.

0313
నీవు జేయకున్న న్నీకెగ్గు జేసిన
బదులు జేయుటయును బాధకరమె.

0314
చెడ్డ జేసెనేని సిగ్గు పడగవాడు
మంచి చేయుటగును మహిత శిక్ష.

0315
ఆత్మ కష్టమట్లు నన్యుల కష్టాలు
తెలియ లేనివాని తేలివి తేలివె?

0316
బాధ యగు నటంచు బోధపడిన వేన్క
ఒరుల కట్టి బాధ నొనంగ నేల?

0317
ఎప్పు డెవ్వరికిని యెంత మాత్రమ్మును
చెడువు దలపకున్న శిక్ష గుణము.

0318
తనకు దెలియుగాదె తనబాధ యెట్టిదో
యెదిటి బాధలెందు కెఱుగలేడు.

0319
నేడు నీవుజేయు కీడది నిన్నంటి
స్వయముగానె రేపు వచ్చి చేరు.

0320
బాధలేని బ్రతుకు బ్రతుకంగ నెంచిన
బాధ బెట్టకుండ బ్రతుక వలయు.




 33. అహింస
0321
ధర్మములను పరమధర్మ మహింసయే
యన్ని ధర్మములకు హాని హింస
0322
ప్రాణికోటికెల్లఁ బంచి కుడిచెడు దాని
పరమధర్మ మనిరి ప్రాజ్ఞులెల్ల
0323
నిరువమాన ధర్మ నిష్టయౌ యహింస
సమము దానివెనుక సత్యమగును.
0324
మంచి మార్గ మొకటి మహిమీద గలదన్ను
జీవహింస లేని భావమొకటె.
0325
బ్రతుకు ద్రోసిపుచ్చి యతులౌట కన్నను
మేలు హింస విడచి మెలఁగు టెంతొ.
0326
జీవహింసలేక జీవించు నవ్వాని
కాలయముడు గూడ కనికరించు.
0327
ఆత్మరక్షకైన నన్యజీవులఁ జంపు
దుష్కృతమ్ము పరమ దోషమగును.
0328
అంతులేని భోగ మనుభవించుటకైన
యోగధనులు హింస నొప్పుకొనరు.
0329
హింసపరులు పరమహంసల సన్నిధి
నీచ మానవులుగ గోచరింత్రు.
0330
ప్రాణఘాతకులుగ పరిణమించిన వారె
తీరనట్టి వ్యాధి దిరుగువారు.


 34. నిత్యము
0331
స్థిరముగాని దెల్ల స్థిరమని నమ్మిన
బ్రతుకు కాలమెల్ల పతన మగును.
0332
ఆటఁ జూడఁదొపు కూటమ్ము బోలిక
కలిమి నిల్లువదెల్ల కాల మొకట.
0333
కలిమి స్థిరము గాదు కలిగిన వెంటనే
యాచరింప  ధర్మమది స్థిరంబు.
0334
కాలమేదొ కాదు కఱకు ఱంపము జూడ
దినదినమ్ము నాయువును హరించు.
0335
నుడులు రాక నాల్క పిడచగట్టక ముందె
యడుగు లిడుము ధర్మ మాచరంప.
0336
నిన్నటి దినముండె నేడు లేడను నట్టి
నింతె మిగిలియుండు విశ్యమునకు.
0337
కోర్కెలుండు నెపుడు కోటికిఁ బడగెత్తి
యాయు పుండుకాల మర యకున్న.
0338
గ్రుడ్డు పగిలినంత గువ్వ రివ్వున బోవు
ప్రాణ మట్లె దోహ భావమందు.
0339
నిద్రబోయి లేచి నిలచిన చందమ్ము
చాపు బ్రతుకు మదిని చర్చజేయ.
0340
దేహస్థిరమ్ము స్థిరమైన వాసమ్ము
నెఱుగలేక జీవి తిరుగుటేల?


 35. సన్యాసము
0341
దేని దేని నుండి దేనిని నిడనాడు
దాని దాని నుండి తనకు ముక్తి.
0342
ఉన్నవన్ని పదలుకొన్నట్టి వారల
కపరిమిత సుఖమ్ము లనువుపడును.
0343
పట్టిపెట్టుకొనుము పంచేంద్రియమ్ముల
వదలిపెట్టవలయు వస్తుచయము
0344
సర్వమెడలు టగును సన్యాస నియమమ్ము
మిగిలెనేని యొకటి తగులు నన్ని.
0345
పుట్టువందె రోత బుట్టిన వారికి
పలసినట్టి దేది వసుధ లేదు.
0346
నేను నాదటన్న దానిని నిడనాడ
సురల కలవిగాని సుఖము దక్కు.
0347
పట్టు విడువకుండు పట్టిన కష్టాలు
పట్టు విడువ కాశ పట్టుకొన్న
0348
వదలిరన్ని మోక్ష పదనికి సన్న్యాసు
లన్య జనులు దగిలి రాశలందు
0349
యెంపుకొన్న నాశ తెగిపోపు పుట్టుక
యస్థిరంబు లాశలందు గలివి
0350
ఆశ్రయింప వలయు నాశలు దీరంగ
నాశ లేనినాని నాశ్రయింబి.


 36.  తత్త్వార్థము
0351
సత్తు కానిదెల్ల సత్తను నజ్ఞాన
కారణంబె జన్మ కారణంబు
0352
అంధకార మెడలి యనువగు సౌఖ్యము
మౌఢ్య మెడలి నట్టి మానవులకు.
0353
అజ్ఞతనే దొలంగి వెజ్ఞతనే స్థిరపడ్డ
చేరువగును మోక్షసీమ తనకు.
0354
ఐదు గెల్వగల్లి యాత్మానుభూతిని
సౌందలేని యెడల పుణ్యమేమి.
0355
దేనితత్త్వ మెట్టిదైనను  నిజతత్వ
మందు గనుటె జ్ఞాన మగునటండ్రు.
0356
తాత్వికముగ నిజము దరచి చాచినవారి
మనను మోక్షమార్గ మనుసరించు.
0357
తత్వచింతనమున తత్వంబు దెలిసిన
తరిగి పుట్టనట్టి స్థితి లభించు.
0358
పుట్టి గిట్టునట్టి బుద్ధిహీనత బాపి
మోక్షమిచ్చు బుద్ధి బుద్ధి యగును.
0359
ఏది సర్వమునకు నాధారమో దాని
పట్టుకొన్న పుట్టు బాధ లుడుగు
0360
కామక్రోధ లోభ కమల నామమ్ము
జెడిన చెడును వచ్చుఁ జెడుగులన్ని.


 37.  ఆశ
0361
ఆధ సత్య జీవరాళికి  జననమ్ము
వెలయ జేయునట్టి విత్తనమ్ము.
0362
కోరదలఁతువేని కోరుము పుట్టమి
దానిఁ గోర నాశ మానవలయు.
0363
ఆశలేమి కన్న నైశ్వర్యమే లేదు
నేలనైన మరియు నింగిలోన.
0364
సొద్దమెల్ల యాశ శూన్యమై నప్పుడే
సత్యప్రతుల కద్ది సాధ్యమగును.
0365
సన్న్యసించుటన్న సంకల్ప రాహిత్య
మున్న గృహము వదలుకొన్న గాదు.
0366
ఆశ లెవరినైన మోనగించును గాన
దానియందు భయమె ధర్మమగును.
0367
ఆశలంట దెగిన నడుగకుండనె తపః
ఫలములన్ని లభ్యపడు నిజమ్ము.
0368
ఆశ లేనివాని కలచాటులు కలుగ
వున్నవాని కుండు నన్ని వెతలు.
0369
కష్టములకు కష్టకాతణంబైనట్టి
యాశ దొఱగ దొరకు నమిత సుఖము.
0370
మేరు వొరిగెనేని తీరని తృష్ణకు
దూరమైన ముక్తి చేరువగును.

38.  విధి
0371
కలసివచ్చువేళ కార్యంబు దోచును
కలసిరాని వేళ నలసు దోచు.
0372
వేదవడఁగ బుద్ధి పెడదారి ద్రొక్కును
బాగుపడగ నదియె పదును దీరు.
0373
చదువవలసినంత చదివియున్నను గాని
బుద్ధి విధిని బట్టి పోవుచుండు.
0374
నృష్టి ద్వివిధమగును శ్రీవేరు ధీవేరు
వేరు బాటు కెల్లఁ వెధియె నాంది.
0375
గుణముగాని వన్ని గుణమౌను, గుణమును
గుణము గాకపోవు ధనము నంద.
0376
రానివేళ రాదు రమ్మన్న నేదియు
వచ్చువేళ పోదు వలదటన్న.
0377
ఇచ్చునట్టి వాని యిచ్చకు మారుగా
నేది ననుభవించ కాదు జూడ.
0378
సన్న్యసొంపకుంట సాగని వారెల్ల
విధియె కారణంబు వేరుకాదు.
0379
ఇష్టమైన నంతసింఛెడి వారలు
కష్టమైన నేడ్వగాదు విధికి.
0380
విధి బలీయ మగును విడువడు తప్పుకో
నెందుబోవ వచ్చి ముందు నిలచు.

2 comments:

  1. Hi Dr. Ashraf,

    You have done an amazing job. Having a website for Thirukkural with 22 translations is not easy. I have an android app supporting 10 languages. I clearly understand the heavy work behind this and I really appreciate it. I took most of the translations from your website and gave you the credit on my app page (https://play.google.com/store/apps/details?id=eam.droid.pt.enthirukkural). I just found an issue here. If I follow the link 31-38, it takes me to this page tel04.html. If I follow the link 39-50, again it takes me to this same page tel04.html. The chapters 51-60 are in tel06.html. So I manually edited the address to tel05.html. But it pops up an error message. So, there's no way I am able to read the chapters 39-50. Can you please check it out and add them?

    Thanks,
    Karthik

    ReplyDelete
  2. Seeing this message only now! Don't know if I have addressed this..... will check..... Thanks

    ReplyDelete