Thursday, 3 September 2009

tel02


Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

11. కృతజ్ఞత
0101
ఎట్టి ప్రతిపలమ్ము నెదురుజాడకఁ జేయు
మేలె గొప్ప మన్ను మిన్ను కన్న.
0102
కాలమెఱిఁగి జేయ గలిగిన మేలది
చిన్నదైనఁ జగతికన్న మిన్న.
0103
అశలేక మేలుజేసిన గొప్పకు
సాగరంబు గూడ సమము గాదు.
0104
కొంచమైన మేలు కొండగా భావింత్రు
దాని మహమ దెలియ దగినవారు.
0105
కొలతఁబిట్టి మేలు గొలచుట సరిగాదు
గుణము నందె దాని గొప్ప కలదు.
0106
ఇడుములందు సాయపడినట్టి మైత్రిని
పీడఁరాదు మేలుఁ జాడవలయు.
0107
అదుకొన్న స్నేహ మాపదఁ దొలిగింప
జన్మజన్మములకు జ్ఞప్తిగలుగు.
0108
మేలు మఱువరాదు మేనుండు నందాక
కీడు మఱువ పాడినాడు నాడె.
0109
తలకు మించి కీడుఁదలపెట్టు వాని దౌ
మేలు కొంత దలుపఁ జాలి కలుగు.
0110
దేనినైన మఱువఁ దెరవుండు బ్రతుకంగ
మేలు మఱచి బ్రతుక వీలుగాదు.


12. తాటస్థ్యము
0111    
పక్షపాత మెడలి వర్తించుటే న్యాయ
మందులొనె సౌఖ్య మమరియుండు
0112
న్యాయపరుని సొమ్ము నాళమ్ము గాఁబోదు
తరతరాల వరకుఁ బెఱుగునద్ది
0113
ఇంద్రవదని బుధుల కెక్కువ గాడెన్న
ధర్మ పక్షమునకుఁ దగనిదైన
0114
వారి వారికున్న వారసత్యమె తెల్పు
తగును తగడటంచు తథ్యముగను
0115
కలిమిలేములెల్ల కలుగునవే గాన
బుధులు న్యాయపథము వదలరెందు
0116
అంతరాత్మ న్యాయ మందించు చుండగా
చెవిని బెట్ట్కున్నఁజెడు నతండు
0117
తగ్గు తగ్గుగాదు తాటస్థ్యపరునికి
నెగ్గుగాను దలువ రెవరుగాని
0118
తూచు కఱ్ఱవిధము తూగినచో బుధ్ధి
బుధుల కదియె తగిన భూషణమ్ముః
0119
మనను నుండిగాదె మాటలన్నియు వచ్చు
మాట న్యాయమెల్ల మనను విధము
0120
వర్తకంబు వెరుగు వ్యత్యాస ముంచక
సొంతమట్లు పరుల సొమ్ముఁజూడ.
 
13. అణకువ
0121
అమరులందు జేర్చు నణకువ యొక్కుని
నడుసు నందు దొక్కు మిడిసిపాటు
0122
ఊసిరున్న దనుకఁగా పాడు మణకువనే
కలిమికన్న దాని ఫునత హెచ్చు.
0123
విద్య వినయమంచు విభుదుండు భావించి
మెలఁగుచుండు బ్రతుకు మెరుగు పడఁగ
0124
ఊన్న ధర్మమునకు భిన్నత గానట్టి
నిగ్రహ పరుఁజూడ వింగి వంగు
0125
అందఱికిని మంచి యణకువగా నున్న
నున్న వారి కధిక వన్నెఁదెచ్చు
0126
కూర్మ మట్టులణచు కొమవాని కీ జన్మ
కేడు జన్మములకు తోడు సుఖము
0127
వదలరాదు నాల్క వదలిన సర్వమ్ము
మాటఁజార భంగపాటు వచ్చు
0128
మంచి మాటనున్న మర్యాద సర్వమ్ము
చెడ్డమాట నొకటి చెడును పూర్తి
0129
అగ్గి గాల్చు మచ్చ లారును పూర్తిగాఁ
నన్నమాట మచ్చలార వెపుడు                  
0130
కోప తాప మణచు కొనువాని క్షేమమ్ము
తనదిగానె జూఛు ధర్మమెపుడు.
 
14. నడవడి
0131
ప్రాణమగును నడత ప్రాణమ్మూ కన్నను
గౌరవమ్ము దాన గలుగు గాన
0132
తెలియఁదగిన దన్ని తెలిసియున్నను గాని
నడవడి సరిగామి నాణ్యమెడలు
0133
ఇంటి గొప్పదనము నెఱిగించు నడవడి
మంచి చెడుగు దాన నెంచదగును
0134
మరచిన శృతుల్తెన మరినేర్చు విప్రుండు
ఓగు పడిన యెడల బాగుపడడు
0135
లోభీకెంత యున్న లాభమ్ము లేనట్లు
వైకిరాడు దుష్ప్రవర్త నుండు
0136
సత్ప్రవర్తనమున సజ్జనులే వర్తింత్రు
దుష్ట వర్తనమున దోష మెఱిగి
0137
మంచి నడతవలన మర్యాద హెచ్చును
తప్పు నడత వలన ముప్పు వఛ్చు
0138
సత్ప్రవర్తనంబు సాఖ్యతా బీజమ్ము
దుష్ట వర్తనమ్ము దుఃఖకరము
0139
అనుచితంబు జెప్పరాచార పురుమలు
మరువు జేతనైనా మాటఁ  మరచి
0140
లోకపోక డెరిగి పోకున్న వాడెంత
చదువు జదినియున్న జదువనట్లె.


15. పరదారావిముఖత
0141
వరుల నాలిగోరు భావమ్ము దద్థర్మ
పరులయందు గానబడదు చూడ
0142
భ్రష్ఠలందు పరమ భ్రష్ఠండు పరనతి
నాశజేసి సమయ మరయువాఁడు
0143
నమ్మినట్టివాని నాతిని గోరెడు
సభుడు సభుడుగాడు శవముగాని
0144
ఎంత వాడెయైన నినుమంతఁ జేయడు
పరసతులను గోరు భావమున్న
0145
పరసతి సుఖమబ్బు పని తేలికేయైన
తిరరాని నింద జేరు నతని
0146
పగయు, భయము, నింద, పాపమ్ము నాలుగు
పరసతులను గోరువానితోడు
0147
క్రమము దప్పునట్టి గార్హస్థ్య ధర్మంబు
అన్య స్త్రీలఁ గవయ నట్టి దగును
0148
కామ దృష్టి యన్య కాంతలవై లేమి
పురుష లక్షణమ్ము పుణ్యమగును
0149
జలధి పరివృతమగు జగమందు విఖ్యాతి
పరనతి భుజ బంధ మరయరామి
0150
పాప కర్మలెన్నొ పనిగొని చేసినా
పరనతి తభిలాషఁ బడమి మేల్మి


16.  ఓర్పు
0151
త్రవ్వువారినైనఁ ధరమోయు నట్టులే
తెగడుచున్న నోర్వ తగునటండ్రు
0152
కీడనర్వ దాని కీడు జేయమి గొప్ప
మరచుటంతకన్న మంచి దగును
0153
బలిమిలోన బలిమి పగతుని మన్నింప
నతిథి కిడమి బీదలందు బీద
0154
నిండుదనము సీలొ నుండంగ నెంచిన
వదలకొర్పు భద్ర పరుప వలయు
0155
మానికముగ గొంద్రు మన్నించు వానిని
ఆడిపోను కొంద్రు రాత్రగాని
0156
ఓర్వలేని వాని కొక్కనాడె తృస్తి
యున్నదనుక కీర్తి యోర్చుకొన్న
0157
చేయరాని తప్పు చేసిన వారికిన్
నీతి దప్పి శిక్ష నెఱపరాదు
0158
ఆత్రపడిన వాని యన్యాయముల నెల్ల
నోర్పుచేత గెల్చు నుత్తముండు
0159
ఆత్రగాని నోట నవదూరు మాటలు
వినుచు నోర్చుకొన్న మునుల సమము
0160
వినుచు నూరకున్న వినరాని మాటలు
తపము జేయనేల నుపవశించి


17.  ఓర్వలేమి
0161
మంచివాడటంచు మహిమీదఁ బొగడొందు
క్రుళ్ళుబోతు తనము గూడకున్న
0162
ఆర్జనంబులన్నియార్జించినట్టులే
లేని యెడల యోర్వలేని తనము
0163
ధర్మదూరుడైన దైన్యుండు మాత్రమే
యున్న వారి జూచి యోర్వకుంట
0164
చేతగాని వాడె సితిగా బ్రతుకంగ
నొరుల పొమ్ముజూచి యోర్వకుంట
0165
ఓర్వలేమి వలన నుత్పన్ను మగుముప్పు
విజ్ఞలెఱిగి దాని విడచి యుంద్రు
0166
వైరులైన మరచి వర్తింత్రు కీడెన్న
కాచియుండు క్రుళ్ళు కాటువేయ
0167
కూడు గుడ్డ లేక పాడౌను దనుదానె
యెరుల కీయ జాచి యోర్వకున్న
0168
క్రుళ్ళుజోతు వాని కొంపకు శ్రీదేవి
యడుగుబెట్ట మరచు నక్కనంసి
0169
లబ్ధమైన ధనము లుబ్ధత జోవును
తప్పుదారులందు ద్రిప్పబెట్టె
0170
క్రుళ్ళుబోతు మిగిలి కూర్చున్నదియు లేదు
మంచివాడు చెడుట మహిని లేదు

18.  లోభము
0171
పరుల కున్న వస్తువు తనకని
కోరు లోభి చెడును కొంప మునిగి
0172
అప్పటి కగుదాని నాళించి నిందకు
పాలుపడరు ధర్మపరులు భువిని
0173
అల్ప సౌఖ్యమునకు నపహరింపగఁబోరు
బ్రహ్మా సుఖము గోరు ప్రాజ్ఞలెల్ల
0174
పేదవడియునైన వెరసొత్తు నాళింప
డిండ్రియముల స్థిమిత మెరుగు నతఁడు
0175
విద్యలందు సూక్ష్మ విషయమ్ము లెఱిగియు
లోభ ముడుగకున్న లాభమేమి.
0176
ముక్తి గోరుకొన్న మోహంబు ధనమందు
వెలకు దెచ్చివెట్టు వెతల నన్ని
0177
పరుల సొమ్మచేతఁ బెరగదు తన సొమ్ము
వెరిగెనేని తుదకు తరిగిపోవు
0178
ఉన్న సొత్తు తరుగకుండెడు మార్గమౌ
యెరుల సొత్తు కోర కుండు టగును.
0179
సితికి నెలవౌచు నిర్లోభ పరుతైన
పండితులను లక్ష్మి పలుకరించు
0180
లాభమేమి లేదు లోభమ్ము గూడిన
వైభవమ్ము దాని వదలుకొన్ను.

19.  చాటుమాటలు
0181
ధర్మపరుడటంచు తలయెత్తకున్నను
చాటుఁ బలుకదేని నజ్జనుండె
0182
మంచి బలికి యెదుట మరుగున నిండించు
క్రూర కర్ముఁగీడు గూడియుండు
0183
చాటుఁబలికి నిజము మాటు మణగజేసి
బ్రతుకు బ్రతుకు కన్న మృతి సుఖమ్ము
0184
చెప్పవచ్చు నెదుట చెంపనదర గొట్టి
చేటుఁ దలుపరాదు చాటు మాట
0185
వారివారి ధర్మవర్తనం బెట్టిదో
చాటుమాటె దెల్పు క్షణమునందు
0186
ఎదిరి గుట్టుఁజాట నెంచిన తోడనే
తనదు గుట్టు బయట తానె బడును
0187
ఇంపు మాటలందు నిమిడిన స్నేహమ్ము
చాటు మాటలందు సమసిపోవు.
0188
స్నేహితులకె చేటు జేసినన్ చాటుగా
పరుల యందు నింకఁ బలుకనేల
0189
వెనుక నొకటి బలుకు పనికి మాలినవాని
ధరణి మోయునేమొ ధర్మమునకు
0190
తప్పు లేఱిగినంత దనతప్పు దెలిసిన
మెరుగుపడును బ్రతుకు మీదమీద.

20.  వ్యర్థభాషణ
0191
ఫలమొకింతఁ లేక వ్యర్థంబుగాఁ బల్కు
నట్టి వాని లక్ష్య వెట్టరెవరు.
0192
వ్యర్థ భాషణమ్ము వ్యథనిచ్చు వంచించి
స్నేహితులకుఁ జేయు టెడువు కన్న
0193
వదురుజోతటంచు నెదిరికి దెలిసించు
వ్యర్థమైన దాని వ్యాఖ్యజేయ.
0194
చెప్ప దొడఁగునేని చెత్తగా నేదేదొ
నష్టపడును వాని నాణ్య మచట
0195
గొప్పదన మదెంత గూడిన వాడైన
భంగపడును వ్యర్థ భాషణమున
0196
సత్తులేక బలికి సామర్థ్యుఁడనుకొన్న
పురుషఁడెట్టు లగును పొల్లు గాని
0197
దొడ్డవారి మాట దుడుకుగా నున్నను
పొల్లు మాట జెప్ప నొల్ల రొకటి
0198
సత్తులేని మాట సర్వజ్ఞు లాడరు
పలికిరేని దాన ఫలిత ముండు.
0199
సత్యథంబు గోరు శాస్త్ర పారంగతులే
విష్వలముగ జెప్ప నేర రొకటి
0200
పలుకఁ దలతువేని పలుకుము ఫలమీయ
ఫలము లేని పలుకు పలుక వలదు.

No comments:

Post a Comment