Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
71.
గుర్తింపు
|
|
0701
|
అంగములనె
జూచి యంతరంగ మెఱుగు
మనుజఁ
డవని లోన మానికంబు.
|
0702
|
మనసు
నందు నుండు మర్మంబు ముఖమందె
చూచి
చెప్పు నతఁడు సురల కీడు.
|
0703
|
చూచినంతలోనె
సూక్ష్మమ్ము కనిపెట్టు
వాని
గొనుము తనువునైన నిచ్చి.
|
0704
|
ఉన్న
తలపు చెప్పకున్నను గుర్తించు
నతడు
వేరె లోకు లందరందు
|
0705
|
గురుతులన్ని
జూచి గురి గానకున్నచో
కన్నులంగ
మందు గన్నదేమి.
|
0706
|
తనదు
రూపుఁ జూపు దర్పణం బట్టుల
వదనమెత్తి
జూపు హృదయ గతిని.
|
0707
|
కష్ట
సుఖములెల్ల గననౌను ముఖమందె
దేని
జూచి మిగత దెలియవలయు?
|
0708
|
అర్ధమగును
ముఖము నం దంతరగమ్ము
ముద్రలెఱుంగు
వాని ముందు నిలువ.
|
0709
|
పగయు,
మైత్రి కండ్లు ప్రకటించుగావున
శక్తి
వలయునండ్రు సంజ్ఞలెఱుగ.
|
0710
|
సూక్ష్మబుద్ధి
యంచు చూవరు లెఱుగంగ
కండ్లుగాక
వేరె కలదె చూడ.
|
|
|
72.
సభ
|
|
0711
|
మాట
పొందుఁదెలసి కూటమ్ము గమనించి
వక్తస్ఫుటముగాను
వ్యక్తపఱచు.
|
0712
|
మాట
తేట లెఱుగు మహనీయలందఱు
నున్న
చోటెఱింగి యచ్చరింత్రు.
|
0713
|
స్థితిని
దెలియలేకఁ జెప్పెడివారెల్ల
మాట
దెలియనట్టి మోటువారె
|
0714
|
నిపుణులందు
జూపు నిపుణత్వమున్నచో
మూగ
వోలెనుండు మూర్ఖులెదుట.
|
0715
|
సుఖములందు
గొప్ప సుఖమగు, పండితు
లున్న
సభను మాట లుడిగియున్న.
|
0716
|
విజ్ఞులెనవారు
వినుపించు సభలోన
నడ్డువచ్చు
వాని యెడ్డడండ్రు.
|
0717
|
చదుపుకొన్నవారి
సామర్థ్యమంతయు
పండితాళి
ముందె పరిమళించు.
|
0718
|
ఆలకించు
వారి నరసి మాటాడుట
ఫలితమున్న
చేను బార్చినట్లు.
|
0719
|
సభను
మెప్పు గోరు చతురండు మఱచియు
పలుకరాదు
మోటు వారిముందు.
|
0720
|
మలినమందు
సుధను జిలికిన విధమౌను
సాటిలేని
వారి సభను బలుక.
|
73. సభాకంపము
|
|
0721
|
పలుకులందు
భవ్యభావమ్ము గలవారు
సభకుజంకి
మాట సడలరెపుడు.
|
0722
|
చదివి
నట్టివారి సన్నిధి చదివిన
చదుపు
వ్యక్తపఱచు బుధుడె బుధుడు.
|
0723
|
పగతు
నెదిరి పోర, పలువురు సిద్ధంబు
నిర్భయముగా
సభను నిలువలేరు.
|
0724
|
ఎఱిగినట్టి
విషయ మెఱిగించి యెదిరిచే
యెఱుగ
దగినదెల్ల నెఱుగవలయు.
|
0725
|
చర్చ
జరుగువేళ సభలోన జంకక
బుధుల
కెదురు నిలువ చదువ వలయు.
|
0726
|
వాడి
ఖడ్గమేల బోడిమి దప్పిన
చదువదేల
సభకు ముందము నిడక.
|
0727
|
బేడి
కత్తిబట్టు బెదురు వారెస్వరు?
శాస్త్ర
పఠనమేల సభకు జంక.
|
0728
|
ఎంత
జదుపుకొన్న నేమౌను సభలోన
వ్యక్తపరుపకున్న
ముక్తసరిగ.
|
0729
|
చదివి
జంకునెడల శాస్త్ర పాటవముండి
విద్యరామికన్న
వెలితి యగును.
|
0730
|
చదివి
జదువనట్లె శాస్త్రజ్ఞులకు జంకి
తెలితఁజెప్ప
లేకఁ దెల్లబోవ.
|
74. రాజ్యము
|
|
0731
|
పాడి,
పంట, ధనము పండిత ప్రాబల్య
మున్న
దాని రాజ్యమున్న తగును.
|
0732
|
కోరఁదగిన
యట్టి భూరి సంపదలుండి
దిగులు
దీర పండ దేశమగును.
|
0733
|
పన్నులిచ్చి
వలస పచ్చిన పోషించి
రక్తి
చెడనిదగును రాజ్యమన్న.
|
0734
|
తిండి
భయములేక తీవ్రబాధలు లేక
రణ
భయమ్ములేమి రాజ్యమగును.
|
0735
|
అంతరంగ
కలహ మన్యాయ వర్తన
రాజ్యహత్యలేమి
రాజ్యమగును.
|
0736
|
ఏ
త్య్వద్రవమ్ము నెఱుగక వచ్చినన్
సష్టపడని
దగును నాడటన్ను.
|
0737
|
కోట
కొండలుండి నిటితో నదులుండి
వర్షపాతమున్న
వసుధె వసుధ.
|
0738
|
సశ్యవృద్ధి,
సుఖము, సంపద, సంరక్ష,
వ్యాధిలేమి
శోభ వసుధకైదు.
|
0739
|
పాటు
కొంచెమైన ఫలిత మెక్కువయైన
దేశమునకె
వేరు దేశమనఁగ.
|
0740
|
పైన
జెప్పినట్టి ప్రాభవమెంతున్న
రాజు
క్రూరుడైన రాజ్యమగునె?
|
|
|
75. కోట
|
|
0741
|
ముఖ్యమగును
కోట ముట్టడించుటకును
ముట్టడింప
డాగఁ మూల మదియె.
|
0742
|
శుభ్రమైన
నీరు, సువిశాలపు స్థలము,
కొండ
యడువులుండ కోట యగును.
|
0743
|
పోడువు,
వెడద, దృఢత బొల్పొంది రిపులచే
గూల్పరాని
దగుచు గోట వెలయు.
|
0744
|
ద్వార
మల్పముగను దండుండ పెద్దదై
దోచగాని
దగును దుర్గమన్న.
|
0745
|
అరుల
కలవిగాక నాహార సామగ్రి
కొరత
లేనిచోటు గోట యండ్రు.
|
0746
|
సకలముండి
దైర్యసాహసంపు ధటుల
గూడుకొన్న
దగును కోటయన్న.
|
0747
|
ఏవిధముగాను
నెదిరి కసాధ్యమౌ
గట్టిపట్టు
కోట ముట్టడింప.
|
0748
|
ఎదిరి
బలము లదర బెదిరించు వీరులు
కుదురుకొన్న
చోటు కోటయగును.
|
0749
|
ఉన్న
తావునందె యన్ని సాములు నేర్వ
శత్రువులను
గెల్చు స్థలమె కోట
|
0750
|
పై
గుణమ్ము లెన్ని బైకొన్న దగునేత
ఉండకున్న
కోట దండగగును.
|
|
|
76. ధనార్జనము
|
|
0751
|
లెక్కలేనివాని
లెక్కింప జేవెడి
లెక్కధనమ్ముగాక
లేదు వేరె.
|
0752
|
లేనివాని
నెవరు లెక్కింప రెవ్వరు
ఉన్నవాని
గూడి సన్నుతింత్రు
|
0753
|
ఎట్టి
చోటనైన చిట్ట జీకటి బాపు
నారిపోని
దీపమగు ధనమ్ము.
|
0754
|
ధర్మసమ్మతముగ
ధనము సంపాదింప
కామ
మోక్షమెల్ల గలుగుగాన
|
0755
|
దాన
ధర్మములకు తగని సంపాదన
వైభవమ్ము
గాదు వగపు దెచ్చు.
|
0756
|
ప్రభువు
బొక్కసంబు, పన్నును సుంకమ్ము
కప్ప
మనగ మూడు మెప్పుగాను.
|
0757
|
దయకు
బుట్టు బిడ్డ దాక్షిణ్య మనువేర
కలిమి
యనెడి దాది వలన పెఱుగు.
|
0758
|
కరులబోరు
జూచు కరణిని గిరినుండి
చేతనుండ
ధనము చేయు పనులు.
|
0759
|
ఎదిరి
గర్వమణచ బదునైన ఖడ్గమ్ము
ధనముకన్న
వేరె ధరణి లేదు.
|
0760
|
ధనమువలన
గల్గు ధర్మంబు గావున
నీతి
దోడఁదాని నిలువుకొన్న.
|
|
|
77. సేన
|
|
0761
|
రథ
గజాది యంగ రక్షణతో సేన
వెరిగినపుడె
నృపుని వేరు వెరుగు
|
0762
|
సేన
కొంచెమైన చెదరక బెదరక
నాలమందు
నిలచు మూల బలము.
|
0763
|
అలలవోలె
యెలుక లరచి పైబడనేమి
యురగ
ముస్సు రనిన పరుగు లిడును.
|
0764
|
చితికి
పోక వైరి సేనకు లొంగక
ముందు
ముఖమె పట్టు మూలబలము.
|
0765
|
ఆలమందు
నిలువ కాలపురుషుని యైన
యెదిరి
నిలువగలుగు నదియె సేన.
|
0766
|
దండుకుండవలయు
దక్షత నియమమ్ము
తేలిని
తెంపు నాల్గు స్థిరముగాను.
|
0767
|
ఎత్తివచ్చువారి
యెత్తును గనిపెట్టి
ముట్టడించునదియె
ముఖ్యబలము.
|
0768
|
శక్తిహీనమైన
స్థైర్యమ్ము లేకున్న
శిక్షణమున
సేన శ్రేష్ఠమగును.
|
0769
|
వెలితి
పేదరికము విసుగును లేకున్న
నిజముగాను
సేన విజయమందు
|
0770
|
బలము
గల్గినట్టి భటు లెందఱున్నను
నడుపు
నేతలేక చెడును సేన.
|
78. శౌర్యము
|
|
0771
|
నిలువవలదు
మాదు నేతకు నెదురొడ్డి
నిలచినట్టివారి
శిలల జూడు.
|
0772
|
చెవులపిల్లి
గురికి బిక్కు బాణము కన్న
నేన్గు
తప్పుకొన్న యీటె మేలు
|
0773
|
శౌర్యమందు
గొప్ప శౌర్యము పగతుని
దుర్దినంబులందు
తోడువడుట.
|
0774
|
చేత
బరిసెలేని చింతను బోగొట్టె
రొమ్మునగల
యీటె రోషముసగి.
|
0775
|
అదిరెనేని
రెప్ప యెదురైన బఅణమ్ము
లవజయంబున
కదె యానవాలు.
|
0776
|
గాయపడనిఒ
నాళ్ళు గణియించి వీరుండు
వ్యర్థమాయె
నంచు వ్యసనపడును.
|
0777
|
వీర
కంకణమ్ము విభునిచే బడయంగ
ప్రాణమీయ
వీరవరుండు గోరు.
|
0778
|
రాజు
వలదటన్న రణరంగమున నుండి
వీరవరుఁడు
రాడు వెన్ను చూసి.
|
0779
|
లక్ష్యమునకు
నుసురు లక్ష్యంబు జేయని
వీరుఁ
దోషములను వెదక రెవరు.
|
0780
|
చావుఁ
గోరుకొనును సామ్రాట్టు కన్నుల
నీరు
గారునట్లు వీరవరుఁడు.
|
79.
స్నేహము
|
|
0781
|
చేయనేమి
కలదు స్నేహమ్ము కన్నను
కర్మకన్న
రక్ష కల దదేది?
|
0782
|
శుద్ధమైన మైత్రి శుక్లపక్షము
బోలు
కృష్ణపక్ష మగును క్లిష్ట
మైత్రి.
|
0783
|
చదువఁ
జదువ నయము సాధ్యమౌ కావ్యము
చేరఁ
జేరఁ సుఖము శిష్టజనుల.
|
0784
|
నవ్వులాట
గాదు నెవ్వరితో చెల్మి
హద్దు
మీరఁ గొట్టిదిద్ద నగును.
|
0785
|
పూనుకొన్న
గాదు పొందిక నొండొరు
లైక్యభావ
మందు నమరియుండు.
|
0786
|
మైత్రికున్న
సొంపు మందహాసము గాదు
విరియవలయు
హృదయ వీధియందు
|
0787
|
చెడువు
రాకఁగాచి చెడినప్పు డతనిని
వీడకుండు
టగును తోడటన్న.
|
0788
|
అడ్డపడును
చేయి గుడ్డ జారినవేళ
నట్టు
లొదవు మైత్రి యాపదలను.
|
0789
|
సర్వకాలమందు
సాధ్యమైనట్లుగా
నాదుకొనుటె
మైత్రి కందమగును.
|
0790
|
ఇట్టు
లితఁడు నాకు నీ రీతి నే నన్న
మైత్రి
గొప్ప కపుడె మచ్చ బుట్టు.
|
80. స్నేహమును
గుర్తించుట
|
|
0791
|
చెడువులేదు
చెలిమిఁ జేయకపోయిన
కుజనమైత్రి
వదలుకొనుట మంచి.
|
0792
|
అరసి
యరసి స్నేహమాడని దోషమ్ము
చచ్చునట్టి
భాధఁ దెచ్చిపెట్టు
|
0793
|
గుణము,
కులము, బందుగణమును గుర్తించి
చేసినట్టి
మైత్రి స్థిరము గాంచు.
|
0794
|
మంచి
యింట బుట్టి మానంబునకు జంకు
వాని
గొనుముదేనినైన నిచ్చి.
|
0795
|
దుఃఖ
పడఁగ జెప్పి దోషమ్ము ఖండిచి
మార్గ
దర్శకమగు మైత్రి గొనుము.
|
0796
|
కష్టములను
మేలె కలదండ్రు, మిత్రత్వ
మెట్టి
దనుచు కొలతఁబట్ట నగును.
|
0797
|
లభ్యమైన
దన్న లాభమ్ము నొకనికి
దుర్జన
సహవాస వర్జితంబె.
|
0798
|
పట్టు
సడలఁ జేయుఁ బని జేయఁబూనకు
చిక్కులందు
జారు చెలిమి వలదు.
|
0799
|
ఆదుకొనని
స్నేహ మాపద లందున
చచ్చునపుడు
దలువఁ జీచ్చుబుట్టు.
|
0800
|
గుణము
గల్గు చెలిమిఁగొను మంతకైనను
ఇచ్చియైన
విడుము తుచ్చ మైత్రి
|
No comments:
Post a Comment