Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్) |
81.
చనువు
|
|
0801
|
చనువనంగఁ
జెల్లు సహాయించి యేదైన
స్వీకరించునట్టి
స్నేహితంబు.
|
0802
|
స్నేహమునకు
గుర్తు చెప్పకజేయటే
నొప్పుకొనుటె
దాని గొప్పదనము.
|
0803
|
చెలిమి
చాల నాళ్ళు చేసిన ఫలమేమి
చనువె
లేకయున్న సలువ నొకటె.
|
0804
|
బాధ్యత
గలద్దంచు పాటించి చెప్పక
చేయు
వనిని చనువె స్వీకరించు.
|
0805
|
తెలియని
తనమనుచుఁ జెలిమితో పలికిన
హితుని
తప్పు నోర్వ హితమంటుండ్రు.
|
0806
|
చనువు
వలన గొప్ప సంకటమేరాగ
వదలుకొనడు
మిత్ర వరుఁడు దాని.
|
0807
|
మిత్రయందు
ప్రేమ సూత్రమ్ము తెగరాదు
హితుని
వలన బ్రతుకె హీనమైన
|
0808
|
వినక
నెవరు జెప్ప విశ్వసించెడు మిత్రు
ద్రోహపరచు
దినమె దుర్దినమ్ము.
|
0809
|
కాల
కాలముగను గలసిన స్నేహమ్ము
విడని
వాని బొగడు విశ్వమెల్ల.
|
0810
|
ఎన్నిజేయ
స్నేహ మెడబాటు గానట్టి
మిత్రులఁ
బగవారు మెచ్చుకొంద్రు.
|
|
|
82.
దుర్జనమైత్రి
|
|
0811
|
కరిగి
ద్రాగినట్లు కనిసించు ఖలుమైత్రి
తరిగినంత
మేలు వెరుగనీక.
|
0812
|
కలిగినప్పు
డుండి తొలిగిన దొలిగెడు
స్నేహ
మున్ననేమి చెడిన నేమి.
|
0813
|
సాని,
దొంగవాని సరిబోలు నందురు
ఫలముగోరి
చెలిమి సలుపువారు.
|
0814
|
అనిని
బారనట్టి యశ్వంబు సరిమైత్రి
యుండు
టొకటె లేకయుండు టొకటె.
|
0815
|
కష్టములను
నాదఁ గానట్టి స్నేహమ్ము
చెడినమేలె
వృద్ధిఁ జెందకుండ.
|
0816
|
అల్ప
జనులతోడి యన్యోన్యమునకన్న
ప్రాజ్ఞులైనవారి
పగయె మేలు.
|
0817
|
మాట
మైత్రికన్న కోటికి లాభమ్ము
శత్రువులుగనుండి
సలుపు చెడుపు.
|
0818
|
విజయ
మొసగు పనికి విఘ్నాలు గల్పించు
చెలిమి
వదలనగును జెప్పకుండ.
|
0819
|
మాట
చేతలందు మర్మంబు గలమైత్రి
కలను
గూడ వచ్చి కలతబెట్టు.
|
0820
|
ముందు
బొగడి వెనుక నిందించు దుర్జను
చెలిమి
రెప్పపాటుఁ జేయవలదు.
|
83. తగని
మైత్రి
|
|
0821
|
పైకి
చెలిమిఁజూపి పగ నెదవర్తించు
చెలిమి,
జెలిమిగాదు కొలిమిగాని.
|
0822
|
ఐనవారలట్టు
లనిపించి వేరైన
వారి
చెలిమి వారవనితఁటోలు.
|
0823
|
చదివినంత
రాదు సంస్కార సంపత్తి
మనసు
మనసుతోడ మైత్రిగాక.
|
0824
|
నవ్వు
తొలకరించు నయవంచకుల మైత్రి
తలఁచుకొన్న
భయము గలుగు చుండు.
|
0825
|
చిత్త
మత్తుకొనని చెలికాని మాటలు
నిర్ణయింపరాదు
నిజమటుంచు.
|
0826
|
మిత్రులవలె
మేలుఁ మిగులంగ బలికినన్
వంచకంబు
బయట పడున దెట్లొ.
|
0827
|
వినకు
కాని వాని వినయంపు మాటలు
విల్లు
వంగినట్టి విధముగాన.
|
0828
|
దండమన్న
చేతి దాపున క్రూరస్త్ర
మణఁచగలడు
శత్రువైనవాడు.
|
0829
|
కాని
వాని యెడల కలసినట్లుండియే
తొలిగిపోవఁ
మెఱుగు తొందఱగను.
|
0830
|
మోసగానితోడ
మురిపించునట్టులే
తెంపుకొనుట
చెలిమి కింపటండ్రు.
|
84. అనివేకము
|
|
0831
|
తెలివి
హీనముందు దెలిపెడిదేమన్న
చెడువునంటె
మంచి విడచుటగును.
|
0832
|
హీనమందు
గొప్ప హీనమ్ము సర్వదా
చెడు
ప్రవర్తనమ్ము విడువకుంట.
|
0833
|
సిగ్గులేమి,
లక్ష్య సిద్ధిలేమి, మూర్ఖమ్ము
మూడు
కూడియుండు మూర్ఖునందు.
|
0834
|
చదివి
చెప్పగల్లి, నది చేయకున్నచో
వాని
కన్న బుద్ధి హీనుడెవడు?
|
0835
|
ఏడు
జన్మములకు నెడ్డండు నరకమ్ము
నొక్క
జన్మలోనె చిక్కబట్టు.
|
0836
|
నీతి
బాహ్యాఁడగుచు నిర్వహించిన కర్మ
చెడును
లేనియెడల శిక్ష మిగులు.
|
0837
|
ఇతరు
లనుభవింప వెతలంద్రు స్వజనులు
తెలివిహీనుడున్న
కలిమి మిగిలి.
|
0838
|
వెట్టి
కల్లు ద్రాగు విధమగు నవివేకి
హస్తమందు
లక్ష్మి యమరునేని.
|
0839
|
బుద్ధిహీను
మైత్రి తద్దయు సుఖమిచ్చు
తొలఁగునపుడు
బాధ కలుగరామి.
|
0840
|
మట్టికాళ్ళఁ
బరుపు మంచ మెక్కిన రీతి
బుద్ధిహీనుడేగ
బుధుల సభకు.
|
|
|
85. అవగుణము
|
|
0841
|
లెక్కుకెక్కదేది
లేకున్నఁ జెప్పగా
లెక్కకెక్క
బుద్ధి లేకయున్న.
|
0842
|
హీను
డీయ డేది యిచ్చినన్ నద్దాని
పుచ్చుకొన్నవాని
పూర్వకృతము.
|
0843
|
కుమతి
తనకు దానె కుమిలిపోయెడు బాధ
శత్రువులకు
బెట్ట సాధ్యపడదు.
|
0844
|
మౌఢ్యమన్న
దొకటి మహిమీద నున్నచో
నన్ని
దనకె దెలియునన్న మదమె.
|
0845
|
చదివినట్లు
జెప్ప చదవకఁ జదివిన
చదువులందు
బుట్టు శంకలెన్నొ.
|
0846
|
తప్పుగప్పు
కొనకఁ దనువునే గప్పును
గుణము
లేనివాఁడు గొప్పగాను.
|
0847
|
మర్మమెడలఁ
జేయు మతిహీనుడగువాఁడు
తనకుఁదానె
కీడు ననుభవించు.
|
0848
|
వినమి
జెప్పినట్లు తనకైన దెలియమి
చచ్చుదనుక
వెంట వచ్చునొప్పి.
|
0849
|
బుద్ధిహీను
దెవడు బుధులమాట వినడు
తనదు
మార్గమందె తాను పోవు.
|
0850
|
లోకులున్న
దన్న లోకోక్తికాదన్న
వాని
దయ్యమనుచు వసుధ బిలచు.
|
|
|
86. కలహము
|
|
0851
|
కలసి
మెలసి యుండు చెలిమిని బాధించు
రుగ్మత
కలహంపు రూపమగును.
|
0852
|
చెలిమి
లేకయున్న చెడువుగాదొకనికి
కలహమాడరాదు
కలుసుకొన్న.
|
0853
|
బాధలందు
మిగుల బాధించు కలహమ్ము
విడచి
నంత దాని వెలయు కీర్తి.
|
0854
|
కష్టములకు
నెల్ల కలహమ్ము మూలమ్ము
దాని
వెడువ సుఖము తానె వచ్చు.
|
0855
|
కలహములకు
దిగకఁ దొలగి పోయెడువాని
గెలువ
దలచువారు గలరె జూడ.
|
0856
|
కలహ
జీవనమ్ము గలవాఁడు బ్రతుకున
బాగుపడుటకన్ను
నోగుపడును.
|
0857
|
కలహమందె
కన్ను గలవార లెప్పుడు
నీతి
మార్గమందు నిజము గనరు.
|
0858
|
పగకు
దూరమైన ప్రాప్తించు సంపద
లంట
దాని చెడుగు లావహంచు.
|
0859
|
కలహ
దూరమైన కలదు భ్రదత దాని
వెంచుకొన్న
చెడుపు ముంచుకొనును.
|
0860
|
కలహ
వర్తనమున కలుగును కష్టాలు
నీతి
పథమునందు నిధులు దక్కు.
|
|
|
87. శత్రుశక్తి
|
|
0861
|
అధికులందు
కలహమాడుట దోషమ్ము
ఆడకున్న
దోష మల్పులందు
|
0862
|
సానుభూతి,
మైత్రి స్వబలమ్ము లేనట్టి
వాని
శత్రువెట్లు వదలిపెట్టు
|
0863
|
దానహీను,
బుద్ధిహీను నిర్ధాక్షిణ్య
గెలువ
సులభ మెట్టి బలములేక.
|
0864
|
విడువఁడాగ్రహమ్ము
విడచు నిదానమ్ము
నట్టినాఁడు
లోకు వందఱికిని.
|
0865
|
నీతియు
నియమమ్ము నిత్య కర్మములేని
నిందపరుని
గెల్వ వందమంది.
|
0866
|
కన్నుఁగాననట్టి
కామమ్ము కోపమ్ము
నున్నవాని
గెల్చు టుత్సవంబు.
|
0867
|
ఇచ్చియైన
కలహమేర్పడ జూడుము
దగ్గరుండి
గుంట ద్రవ్వువాని.
|
0868
|
దుర్గుణంబుతోడ
దుశ్చేష్ట లలవడ్డ
రోతురెల్ల
శత్రు ప్రీతినాఁడు.
|
0869
|
సమరమునకు
తృప్తి, సాధ్యత సబ్దుద్ధి
లేనివాడు
శత్రువైన యెడుల.
|
0870
|
శాస్త్ర
హీనుతోడ శతృత్వమందని
వాని
నెట్టి కీర్తివలచిరాదు.
|
88. విరోధనిరోధము
|
|
0871
|
వైరమనెడు
దుష్టవర్తన పరిహాస
మునకునైన
వెట్టుకొనఁగ రాదు.
|
0872
|
కలహ
మాడవచ్చు విలుకానితో నైన
వలుకులాడువాని
పగను వలదు.
|
0873
|
తనకు
బలము లేకఁ దనవారు లేకుండ
కలహమునకు
దిగినఁ గలదె బుద్ధి.
|
0874
|
పగతునైన
నెయ్యముగ జేసుకొనువాని
ముంచిలోనె
జగతి మహిమ వెలుగు.
|
0875
|
తోడులేదు
జూడఁ, జోడైన బలవాళ్ళు
వాళ్ళనొకని
స్నేహ వర్తికమ్ము.
|
0876
|
కలసి
ముందు వెనక కలహమాడుట కన్న
కలసి
కలియనట్లు మెలఁగుటొప్పు.
|
0877
|
అరయలేని
వాని కగచాట్లు జెప్పకు
బలముఁ
జెప్పబోకు బగతునెడను.
|
0878
|
తలచుకొన్న
పనికి వలసిన సామగ్రి
జేర్చుకొన్నవానిఁ
జెరుపతరమె.
|
0879
|
ముండ్లచెట్లు
నెల్ల మొలకలో గిల్లక
ముదిరినంత
గదప నొదవుబాధ.
|
0880
|
శత్రువులను
నణచ శక్తిజాలని వాఁడు
స్వేచ్ఛగాను
శ్వాస పీల్చలేడు.
|
89.
లోపగ
|
|
0881
|
నీడ,
నీళ్ళ గుణము వాడంగ దెలియును
ముందు
దెలియదట్లె బంధు పగయు.
|
0882
|
కత్తినెత్తు
పగకు నొత్తిలఁ బనిలేదు
భయపడంగ
వలయు బంధు పగకు
|
0883
|
ఐనవారి
వైరమగుపించకనె చంపు
కుమ్మరి
చెయినుండు కూసు విధము.
|
0884
|
అంతరంగ
కలహ మారంభమైనచో
చుట్టరికమె
నిన్నుఁ బట్టియిచ్చు.
|
0885
|
చూడ
చుట్టమయ్యు కీడెంచువాఁడున్న
వాని
వలన వచ్చు ప్రాణహాని.
|
0886
|
ఐక్యపడిన
వారికైనచో కలహమ్ము
తప్పుకొనఁగలేము
ముప్పురాక.
|
0887
|
కలిసినట్లె
యుండు కలశమ్మువైమూత
ఇంటి
పగయునట్లె యిమిడియుండు.
|
0888
|
ఆకురాయి
యినుము నరగదీనెడి మాడ్కి
పాడుబడును
గృహము బంధుపగళు.
|
0889
|
అంతరంగ
కలహ మణు మాత్రమున్నను
దాని
ముప్పు గొప్పగాను తోచు.
|
0890
|
సర్పమున్న
యింటఁ సంసారమున్నట్లు
సమరసమ్ము
లేక సాగు బ్రతుకు.
|
90. పెద్దల
నవమదించమి
|
|
0891
|
నిందఁ
జేయకున్న నియతాత్ములను జూచి
క్షేమ
మంతకన్నఁ జెప్పలేము.
|
0892
|
ఆర్యులైన
వారి కవమాన మొనరింప
వారి
వలన తగని బాధ్యలబ్బు.
|
0893
|
చెడగనున్న,
నేది నడుగకు పెద్దలఁ
జావుఁగోర
కీడు సలుపఁజాలు.
|
0894
|
ఆర్యులైన
వారి కవమాన మొనరింప
తట్టి
లేపినట్టు దండధరుని.
|
0895
|
తప్పి
బ్రతుకలేడు ధరణిలో నెచ్చోట
శిక్ష
జనుల మనసు కష్టపడిన.
|
0896
|
బ్రతుకవచ్చు
నగ్ని బడియైన, పెద్దల
నవమదించి
బ్రతుక నలవికాదు.
|
0897
|
ఇంద్ర
భోగమైన నేమౌను శిష్ఠుల
మనసు
కష్టపడిన మరుక్షణమ్ము.
|
0898
|
అచలులైన
వారి నవమదించిన వారి
యాస్తినాస్తి
వంశ మంతరించు.
|
0899
|
బ్రహ్మ
చింతనుండు ప్రాజ్ఞులు కోపింప
రాజు
జోగి యగును రాజ్యమెడలి.
|
0900
|
చివుకుమనినఁ
జాలు సిద్ధుల హృదయము
లంగరక్ష
లెవ్వి యాదుకొనవు.
|
No comments:
Post a Comment