Thursday, 3 September 2009

tel06


Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

51. విశ్వసించుట
0501
ధర్మ మర్థ కామ కర్మలతోబాటు
ప్రాణభయము నున్నవాని నమ్ము.
0502
మానదృష్టి, వంశమర్యాద నిని రెండు
గలిగియున్న వానిఁదెలిసి నమ్ము.
0503
విద్య లెఱిఁగి నట్టె విద్వాంసుఁడెనను
తప్పుఁజేయడంచు జెప్పలేము.
0504
గుణముఁ జూచి దోషగుణమును గుర్తించి
యెక్కువేదొ దాని లెక్క గొనుము.
0505
అధికు లల్పు లనెడి విధమున కొఱిసిడి
వారి వారి కర్మ కారణమ్ము.
0506
బంధు దూరుడైన వానిని నమ్మకు
 లోకనిందకేని లొంగ డతడు.
0507
మమతతోడ నమ్మి మంద బుద్ధులఁగూడ
మంచి బుద్ధి పోయి మందుడగును.
0508
ఇతరు లెట్టివారొ యెరుగక మమ్మిన
బాధ వచ్చు తనకు బంధుపులకు.
0509
నమ్మరాదు తెలియ కెమ్మెయి నమ్మిన
వినంగ వలయు నెట్టి విషయమైన.
0510
నమ్మదగిన నమ్ము నమ్మికతో వాని
వంశయంబు దుఃఖ సాగరమ్ము.


52. కార్యనిర్ణయము
0511    
మంచి చెడ్డ లఱసి మంచి జేసెడి వారె
వలయు కార్యమునకు బలముగాను.
0512
వృద్ధిపఱచి సొమ్ము విఘ్నంబులకు నోర్చు
స్థిమిత పరుఁడె కార్య సిద్ధిపరుఁడు.
0513
తెలినితేట లుండి తెగవుండి పేరాశ
లేని వాఁడె చేరనైన వాఁడు.
0514
తెలినితేట లెన్ని గలిగిన వాఁడైన
కార్యకర్త లనఁగ గాదు పలుర.
0515
పనితనమ్ము దెలిసి ప్రతిబంధముల కోర్చు
సాహసుండె కార్యసాధకుండు.
0516
ఎవ్వరెవరు దేని నే విధి సాధింత్రు
దాని జేయ నిమ్ము వాని బిలచి.
0517
చేయువారి తరము చేష్టల తరమును
కాల తరము దెలియ కార్యమగును.
0518
దాని దాని పనికి దాని వానిని జూచి
యప్పగింప కార్య మగును సూవె.
0519
కార్య సూరు జెలిమి గౌరవింపని యట్టి
సంశయాత్మ విడచిఁ జనును లక్ష్మి.
0520
ప్రతిదినమ్ము రాజు పనివారి క్షేమమ్ము
నడిగి తేలుసుకొన్న జెడదు వసుధ.
 
53. చుట్టరికము
0521
లేమి నున్న ప్రేమను పాటించు
వారివలన బంధువర్గ ముండు.
0522
చుట్టరికము ప్రేమ చుట్టుకొన్నదియైన
బహువిధాల లాభప్రాప్తి నిచ్చు
0523
బంధువీతి లేని బ్రతుకెంతగా నున్న
కట్ట తెగిన చెరువు పట్టు విధము.
0524
బంధు వర్గమునకు పొందికగా నున్న
కలిమి మిగిలి నంత ఫలము గలదు.
0525
ఇచ్చి ప్రియము తోడి నింపుగా మాట్లాడు
నట్టెవాని చుట్టు చుట్టరికము
0526
దాతయయ్య కోపతాపమ్ము లేకున్నఁ
జుట్టరికము లేనిచోటు లేదు.
0527
కాకి ముట్టదేది కలియక దనవారి
నట్టి వారికుండు నదియె కలిమి.
0528
ఎల్లర నొకరీతి యేలిక చూడడు
చూపు ననుసరించి చుట్టముండు.
0529
బంధు వైరమున్న, పొందిక నద్దాని
కారణమ్ము దెలియ దీరిపోవు.
0530
కారణమ్ముఁ దెలిసి చేరదీయవలయు
వదలుకొన్న వాఁడు వచ్చి చేర.
 
54. మఱపు
0531
ఆగ్రహంబు కన్న నధికమౌ నేరమ్ము
సంతనమున మఱపు సంభవింప
0532
మందగించు బుద్ధి మనుజండు వేదైన
మఱపు జేత కీర్తి మందగించు.
0533
మాసిపోవు కీర్తి మఱపున్న వారికి
శాస్త్ర ధనులకైన సత్యమిద్ది.
0534
భద్రమగునె కోట భయమున్న వానికి
మఱచు వాని కెట్లు మంచి గలుగు.
0535
ఎచ్చు వెతల దెలసి వారింప మఱచిన
చిక్కులందు జిక్కి చింతఁ జెందు.
0536
ఎంత కార్యమున్న నేకొలమునగాని
మఱపులేని వాని మహిమె మహిమ.
0537
జ్ఞాపకమను గొప్ప సాధన సంపత్తి
కలుగువాని కేది కాదు జగతి.
0538
మెప్పు నిచ్చు పనుల నుప్పొంగి జేయక
మఱచువాని కెపుడు మంచి రాదు.
0539
సాగుచున్న నాఁడు జదువుము, మఱపుచే
కష్ట పడిన వారి గాథ లెల్ల.
0540
వలసి నట్టిదాని వదలక జింతింప
వలసినట్టు లదియె వచ్చి చేరు.


55. దండనీతి
0541
బంధుమిత్రు లనెడు పక్షపాతము లేక
నుండదగిన దగును దండనీతి.
0542
మబ్బు జూచు బ్రతుకు మహిజీవరాసులు
ప్రజలు నృపుని జూచి బ్రతుకు చుంద్రు.
0543
వేదశాస్త్రములకు విప్రాళికెల్లను
దండనీతి యందె యుండు రక్ష.
0544
భుజము దట్టి ప్రజల బుజ్జగించెడు రాజు
పదములందె భక్తి ప్రజల కుండు.
0545
నీతి దప్పనట్టి నృపుండున్న రాజ్యన
కాలవర్షముండు కరువు దీరు.
0546
ఖడ్గబలము కన్నఁగ్రమము కనికరమ్మె
భువన విజయమిచ్చు నవని పతికి.
0547
ప్రజలకెల్ల రాజు భద్రమైనట్లుగా
దండనీతిగాపు ధరణి పతికి.
0548
సకల మాలకించు సరళత లేకున్న
నీతి దొరగి రాజు గోతిఁబడును.
0549
బాధ దీర్చుటకయి బాధించునది గాన
రాచకర్మ దుష్ట రక్షణమ్ము.
0550
మానవేంద్రుఁడిచ్చు మరణశిక్ష ఫలము
వైరున కలువెత్తు వంటిదగును.


56. దుష్పాలన
0551
కష్టవెట్టునట్టి దుష్టరాజున కన్న
హంతకుండె మెచ్చనైన వాఁడు.
0552
దోచుకొన్న విధము దొంగలు కత్తెత్తి
యప్పుడవుడు పన్నులడుగు రాజు.
0553
అనుదినమ్ముఁదప్పు లరయనిచోఁరాజు
చెడును రాజ్యలక్ష్మి ఘడియ ఘడియ.
0554
సంపదలను ప్రజల సర్వమ్ము గోల్పోవు
ధరణి విభుడు దప్పఁదండనీతి.
0555
కష్టపడుచు ప్రజలు కార్చిడి కన్నీరె
కరగదీయు నృపుని కలిమి జలిమి.
0556
నీతియె క్షీతిపతి నెలకొను మార్గమౌ
నది దొఱంగ సర్వ మంతరించు.
0557
వానలేని యట్టి వనుమతి విధమౌను
పాలకుండు దయకు బాహ్యుడైన.
0558
వేదకన్న బాధ వెన్నిధిగా నున్న
రాజు నీతి దప్పి రాజ్యమేల.
0559
నీతి దప్పినట్టి నృపుడున్న రాజ్యన
చెదిరిపోవు మబ్బు చినుక బడక.
0560
పాడి తరిగిపోవు పఠియింప రార్యులు
ధర్మ దూరుడైన ధరణి విభుండు.


57. భయోత్పన్నత
0561
తప్పు నరసి మరల దప్పుజేయని రీతి
శిక్షనిచ్చు రాజశేఖరుండు.
0562
బలముగాను పూని సులువుగా శిక్షింత్రు
నీతిమార్గ మెరుగు నృపకులమ్ము.
0563
దిన దినమ్ము ప్రజలు దిగులొంద బాలించు
ప్రభువు చెడగ జూడవలదు దినము.
0564
దుష్టడంచు ప్రజలు దూరంగ నారాజు
వెక్కుదినము లుండి వెరగలేడు.
0565
చూడ నలవిగాక చూచిన చిట్లుంచు
ధరణి విభుని సిరికి దయ్యమండ్రు.
0566
దబ్బరమ్ములాడు దాక్షిణ్యరహితుని
వద్ద నున్న కలిమి వృద్ధికాదు.
0567
క్రమముగాని శిక్ష కఠువైన మాటలు
ఱంపమగును గోయ రాజు బలము.
0568
ఆదుకొనగ నుండు నాత్మియులను రాజు
కోప పడినఁగలిమి రూపు మాయు.
0569
కుదుటబరచుకున్న మొదటనే సైన్యమ్ము
నెదిరి రాక నెఱిగి యదిరి చచ్చు.
0570
దుష్టజనుల గూడి దుర్నీతిపరుడైన
ప్రభువె చాలు భూమి భారమునకు.

58. దయ
0571
కరుణ యనెడి దేవకన్యక, కనులలో
మెలుగుచుండ జగతి వెలుగుచుండు.
0572
లోకమెల్లఁ దయకు లోనయి వర్తిల్లు
భారమవని దయకు దూరమైన.
0573
రక్తిలేదుపాట రాగమ్ము లేకున్న
చూపులేదు దయను జూడకున్న.
0574
ఎందుకున్న వేమొ యెరుగము ముఖమున
కరుణలేని వారి కుండ్లు రెండు.
0575
కనికరమ్మె యగును కనులకు రమ్యత
యది దొఱంగ పుండ్లె యగును కండ్లు.
0576
మట్టిలోన బుట్టు చెట్టుచేమ సములు
కన్నులుండి చూడకున్న కరుణ.
0577
కరుణ గల్గినట్టి కన్నులే కన్నులు
కండ్లు గావు మిగత కన్నులన్ని.
0578
కరుణతోడ నిత్యకర్మల పాటించు
వారి హక్కె యాప్రపంచమెల్ల.
0579
కష్టవెట్టునట్టి కఠినాత్మలందును
దయను జూవుఆటగును ధర్మగుణము.
0580
వేడుకొన్నఁజాలు విషమైన భక్షింత్రు
దయను లక్ష్యముగను దలచువారు.

59.  గూఢచారి
0581
విషయ మెరుగ మేగు విఖ్యాత గ్రంథము
ధరణిపతికి నేత్రద్వయ మటండ్రు
0582
ఎచ్చటెఛట నెవ్వరేమేమి జేతురో
వేగుదెలియు టగును విభుని గలిసి.
0583
గూఢ మెరుగకున్న గూఢచారిని గూడి
నిజముఁ గనడు రాజు విజయమునకు.
0584
శత్రు మిత్రు బంధు సర్వ సేవకులందు
గుట్టు గనుట నృపుని గుణమటండ్రు.
0585
కనిన జంకకుండ ననుమాన మీయక
తేలియవలయు వేగు తెలుప కేది.
0586
సన్యసించినట్లు సకలమ్ము కనుగొంచు
చిక్కుకొన్న గుట్టు జెప్పరాదు.
0587
విన్న మర్మమడిగి వివరమ్ముగా వేగు
చెప్పవలయు దాని స్థిరముగాను.
0588
తెలిసినట్టి దానిఁదెలియని విధముగా
మారు వాని నడుగ మర్మమగును.
0589
వేగు వేగు గనని విధముగా ముప్వుర
మాటఁదెలియుటగును మర్మమనిన.
0590
సత్కరింపరాదు సభయందు చారుని
మర్మమెల్ల దాన మరుగుఁబడును.

60. పట్టుదల
0591
ఉండుటనిన నాకని కుత్సాహ ముండుటే
వేరు దానికెట్టి వేరులేదు.
0592
పట్టుదలకు మించి పరమార్థమె గాన
నర్థ మెంత యున్న వ్యర్థమగును.
0593
పోయెనంచు దిగులు బొందరు గట్టిగా
పట్టుదలను చేత బట్టువారు.
0594
పట్టుదలను విడువనట్టివా రున్నట్టి
చోటు దెలిసి లక్ష్మి చొచ్చుకొనును.
0595
నీరు నిండినంత నిడువెక్కు దామర
యెంతకంత శ్రద్ధ యంత వృద్ధి.
0596
ఆశయంబు గొప్పదై యుండవలయును
కాని కాకపోని కష్టపడకు.
0597
ఎదురులేదు పట్టు వదలక ఢీకొన్న
వెనుక దిరుగ దేన్గు విషిఖములకు.
0598
మంచి స్థితినిబొంది మహిమీద నున్నట్లు
పట్టులేనివారు బలుకలేరు.
0599
గజము వెద్దదయ్యు గర్జించి వైఁబడు
పులిక వెఱచు దంత బలిమియున్న.
0600
వారి వారి బలము వారికుండెడి పట్టె
పట్టులేనివారు చెట్టు సములు.


No comments:

Post a Comment