Thursday 3 September 2009

tel10



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

91. స్త్రీలోలుఁడు
0901
స్త్రీల ననుసరింపఁ జెడుపోను, కార్యజ్ఞు
లిష్టపడని కార్యమిది యటండ్రు.
0902
మగువలందు దగిలి మఱచిన సర్వమ్ము
వచ్చుదాని కన్నఁ వగపు హెచ్చు
0903
మగువ కణఁగి యుండు మగవానికే ప్రొద్దు
సుజనులుండు చోట శోభరాదు.
0904
మగువ కణఁగ మోక్ష మార్గమ్ము శూన్యమ్ము
పూనుకొన్న పనులు పూర్తిగావు
0905
సతికి వెఱచు నతఁడు సతతమ్ము వెరచును
సాయపడుటకైన సజ్జనులకు.
0906
అమర పదవులందు నమరినవాడైన
నాతిఉ కణఁగి యున్నఁ ఖ్యాతిరాదు.
0907
పొలతి మాటఁ వినెడి పురుషన కన్నను
మానదృష్టి నున్న మగువ మేలు.
0908
మిత్రహితము లేదు మిగలదు ధర్మము
లతివ మాట దాట నతని కెందు.
0909
పొలతి కణగుఁ నతండు పురుషార్థముల మాని
పుణ్యలార్యములను బోనడంచు.
0910
దీర్ఘదృష్టియందు స్థిరపడ్డ వారలు
స్త్రీల మోహమందు జిక్కుకొనరు.


92. వెలయాలు
0911    
వేశ్య వినయమెల్ల వెలకోసమేగాన
ముచ్చటింపులెల్లఁ ముప్పుఁదెచ్చు.
0912
వెలకు దగ్గప్రేమ వెలయాలు చూసించు
మోసపోకు దాని మోహమునకు.
0913
పడుపుకాంత సుఖము, నడిరెయి దెలియక
శవముతోడ గలియు చందమగును.
0914
సానిదాని పొందు సత్యర్థ మెఱిగిన
వారు గోరుకొనరు వాస్థవముగ.
0915
గౌరవమ్ము గోరువారలు వెలయాలి
యందచందములకుఁ జిందిపోరు.
0916
సొంత తెలివితేట లెంతేని గలవారు
వారవనిత సుఖముఁ గోరుకొనరు.
0917
తలపునందులేక వలపించు వగలాడి
గూడువారు లేత గుండెవారు.
0918
మూర్ఖుడైన వాని మోహని దయ్యమ్ము
వంచగించునట్టి వారవనిత.
0919
సిగ్గు లేనిదాని నిగ్గైన కౌగిలి
పాప మంటగట్టు పాశమగును.
0920
జూదము, వెలయాలు, బోరత్వ మిమ్మూడు
సిరి దొఱంగు వాని స్నేహమగును.
 
93. త్రాగుబోతు
0921
కీర్తి మాయమగును, కేవల పడనగును
కల్లు ద్రాగు గుణముఁ గలిగెనేని.
0922
పెద్దవారి మంచి వద్దనుకొన్నచో
త్రాగి తందనాల నూఁగవచ్చు.
0923
త్రాగువాని, కన్నతల్లియే రోసిన
నార్యులైన వారి నడుగనేల?
0924
మానహానుడైన మదుపానరక్తుని
చేష్టఁజూడఁ సిగ్గె సిగ్గుపడును.
0925
వైక మొసగి బదులు మైకమ్ము గొనునట్టి
మందబుద్ధికేమి మంచి గలుగు.
0926
నిద్ర, చావువాని నియమమ్ము సమమౌను
విషము మదువు రెంటి విధము నట్లె.
0927
ఎఱుగనట్లు మరుగు మరుగున త్రాకిన
ఉమ్మి వేతురతని నూరివారు.
0928
త్రాగుబోతువాఁడు త్రాగలే డనలేడు
తప్పు దాచ వాని తరముగాదు.
0929
దీపమెత్తి నీళ్ళ దేవిన చందమ్ము
త్రాగువాని మాన్పఁ దరముగాదు.
0930
బోదలేనివేళ బోదలో బడియున్న
వానిఁజూడ బుద్ధి వచ్చునేమొ.
 
94. జూదరి
0931
చేప గాలమందు జీక్కెడు విధమౌను
గెలుపు సిద్ధమైన వలదు జూదు.
0932
ఒకటి వచ్చినట్టి యుత్సాహమున నూరు
వదలు వాని బ్రతుకు బదిలమగునె?
0933
దొల్లి పోవువాని దొడ్డగా నమ్మన
ద్రవ్యమెల్ల నెదిరి దారిబట్టు.
0934
కీడుఁ మూడఁజేసి కీర్తిని పోగొట్టి
పేదవడఁగ జేయుఁ జూదమొండె.
0935
హస్తకౌశలమ్ము నక్షపాటమున్న
పేదరికమె వచ్చుఁ జూదమాడ.
0936
తనిక బెక్కు బాధ లనుభవింప దగెను
జూదమందు జిక్కి చొక్కు నతడు.
0937
తరతరాల నుండి తనదాక వచ్చిన
యాస్తి జూదమాడ నంతరించు.
0938
కల్ల లాడజేసి కనికరమ్ము బాపు
నాంది జూదమగును నరకమునకు.
0939
కూడు గుడ్డ సొత్తు కోవిదత్వము కీర్తి
మంట గలియు జూద మంటుకొనిన.
0940
ఆడుచుండు జూద మోడంగ నోడంగ
బాధలన్ను నాశ బ్రతుకునందు.


95. మందు
0941
హెచ్చుతగ్గులందు వచ్చు నస్వస్థత
వాత పిత్తశ్లేష్మ రీతిగాను.
0942
తిన్న దరిగెనంచు దెలిసి భోంచేసిన
మానవునకు వేరె మందు వలదు.
0943
జీర్ణమైన వెనుక జేసిన భోజన
మల్పమైన వృద్ధి యాయువునకు.
0944
ఆకలి యగునప్పు డనువైన యాహార
మెఱిఁగి సరిగ దిన్న మరుగు బబ్బు.
0945
కానిదాని దినక నైనది మితముగా
నారగింప వ్యాధు లంటవండ్రు.
0946
అతిగ దినని వాని కారోగ్యమున్నట్లు
అతిగ దినెడువాని కబ్బు జబ్బు.
0947
రుచికి దిన్నయెడల రోగంబు లెక్కువై
పెక్కు బాధలతని లెక్కబెట్టు.
0948
జబ్బు, కారణమ్ము, శమనమ్ము గుర్తించి
మందు నొసంగ వైద్య మార్గమగును.
0949
వైద్యఁడైనవాడు వ్యాధిని గుర్తించి
వయసు కాల మెఱిగి వ్యాధి దీర్చు.
0950
వ్యాధియు, పరిచర్య, వైద్యఁడు, రోగియు
వైద్యశాస్త్ర పాటవంబు నాల్గు.


96. వంశము
0951
మంచి యింటఁ గాక మానమ్ము సమదృష్టి
నితర గృహములందు వెదక గాదు.
0952
సత్యనిష్ట, లజ్జ, సత్వర్తనంబును
సంప్రదాయమునకు సహజ గుణము.
0953
మాట సొగసు, నీవి, మందహాసము మూడు
గుణములుండు గొప్పకులమునందు.
0954
గొప్ప యింటివారు తప్పు దారికి బోరు
కోట్లకొలది ధనము కూడుటైన.
0955
ఇచ్చునట్టి గృహము నొచ్చిపోయినగాని
ప్రాత గుణము మిగిలి పరిమళించు.
0956
మచ్చరాక బ్రతుక నిచ్చగించినవారు
ప్రతినకైనఁ బాడుపనులఁ దిగరు.
0957
పెద్దయింటి తప్పు పెద్దగాఁ దెలియును
చంద్రబింబమందు చాయ విధము.
0958
గుణము విడచి దోషగుణములఁ బాల్పడ్డ
వంశమందు బుట్టు సంశయమ్ము.
0959
పుట్టునపుడె మొలక మట్టిసారము దెల్పు వ్
వంశ మెట్టి దగునొ వాక్కు దెల్పు.
0960
మంచి వలయునన్న మర్యాదవలయును
వినయ మవసరమ్ము వెలయఁ గులము.


97. మానము
0961
ఎంత గొప్పదైన నింటికిఁ దగకున్న
దానిఁ మానుకొనుటె మానమగును.
0962
గౌరవమ్ము కీర్తి గావలె ననువారు
మరువరాదు యింతె పరువు నెరిగి.
0963
పెరుగునప్పు డహము తరుగంగ వలయును
తరుగునప్పు డహము పెరుగవలయు
0964
పదని భ్రష్ఠులైన పతితకేశములట్లు
విలువ చెడుట లోక విదితమగును.
0965
ఏనుగంటివాడు యెలుకయైపోవును
చెయరాని పనులఁ జేపెనేని.
0966
పూజ్యతయునురాదు పుణ్యంబు దక్కదు
తుంటరులగువారి వెంటఁదిరుగ.
0967
అడిగి బ్రతుకనేల నవమదించెడివారి
చెడినమేలె వారి నడుగకుండ.
0968
చెడియు గౌరవమ్ము జీవించుటన్నది
మందు దినుచు బ్రతుకు చందమగును.
0969
ఉసురు విడచు చెమరి యొక్కరోమముబాయ
ప్రాణమిడుదు రట్లె మానధనులు.
0970
మానరక్ష కొఱకు ప్రాణమ్ము బలిజేయు
వారి నెఱిఁగి జగతి ప్రస్తుతించు.

98. పెద్దరికము
0971
ఖ్యాతి వారివారి కార్యమందానక్తి
వెలితి దానితందు విముఖడైన.
0972
జన్మ మందఱికిని సమమౌను కర్మలే
వారి వారి గౌరవమ్ము నిచ్చు.
0973
పీఠమెక్కినంత వెద్దగా డల్పుండు
వెద్ద చిన్నగాడు గద్ద దిగిన.
0974
ఖ్యాతి తన్నుతాను కాపాడుకొనుటండె
ధర్మపత్ని విధము నిర్మలముగ.
0975
శ్రేష్ఠలైనవారె జేతురు చేసిన
చేతదగిన పనులు శ్రేష్ఠముగను.
0976
అల్పుల మదికంద దార్యుల శక్యమ్ము
పోదవలయు ననెడి బుద్ధులెల్ల.
0977
అల్పులైనవారి కధకారమిచ్చిన
స్వల్ప పనులజేయ సాహసింత్రు.
0978
అణిగియుండు గొప్పతనమెల్లరందును
చిన్నతనము గర్వ శిఖరమెక్కు.
0979     
పెద్దతనము గర్వ పద్ధితి నెఱుగఁబో
డల్పు డెవుడు దాని దెల్పుచుండు.
0980
తప్పు మఱచు పెద్దతన మెప్పుడైనను
చిన్నతనము దాని జెప్పి దిరుగు.

99.  ఆదర్శము
0981
మార్గదర్శకులగు మహనీయలెల్లరు
నీతిఁ దప్పనట్టి నిష్ఠపరులు.
0982
గుణమె గొప్పవారి ధనమగు మిగిలిన
ధనము లన్ని ధనము లనరు వారు.
0983
ప్రియము నయము భయము దయయు సత్యమ్ము
గొప్పదనము నైదు గుంజలగును.
0984
తాపసాంశమనఁగఁదగు నహింసావృత్తి
నేరమెన్నహున్న నీతివృత్తి
0985
వినయవంతుడైన విక్రమవంతుడు
శత్రువులనుజేయు మిత్రువులగ.
0986
శీలమునకు గుర్తు చిన్నలనెడనైన
తప్పు నెఱిగి దాని నొప్పుకొనుటె.
0987
ఉపకరింపకున్న నపకారమెంచుచో
శీలమున్నదనుచు జెప్పలేము.
0988
లేమి కాదు ధనము లేనంతమాత్రాన
గుణముఁ గల్లియుంటె గొప్పదనము.
0989
గుణసముద్రు లుర్వి మునిఁగిపోవగ నున్న
నాశయంబు దొలఁగ రడుగుగూడ.
0990
ఆర్యులందు నున్న నాదర్శ మెఱిగిన
ధరణి మునిఁగి పోకఁ దప్పుకొనునె.

100. శీలము
0991
అందఱియెడఁ గలసి యన్యోన్యముగ నుంట
సుగుణమునకు నుండు సులభ గుణము.
0992
కనికరమ్ము వంశ గౌరవ మీరెండు
చాటి చెప్పు నొకని సద్గుణంబు.
0993
కాదు దేహభావ మెదియు సమమన
సద్గుణాళి సమమె సమమనంగ.
0994
నీతి నియమములను ప్రీతితో పాటించి
మెలఁగువారి నెందు మెచ్చు జగము.
0995
సరసమైన కీడె స్తబ్ధులతోనాడ
విరసమైనమేలు విజ్ఞులందు.
0996
ఉత్తములగువార లుండుటచేతనే
మహిని మహియటండ్రు మట్టియనక
0997
సూదివంటి బుద్ధి సూక్ష్మతయున్నను
గుణములేమి వృక్ష గణసమమ్ము.
0998
స్నేహముడిగి చెడువుఁ జేపెడి ప్రబలందు
ప్రీతి జూపుచుండు నీతిపరుఁడు.
0999
కలుపుగోలుతనము గఱవైన వానికి
చిట్టుచీకటగును పట్టపగలే.
1000
బుద్ధిహీను నొద్దఁ దద్దయు ధనముంత
మురికి పాత్ర పాలుఁ బోసినట్లు.

No comments:

Post a Comment