Thursday, 3 September 2009

Tel05


Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

39. రాజు
0381
కలిమి, బలిమి, చెలిమి, కాపు, దుర్గము, మంత్రి
చక్రవర్తి కంగషట్క మగును.
0382
నిర్బయమ్ము, నీని, నిర్మలజ్ఞానమ్ము,
పట్టుదలయు నాల్గు ప్రభున కుండు.
0383
అప్రమత్త లేఱ్య్క నార్జవ మిమ్మూడు
మనుజ పతికి వలయు గుణము లండ్రు.
0384
ధర్మయుక్తమైన దండన, శౌర్యమ్ము
మాన ముణ్చు నెంచు మహిత విభుండు.
0385
దాడిసలిసి వలయు ధనము సంపాదించి
దాచి, కాచు నృపుని దక్షుడండ్రు
0386
చూడ నులభుఁ డగుచు సున్నితముగ బల్కు
భూపశ్రేష్టు నెందు బౌగడు జగతి.
0387
రోజు తప్పకుండ పూజింత్రు ప్రజలెల్ల
మృదుల ఫణితి నొదవు మేదినీశు.
0388
క్రమముకోడఁ బ్రజలఁ గాపాడు నృపవర్యు
దైవము గనె ప్రజలు దలఁతు రెల్ల
0389
తన్ను దప్పు జెప్పుచున్నను జెవిమూయు
మానవేంద్రు నీడ మహి వెలుంగు.
0390
దక్షతయును, దాన, ధర్మంబు, దయ నీల్గు
గలిగి యున్న నృపుల వెలుగతండు.


40. విద్య
0391    
అభ్యసింప పలయు నవివేకమును బాయు
నాచరింపవలయు నవ్విధంబె.
0392
అంకె యక్షరంబు లగు రెండు కన్నులు
వలయునండ్రు బ్రతుక వలయు నన్న.
0393
కన్ను లున్నవన్ను గరచిననే విద్య
కండ్లు పుండ్లె విద్య గఱువకున్న.
0394
మోద మొదవ గూడి ఖేదమ్ముతో బాయు
ప్రతిభ గల్గు వృత్తి పండితునకె.
0395
అణీఁగి మణిఁగి విద్య నార్జింపవలె నెల్ల
నున్నవారి చెంత నొదిగి నట్లు.
0396
చల్లినంత చెలమ జలమూరునట్లుగా
చదివినంతఁ దెలివి జనులకుండు.
0397
చదివినట్టివారు సర్వత్ర పొగడొంద
చావు మూడుదాక జదువరేల?
0398
ఒక్క జన్మయందు నొదిగి నేర్చిన విద్య
యేడు జన్మములకు నిచ్చు సుఖము.
0399
తనవలె వినువారు తనియంగ గని విద్య
వదలలేక బుధుడు వలవు గొనును.
0400
విద్య తరుగనట్టి విశ్రుత ధనమౌను
దారవోవు మిగత ధనము లన్ని.
 
41. అవిద్య
0401
జూదమాడినట్లు చదరంగ మదిలేక
చదువు కొనక వాదు సలువు టెల్ల.
0402
విద్య లేనివాఁడు వినిదింప గోరుట
సౌఖ్య మిచ్చినట్లు స్థన విహీన.
0403
చదువురాక యున్న చడివినట్లే యగు
పండితాళి ముందు బలుకడేని.
0404
చదువు లేని వాని శాస్త్రజ్ఞు లొప్పరు
తేలివితేట లెన్ని గలిగియున్న.
0405
చదువురాని వాని సామర్థ్య ముంతయు
రంగ మెక్కి నంత భంగపాటె.
0406
చవటినేల విధము చదువని వారుంట
నుదర పోషణార్థ ముర్విమీద.
0407
విద్య లేని వాని వింతసొగను జూడ
మట్టిబొమ్మ కొలువు బెట్టినట్లు.
0408
జ్ఞానపరును లేమి పూనుట కన్నను
మూర్ఖు వద్ద కలిమి ముప్పు దెచ్చు.
0409
అగ్రజన్ముడైన నభ్యసింపని నాఁడు
నిమ్మజండె యెన్ని నేర్వు లున్న.
0410
ప్రజల పంచలందు పశువులుండెడు మాడ్కి
చదువు రానివాడు జగతి నుంట.
 
42. వినుట
0411
సంపదలను భూరి సంపద శ్రవణమ్మె
యన్ని సంపదలకు నధిక మదియె.
0412
కర్ణములకు విందు కలుగ నప్పుడు జూచి
కడుపున కిడవలయు కవణ మింత.
0413
వినెడువారు భునిని వీనుల విందుగా
వేల్పు సములు గాగఁ వేలయు చుంద్రు.
0414
చదువకున్న నైన చదువంగ వినవలె
నొరుగు నప్పు డద్ది యూతయగును.
0415
ఊతకఱ్ఱ విధము నొరగనీయని రక్ష
పెద్దలైన వారి బుధ్ధి వినిన.
0416
చిన్న విషయమైనఁ జెవియొగ్గి విన్నచోఁ
విన్నవఱకు మంచి వేలయుచుండు.
0417
విన్న దానియందు విషయమ్ము లేకున్న
గొప్పవారు దాని జెప్పరెత్తి.
0418
వీనులనఁగఁ జెల్లు వినదగ్గవే విన్న
చెడుగు విన్నఁ జెవులు చిల్లులగును.
0419
శ్రద్ధగాను వినని దధ్ధమ్ము లేవ్వరు
వినగఁ జెప్పలేరు వినయ మొప్ప.
0420
వినగ నేర్వ కొకఁడు తిన నేర్చుకొన్నచో
పుట్టనేమి వాఁడు గిట్టనేమి.


43. జ్ఞానము
0421
నాశనమ్ము రాకఁ బోషించు జ్ఞానమ్ము
సాధ్యపడని కోట శత్రువులకు.
0422
పోవునట్టి వ్యర్ధ పోకడఁ బోనీక
చక్కదిద్దు నదియె జ్ఞాన మనిన.
0423
అవ్వరెవరి నోట నేమాట విన్నను
దాని మర్మమెఱుగ జ్ఞానమగును.
0424
చెప్ప నేర్చి, యెదిరి చెప్పిన దానిలో
సత్య మెఱుగు టగును జ్ఞాన మనిన.
0425
పొంగిపోక వ్యధల కుంగక లోకంబు
ననుసరింప జ్ఞాన మగున టండ్రు.
0426
పలువు రెట్లు జగతి వర్తింత్రు తానట్లు
తెలిసి బ్రతుకు టగును తెలివి యన్న.
0427
జ్ఞాను లెఱుగ గలరు దేనినైనను ముందె
సర్వ జనుల కద్ది సాధ్య పడదు.
0428
లొంగ దగిన చోట లొంగుటే జ్ఞానమ్ము
మూర్ఖుఁ డెదురు దిరుగు ముప్పుఁగనక.
0429
ముప్పుఁ దెలుసుకొంద్రు ముందుగా జ్ఞానులు
వారి నెదుర నెవరి వశము గాదు.
0430
జ్ఞానమొక్కటున్న సర్వస్వ మున్నట్లె
యద్ది శూన్యమైన యెద్ది మిగులు.


44. దోష నిరోధము
0431
గర్వ మాగ్రహమ్ము కలుషమ్ము విమ్మూడు
మృగ్యమైన వృద్ధి పొందు నతుఁడు.
0432
స్వాతి శయము నల్పసంతోషము నపాత్ర
దానము నివి తగవు ధరణి పతికి.
0433
కొంచమైన నేపము కొండగా భావింత్రు
నింద కోర్వనట్టి నీతిపరులు
0434
దోషక్యత్యములకు దూరమ్ము గాకున్న
నంతరంగ శత్రువదియె మనకు.
0435
రాక ముందె జాగరూకత లేకున్న
బ్రతుకు నిప్పుబడ్డ వామి నొప్పు.
0436
దోష రహితుఁ డగుచు దుష్టుల దండింప
తప్పుగాదు చూడ ధరణి పతకి.
0437
లోభి గుణమె జాలు లోకమం దున్నట్టి
మూంచితనము నెల్ల మంటగలువ.
0438
దోషమందు గొప్ప దోషమ్ము లోభత్య
మీడు జేయ దానికెది లేదు.
0439
హీన మెట్టి వారి కైనను స్వోత్కర్ష
మానుమట్లె మేలుగాని పనులు.
0440
ఇతరు లెఱుగ నటుల నీప్సితార్థములందు
సిద్ధహస్తు నెదిరి జెడువ గాదు.


45. సాధు సాంగత్యము
0441
ధర్మ వర్తనమున తనకన్న పెద్దల
గుర్తుబట్టి స్నేహ వర్తిగమ్ము.
0442
పడెడి బాధ బాపి పడనుండు బాధను
బాపువారి చెలిమి బడయ వలయు.
0443
అధిక లాభమెంచి అసలును పోగొట్టు
లోభిబుద్ధి బుధులలోన లేదు.
0444
ఘనుఁడటన్న దగును దనకన్న పెద్దల
బాంధవమ్ము బడయు బల్మియున్న.
0445
దీర్ఘ దర్శు లెఱుగు మార్గంబె లోకమ్ము
వారి పొందు వలయు వసుధ పతికి.
0446
క్ష్మాతలేంద్రు సభను సమయజ్ఞు లున్నచో
శత్రు బలము లెవ్వి సాగ కుండు.
0447
కొట్టి తిట్టి చెప్పు గుణవంతులను గూడు
వారి జెరుప నెవరి వశము గాదు.
0448
చొరపుజేసి చెప్పు గురువులు లేకున్న
తనకుఁ దానె చెడును ధరణి విభుఁడు.
0449
మొదలు లేక లాభ మొదవదు బేరమ్ము
చెప్పువారు లేక స్థిరత రాదు.
0450
వెదకి దెచ్చుకొన్న విధమౌను బగతుర
బుద్ధి జెప్పు నొకని వద్దటన్న.

46. దుర్జన సాంగత్యము
0451
వెద్దటికము వెఱచు బుద్ధిహీనుల గూడ
చిన్నరికము వారి జేయిఁ గలువు
0452
నేల నంటి యుండు నీటిరంగును బోలు
కూడు వారినంటి గుణములుండు.
0453
చిత్తమందె దోచు నుత్తమ గుణరాశి
స్నేహమందు వెఱిగి చిగురువేయు.
0454
మంచికెల్ల జూడఁ మనసె కారణమైన
చెలిమిలోనె దాని జెప్ప వలయు.
0455
చేరిక యెటులుండు చిత్తమట్లుండును
చిత్త మెట్లొ యట్లు చేష్టలుండు.
0456
సజ్జన సహవాస సంపర్కముల వల్ల
మనసు మంచి మార్గ మనుసరించు.
0457
చిత్తశుద్ధి మోక్షసిద్ధికి మూలమ్ము
స్నేహశుద్ధి సకల శ్రీలనిచ్చు.
0458
ఆత్మశుద్ధి నున్న నాచార్యులకునైన
సంఘ శుద్ధి వలన సర్వసిద్ధి.
0459
మనసు మంచిదైన మరుజన్మకును మంచి
మించు నింక చెలిమి మంచిదైన
0460
మంచివారి గూడ మంచి మంచమునెక్కు
చెడ్డవారి గూడఁ జెడుపె మిగులు.

47. కర్మకౌశలము
0461
చెడుటఁ బాగుపడుట చింతించి మొదలంట
జేయ వలయు వెనక చింతవలదు.
0462
తేలిసి నట్టివాని కలసి లెక్కించి తాఁ
బూనునేని కలసి రాని దేది.
0463
వెనుకనేదొ వచ్చు ననుకొని యున్నది
జారఁ విడచు కొనరు జ్ఞానులెల్ల.
0464
మానమునకు జంకు మహనీయు లెల్లరు
దప్పిదములు జేయ నొప్పు కొనరు.
0465
పట్టుగానకుండ పనిజేయఁ బగతుర
నారుపోసి పెంచు తిరునుండు.
0466
కాని దానిజేసి కాడుండఁ జెడిపోవు
నైనదాని జేయఁ మాని చెడును.
0467
దేనినైన దీర దెలిసియే జేయుము
పిదప జూతుమనుట వెఱ్ఱితనము.
0468
చేతఁగాకఁ జేయు చేతల కెందఱు
పూని సాయపడిన పూర్తిగాదు.
0469
మంచి జేయఁ జెడుపు పొంచి ముంచుడ వచ్చు
నెవరికేది చేయ నెఱుఁగకున్న.
0470
సంప్రదాయమునకు సరిపడు పనులనే
నిర్వహింపవలయు నిందలేక.

48. బలాబలిమి
0471
పని దొడంగ దాని పాటెమెంతొ
పగయు చెలిమి జూడఁ ఫలితమబ్బు.
0472
తనకు తగిన దానిఁ దగవెంచి చేసిన
చెల్లుచుండు తాను జేయు పనులు.
0473
ఉన్న శక్తి దెలియ కుత్సాహులై జేయ
భంగపడినవారు పలురు గలరు.
0474
తన బలమ్మె చాలు ననుకొని గర్వించి
తిరుగు నతఁడు జెడును త్వరిత గతిని.
0475
తేలిక యని నెమలి తూలికలను బండి
నిందవేయఁ నిరును మొండి యగును.
0476
కొంత కొంత యనుచు కొమ్మకొనకు జేర
కొమ్మ వరిగి నంత కూలిపడును.
0477
దానమైన నున్న దానిని గుర్తించి
చేయువాని సిరికిఁ జెడుపురాదు.
0478
తప్పులేదు వరవు దగ్గిన మాత్రాన
పెచ్చువెరగనట్టి వెచ్చమున్న.
0479
లెక్కలేక బ్రతుకు నొక్కని కెంతున్న
నున్న దున్న తీరె నున్న యగును.
0480
ఉన్న దెంకొ దెలియ కువకార మొనరింప
నంతరించు శీఘ్ర మెంత యున్న.

49.  కాలము
0481
పగటివేళఁగాకి పగదీర్చు గూబపై
వేళ నృపతి కట్లు విలువ గలది.
0482
అద నెఱింగి కార్య మాచరించిన జాలు
ధనము మూటగట్ట దారమదియె.
0483
సమయ సాధనములఁ గమనించి చేసిన
సాధ్యపడని దొకటి జగతి లేదు.
0484
స్థాన మెఱిగి రాజు సమయమ్ము గుర్తించి
యాచరింప వసుధ హస్తగతము.
0485
వేళజూచు చుంద్రు వెక్కస పడకుండ
నేలదలచువారు నేల నెల్ల.
0486
సాధకుండు పొంచి సౌమ్యంబుగా నుంట
తగరు పొంచి నెదిరి దాకు విధము.
0487
బయట బడరు జ్ఞాన పరులెల్ల భళ్ళున
నాత్మనుంచి కాల మనుసరింత్రు.
0488
కాలమొకటి వచ్చుఁ గార్యమ్ము సాధింప
వేచియుండవలయు వేళ నెఱిగి.
0489
సాధక మగునపుడె సాధింపవలయును
సాధ్యపడున దెల్ల సత్యరముగ.
0490
కొక్కెర వలె రాజు చిక్కిన సమయమ్ము
శత్రుపులను బట్టి జంపవలయు.

50. స్థానబలము
0491
ముట్టడింపరాదు తిట్టు తిట్టగ రాదు
తెలిసికొనక స్థానబలము ముందు
0492
బహువిధాల మేలు బగతుర బరిమార్ప
దుర్గమందె గెలువు దొఱకునేని.
0493
బలము లేక యున్న బలమబ్బు దానంత
సాహసించునేని స్థాన మెఱిఁగి
0494
ఎదిరి యూహలన్ని కుదరకఁ జెడిపోవు
తగవు నెఱపునేని స్థానమెఱిఁగి.
0495
నీటిలోన ముసలి నిగిడి యేనుగఁబట్టు
కుక్క దాని నేలనక్కి కఱచు.
0496
రథము నీటిమీద రవ్వంత సాగదు
నావ నేలమీద నడువదడుగు.
0497
సాహసమ్ము కన్న సాయమ్ము బనిలేదు
స్థాన మెఱిఁగి జేయు జ్ఞానమున్న.
0498
స్వస్థలంబు నందు స్వల్పమౌ సైన్యంబె
యెదిరి నెదుర గల్గు నినుమడించి.
0499
కోట లేక నేన కొఱత గానున్నను
గెలువగాదు వాని స్థలము నందు.
0500
యుద్ధ భూమిలోనఁ యుద్ధండమౌ కరి
బురదజిక్క నక్క లర్అచి కఱచు.
No comments:

Post a Comment