Thursday, 3 September 2009

tel01

Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)
I. ర్మ కాండము
1. దైవ ప్రార్థ
0001
అచ్చుమూలమైన దక్షరంబుల కెల్ల
వేద వేద్యు డాది విశ్వమునకు
0002
చదివినన్దుకేమి సఫలమ్ము సర్వజ్ఞు
చరములకు బూజ లుపకున్న
0003
సుమన గమను పాద కమలమ్ములకు సేవఁ
జేయువారి బ్రతుకు క్షేమ మిలను
0004
వలయు వద్దులేని వాని పాదము లంద
శాశ్వతముగ దొలగు సంకటములు
0005
బంధ ముక్తుడగును ద్వంద్వ కర్మలనుండి
విశ్వమయుని కీర్తి వినుతిజేయ
0006
ఇంద్రియమ్ము లణచి యింద్రియాతీతుని
సత్య మార్గమరయ నిత్యసుఖము
0007
నిరుపమాను దివ్య చరణ సేవలు దప్ప
మనసు శాంతి బొందు మార్గమరుదు
0008
ధర్మవార్ధియై దైవమ్ము పద సేవఁ
గర్మవార్ధి దాట గలుగు నావ
0009
చేష్ట లుడిగినట్టి చెవి కన్ను ముక్కటు
ష్టగుణుని మ్రొక్కనట్టి శిరము
0010
భవ మహా సముద్ర మవలీల యభవుని
పాద మందుకొన్న వారికెల్ల


 2. వర్షమహిమ
0011
వాన గురియుచుండ వర్ధిల్లు లోకంబు
లందుచేత దాని మృ మండ్రు
0012
వాన కలుగఁజేయు ప్రాణి కోటికినెల్ల
కూడు నీళ్ళు రెండు కొఱఁత లేక
0013
ఆకలి దహియించు, లేకున్నఁ వర్ష మ్ము
జలధి దిరిగియున్న జగతినైన
0014
మడకబట్టి దున్న మరతురు రైతాంగ
మదను లోన వర్ష మల్ప మైన
0015
పాడు జేయు పాడు పడినట్టి వారిని
బాగుజేయు నదియు వానయగును
0016
వాన తొలకరింపఁ మానినచో పఛ్ఛి
ఱియుఁ లఁజూపఁ వెఱచుఁనేల
0017
ఎత్తుకొన్న నీటి నివ్వనిచోఁ మబ్బు
మేటి సంద్రమైన లోటుఁ బడును
0018
దేవ పూజలేదు దినకృత్యములు లేవు
వాన గురియకున్న వసుధపైన
0019
తపముఁ  జెడును దాన ధర్మంబు లుడుగును
నీరు జారకున్నఁ  నింగి నుండి
0020
నీరు లేకఁ జగతి నిలువగా దేరికి
నూర దూట వాన లుండకున్న


 3. ముక్తులు
0021
తనదు ధర్మపథముఁ దప్పని ముక్తులఁ
బ్రస్తుతించు నెల్ల పుస్తకములు
0022
యతుల మహిమ లెన్న మృతులైన వారల
నెంచి చెప్ప సాహసించినట్లు
0023
కల్ల నిజములం నుఁగొని సన్యసించిన
మునుల కీర్తి లోకమునకు వెలుఁగు
0024
చిత్త మంకుశముగఁ జేసి యైదింటిని
ణఁచు తఁడు మోక్షమునకు విత్తు
0025
నిగ్రహిఁచుకొన్న నిష్ఠ గరిష్ఠుని
కమర ప్రభువె సాక్షి యంబరమున
0026
చేయ దగ్గ పనులె చేతురు పెద్దలు
చిన్నలట్టిపనులు చేయఁలేరు
0027
వినుట కనుట వంటి వివరమ్ము లైదింటి
నెఱుఁగు జ్ఞాని లోక మెఱిగి యుండు
0028
షులు జెప్పినట్టి విషయమ్ములేనాఁడు
మంత్రములుగ నేడు మహిమఁగాంచు
0029
గుణము లనెడు కొండ గూర్చున్న వారికి
విలువ దాగ్రహంబు నిముసమైన
0030
కరుణ జూపువారె కష్టపెట్టకొకరి
బ్రాహ్మణులుగ జెప్పఁబడెడువారు


 4. ధర్మోద్ఘాటన
0031
ధనమునిచ్చు మోక్ష ధనము నిచ్చును ధర్మ
మంతకన్న వలసినట్టి దేది?
0032
ధర్మనిష్ఠ న్నఁదగు మంచి లేదొండు
వీడ దాని న్నఁ గీడు లేదు.
0033
చేయఁదగిన విధులఁ జేయుటే ధర్మంబు
ధర్మమెడలి బ్రతుకఁ దగవు గాదు.
0034
ఆత్మశుద్ధి కన్న నన్యధర్మము లేదు
మెప్పు కోసముండు మిగత వన్ని.
0035
ఈర్ష్య , యాశ , కోప మెడలుట తోఁబాటు
ప్రల్లదములు లేమి పాడి యౌను.
0036
ధర్మమొకటె చ్చుఁదాఁ జనునప్పుడు
నేడు నాఁడు లెక్కఁ జూడఁదగదు.
0037
పల్లకి నొకఁడెత్త పైనుండు నొక్కఁడు
ధర్మ మింతె యనుచుఁ దలచరాదు.
0038
ఉన్ననాళ్ళు మరువకున్నచో ధర్మంబు
భవము నడ్డగించు బండ యదియె.
0039
ధర్మమందె సుఖము తక్కిన దంతయు
సుఖముగాదు కీర్తి శూన్యమగును.
0040
ఆచరింప లసినట్టి దగును ధర్మ
మాచరింప రాని దగును నింద.


 5.  గృహమేధి
0041
కాపురస్తున్నఁ  గాపాడగలవాఁడు
ముఖ్యమతని నమ్మి మువ్వురుండ్రు
0042
సాదు, పేద, దీను లాదిగ మువ్వుర
కండగాను గేస్తు డుండు నెపుడు.
0043
పితరు, దైవ మతిధి పేదలు తానైదు
ధర్మములను గేస్తు తప్పకుండు.
0044
నింద బడక నున్న దందఱికిని బెట్టి
కుడుచు నతని గృహము కొఱతఁ వడదు.
0045
నిర్మల మగుప్రేమ నీతియు నియమము
లున్న కాపురమ్ము వన్నె కెక్కు.
0046
నీతితోడ నిల్లు నిలబెట్టు కొన్నచో
నన్ని వ్రతములందె ణిఁగి యుండు.
0047
క్రమము దప్ప నట్టి కాపురస్తుఁడు మేటి
ఘోర తపము జేయువారి కన్న.
0048
యుక్తరీతి ధర్మయుక్తుడౌ గృహమేధి
యజ్ఞ యాగ ఫలము లనుభవించు.
0049
ధర్మ మనఁగఁ జెల్లు దాంపత్య భావమ్మె
మాట బడమి దాని మంచి గుణము.
0050
బ్రతుక వలసినట్లు బ్రతికినచో నింట
మింట సురలు బిలచి మెత్తురతని.


 6.  ఇల్లాలు
0051
తగిన గుణము లుండి తన భర్త చేతిని
మిగులఁ బెట్టఁగలుగు మగువె భార్య.
0052
పత్ని గుణము లేక ప్రఖ్యాతి ఇతరత్ర
నెంత యున్నఁదన కదేమి ఫలము.
0053
లేని దేది? భార్య జ్ఞానమ్ము గలదైన!
ఉన్నదేది? గుణము సున్నయైన!
0054
స్త్రీ న్నఁ గొప్పఁ జెప్ప నేమున్నది
చూపు మానమందు మోపిరేని
0055
పతిని దైవముగను వ్రతమున్న యిల్లాలు
కురియు మన్న క్షణమె కురియు వాన
0056
తనదు గౌరవమ్ము తన భర్త గౌరవ
మరసి కాచుకొన్న యామె భార్య ,
0057
కంచ నాటి స్త్రీలఁ గనిపెట్ట గా లేము
మాన మందు వారి మనసులేమి .
0058
ధవుని సేవయందు ధర్మంబు దప్పని
సాధ్వి కమర లోక సౌఖ్యమబ్బు
0059
పరువుఁ గాచునట్టి పత్నియే లేకున్న
నడగ ఠీవిరాదు నలువురందు.
0060
సాధ్వికిఁ దగినట్టి సంతాన మబ్బిన
మంగళముగ గృహము మహిమ గాంచు .


7.  బిడ్డలు
0061
తెలియలేము మంచి తెలివైన బిడ్డలు
కలుగు దానికన్నఁ గలిమి వేరు.
0062
ఏడు జన్మములకు నేదోష మంటదు.
ఏహ్యపడని బిడ్డ లింటనున్న.
0063
తన ధనమ్మ టండ్రు, తన సంతతినె బుధులు
వారి వారి కర్మ వారి సుతులు ,
0064
కన్నబిడ్డ తనదు చిన్నారి చేతులఁ
దులుపు కూడె యమృత తుల్యమగును.
0065
తనువు పులకరించు తాకినఁ దన బిడ్డ
మాటవిన్న చెవుల మధుర మగును.
0066
వారి వారి బిడ్డ గారాబు మాటలు
విన్న వినరు వీణ వేణురవళి .
0067
బుధుల సభల యందు పొగడొందునట్లుగ
తనయుఁదీర్చు టగును తండ్రి ఋణము.
0068
తనదు సుతుని ప్రతిభ తా మెచ్చుటకు ముందె
యుర్వి జనులు మెత్తు రుత్సవముల
0069
కన్న నాటికన్న మిన్నగా నుప్పొంగు
తనయుని పొగడంగ వినిన తల్లి
0070
ఎట్టి తపముఁజేయ నిటువంటి పుత్రుండు
పుట్టె ననిన దీరు పుత్రు ఋణము.

8.  ప్రేమ
0071
తలుపు తాళమేది నిలుపంగ ప్రేమను
భాష్ప రూప మగుచుఁ బయలు వెడలు.
0072
దయఁద్రలంచు నతఁడు తమవెల్ల వెచ్చించు
నదయు డన్ని తనకె యనుచు దలఁచు.
0073
జీని కిటుల దనువు గావలె నిలువంగ
బ్రతుక వలయునన్న వలయు ప్రేమ.
0074
ప్రేమ యధికమైనఁ బెరవారు దమవారె
న్నేహమునకు నదియె బిహ్నమగును.
0075
అతని బ్రతుకుఁ జూడ నానంద మయమన్న
ఖ్యాతికెల్లఁ బ్రేమ కారణమ్ము.
0076
పుణ్యమునకెగాక పురుషత్యమునకైన
వదల రాని దుగును వసుధ ప్రేమ.
0077
ప్రేమలేని వానిఁబీడించు ధర్మంబు
ఎముక లేని ప్రాణి నెండ విధము.
0078
చవటి నేలఁజెట్టు చివురించనట్టుల
ప్రేమలేని బ్రతుకు పేలనమ్ము.
0079
అంతరంగమందు నమరనిచో ప్రేమ
బాహిరముల వలన ఫలమదేమి?
0080
జీవమునకు ప్రేమె జీవమ్ము యడిలేని
నారి దేహ మస్తిపంజరంమ్ము.

9.  ఆతిథ్యము
0081
ఇల్లు గాచి ధనము నినుమడించుట యెల్ల
నతిథి నాదు కొనఁగ నగును జూవె.
0082
అతిథి బయటనుంచి యమృతమే యైన దా
నారగింప న్యాయ దూరమగును.
0083
ఆశ్రితాళి నెఱిగి యాతిథ్యమిచ్చిన
నందుచేత లేమి నొందడెవడు.
0084
అతిథి రాక కలరి యాతిథ్యమిచ్చెడి
వారి యింట లక్ష్మి వలచి నిలచు.
0085
అతిథి తినఁగ మిగులు నన్నంబు దినువాని
నేల విత్తనంబు లేల జల్ల?
0086
ఒకరి నుపచరించి నొకరికి నెదురొడ్డు
నతఁడు దేవతాళి కతిథి యగును.
0087
విందు యజ్ఞమగును వితరణ ఫలితమౌ
యర్థరహిత మింత యంత యనుట.
0088
పెట్టలేని వారె చెట్టు పుట్టల జేరి
యాశ లెడలి నట్టు లలమ టింత్రు.
0089
ఉండి యువచరింపకుండెడి దారిద్ర్య
ముండు నజ్ఞులందె మెండుగాను.
0090
అనిచమనెడు పుష్ప మాప్రూణమున వాడు
జూచినంత నతిథి లేచిపోవ.

10.  ఇంపుమాటలు
0091
కల్మషమ్ము లేని కమ్మని మాటలు
నిజముగన్ను వారె నేర్చి యుంద్రు
0092
నగుమొగమ్ముతోడ నయముగా మాటాడ
నీని కన్న దాని చేవమెండు.
0093
విధిత ధర్మమగును వినిసింప ప్రేమతో
నగుమొగమ్ముతోడ నయముగాను.
0094
బాధ పరచునట్టి పేదరికము బాపు
తీపిగాను జెప్ప దెలుసుకొన్న.
0095
తొడవు లేల నుడుల దొణికిన మధురమ్ము
వినయ సంపదగల మనుజ తతికి.
0096
పరుల మేలెఱింగి పలికిన పలుకులు
పాప మెడలజేసి చూపు నిరతి.
0097
పలుకు లందు మేలు కలుగంగ నయ్యది
గుణము దప్పకున్న గురుతరమ్ము.
0098
ఎదిరి కదురులేని యింపైన మాటలే
యిహాపరాల రెంట నిచ్చు సుఖము.
0099
ఇంపుగ నుడువంగ నీడేరు సకలమ్ము
బండ బూతులేల బలుక వలయు?
0100
ఇంపు మాటలుండ నేలకో పరుషొ క్తి
పండువదలి కాయఁ బట్టినట్లు.

No comments:

Post a Comment