Thursday, 3 September 2009

tel03Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

21. అపకృతి

0201
క్రూర కర్ముఁడన్ని కృత్యంబులను జేయు
పాపమునకు వెఱచు పండితుండు.

0202
ముప్పు వలన ముప్పు మూడును గాబట్టి
నిప్పు నొప్పు ముప్పు దప్పుకొనుము.

0203
విజ్ఞతయన దన్ను వేధించు నారికిన్
చెడుపు జేయకున్న శిక్ష గుణము.

0204
ఒకరి కీవు కీడు నొనరింపఁ దలచిన
దాని నీకు ద్రిప్ప ధర్మముండు.

0205
ఏమి తేనివాడ నేనేమి జేసిన
న్నేమి యన్న వాని లేమి పూను.

0206
చిక్కు లొరుల కెవుడు చేయని వాడైన
చిక్కులందుఁదాను చిక్కకుండు.

0207
దీర్ఘ వైరమునను  దెరవుండు బ్రతుకంగ
దుష్ట కర్మపలన కష్ట మబ్బు.

0208
అడుగు లండి సీడ నడయాడు నట్లుగా
చెడువు విడువ దెవుడు చెడ్డవాని.

0209
హాని జేయ వలవ దల్పంబు గానైన
దనకుఁ దానె రక్ష దలచుటైన.

0210
చెప్పవచ్చు నతఁడు చెడిపోవడని రూఢి
చెడువు పరుల కెపుడు చేయడేని.
22. ఉపకృతి

0211    
వాన కొరదేది వర్షించి నందుల
కుపకరించు వార లుందు రల్లు

0212
వివిధ వృత్తులందు విత్తంబు జేర్చుట
నీయ దగినవారి కిచ్చు కొఱకె.

0213
ఉపకృతి సరియగు నుత్తమ ధర్మంబు
భువిని లేదు మరియు దివిని లేదు.

0214
ఉపకరించువార లున్నట్లుగా లెక్క
సాయ పడనివారు చచ్చినట్లె.

0215
ఊరివారికెల్ల నుపయోగపడు నుయ్యి
నిండినట్లె దాత కుండు ధనము.

0216
మార్గ మధ్యమందు మాధుర్య ఫలవృక్ష
మున్న విధము దాతకున్న ధనము.

0217
సకల రోగములకు సంజీవి మూలిక
ధనము దాతకున్న క్షణము నందు.

0218
దాతయైనవాడు దారిద్ర్యమున నున్న
మాన డుపకరించు మార్గ మతఁడు

0219
ఈయలేని సమయ మేర్పడినప్పుడే
దాత వేదనంచు దలంచు టెల్ల.

0220
ఉపకరింపఁ దనకు నపకారమేయైన
కూలిజేసి యైన గొనుము దాని.
 23. ఈవి

0221
లేవడి కిడు దాని సీవిగాఁ భావింత్రు
ప్రతి ఫలమ్మె మిగత వన్ని జాడ.

0222
అడుగరాదు మేలుకై యున్ను నొకనిని
ముక్తి లేదటన్ను యుక్త మీవి.

0223
లేవడి యడుగంగ లేదని నొప్పింప
కిచ్చువాని దుగును హెచ్చు కులము.

0224
సానుభూతి తగదు సాయంబు గోరెడ్
ముఖము నందు నగవు మొలచు దనుక.

0225
శక్తిపరుల శక్తి శమియించు టాకలి
దాని కన్న శక్తి దాని దీర్ప.

0226
ఆకలనెడి నొప్పి యంచుకే చేరదు
వంచి తినెడు గుణము నుంచుకొనిన.

0227
ఈవి వలనఁ దృస్తి నెరుగునే ద్రవ్యమ్ము
కూడబెట్టి విడచి కుములు లోభి.

0228
లేనివాని కిడక తనకు తానె తినుట
వరమ సీచమగును పస్తుకన్న.

0229
చావె కష్టమండ్రు లేవడి యడుగంగ
సియలేమి కన్న నింపె చావు.

0230
దేహి యన్నవారి కాహర మిడుటయే
తనకు వెనుక మిగులు ద్రవ్యమగును.
 24. కీర్తి

0231
ఇచ్చుటందు కీర్తి వచ్చుట కన్నను
ఫలిత మొండు లేదు బ్రతుకు నందు

0232
చెప్పువారు మిగుల జెప్పుకొందురటన్న
పేదవారి కిడిన పెద్ద తనమె.

0233
మిగులు నట్టి దొకటి మేదిని సత్కీర్తి
యంతమగును మిగతవన్ని తుదకు.

0234
నిలచెనేని కీర్తి కలకాల మిల మీద
నమరపరుల కన్న నధికు డతఁడు.

0235
చాపునందు కీర్తి శంఖంబునకు వోలె
ప్రాప్తమగుట గొప్ప పండితులకె.

0236
వెలయ వలయు కీర్తి వెలయంగ లేకున్న
మనుట కన్న ముంచి మరుగు పడుట.

0237
కీర్తి లేనివారు కించపడుట మాని
దుష్ట డన్నవారి దూరనేల.

0238
యశము తోడఁ బ్రతుక వశముగాకున్నచో
కర్మవశము వలన గలిగె నండ్రు.

0239
కీర్తిమరులు పుట్టి మూర్తీభవించని
యట్టి నేల చవటి పట్టుగాదె.

0240
బ్రతుకు కీర్తితోడఁ బ్రతికినవారిదే
కీర్తిలేని బ్రతుకు కేవలమ్మూ.
 25. కరుణ
0241
ధనములందు ధనము దయతోడ నుండుటే
వ్యర్థునందు గూడ నర్థ ముండు.
0242
కరుణ కన్న మంచి కానంగ లేమొక్క
టాదరించు మతము లన్ని దాని.
0243
కరుణ గల్గినట్టి ఘనులకు లేనట్టి
దంధకార మందు కుందు బ్రితుకు.
0244
తనకు జరగదంచుఁ దలపొయగా నేల
పరుల యందు తాను కరుణఁ జూప.
0245
కరుణ కష్టములను కలిగింప దనుటకు
వా యుమండలమ్మూ వనుధె సాక్షి.
0246
కరుణ దొరఁగి మిగుల కష్టవెట్టినవారె
దుఃఖపడుదు రిపుడు తోడులేక.
0247
ఇహము ధనములేక నింపొందగాఁలేము
పరము కరుణలేక బడయలేము.
0248
అర్థ మెడలి మరల ననుభవింపగవచ్చు
కరుణ దొరగి మరల మెరుగుపడము.
0249
కరుణలేక ధర్మ కార్యంబు జేయుట
జోధవడకఁ జదువు పొ త్త మట్లు.
0250
తన్న దలతువేని, తన్నలు దిన్నది
తలచుకొన్న కరుణ తానె వచ్చు.


 26.  జీవహింస
0251
బలియ గోరి తాను బలిజేయు జీవుల
నట్టి కెట్టు లమరు తరుణ
0252
దాచనట్టి చేత ధన ముండనట్లుగా
మాంస భక్షణమున మరుగు కరుణ.
0253
నేన నున్నవాని చిత్తంబు రీతిగా
మాంస భక్షకునికి మానసమ్ము.
0254
జాలి యనిన ప్రాణి జంపమితొఁబాటు
మాంస భక్షణమును మానుటగును.
0255
జీవహింస  లేమి జీవిత ధర్మంబు
నంజు డారగింప నరక మబ్బి.
0256
మాంస మెవరు దినక మానిన వారైన
నమ్మువారు భునిని వమ్ముగారె.
0257
మాంస భక్షణమ్ము మానుట మంచిది
చింత జేయ వ్రణమె జీవి కద్ది.
0258
జీవులందు నెల్ల జీవు డొక్కడె గాన
చంపు తినరుదేని సాధు జమలు.
0259
వేయి యజ్ఞములను జేయుట కన్నను
చంసి తినక యున్న చాలు నదియె.
0260
ప్రాణికోటి భక్తి భావాన ప్రణమిల్లు
ప్రాణ ఘాతకమును మాను వాని.


 27.  తపస్సు
0261
బాధలెల్ల నొర్చి బాధింపకుండుటే
తపముఁ జేయువారి తత్వమగును.
0262
తపము తాపనులకె తనకును తగునని
వేషధారణమ్ము వెట్టి తనము.
0263
తపము జేయువారి కుపచరించగనేమొ
నన్యసింపరైరి నకల జనులు.
0264
కాని వారిఁజెరువ నైనవారిని గావఁ
దలచినంత జేయ దగు తపస్వి.
0265
అనుభవింపవచ్చు ననుకొన్న రీతిగాఁ
దపము తప్పకున్న తథ్యముగను.
0266
తాపసాళి క్రమము దప్పక వర్తింతు
రితరు లీషణముల మతి భ్రమింత్రు.
0267
పుటముఁ బెట్ట బెట్టఁ బొల్పొందు బంగారు
బాధ పడను పడను బోధపడును.
0268
తాను నేనటన్న దానిని విడనాడు
నతని గొల్చు జగతి నుతుల కృతుల.
0269
తవము దప్పనట్టి ధైర్యమ్ము గలవాడు
కాల యముని గూడ కాలదన్ను.
0270
లేనివార లధిక మైనట్టి హేతువు
వ్రతము సల్పువారు స్వల్ప మగుటె.

28.  బాహ్యవేషము
0271
ధూర్తుఁడొప్పిదముగ మూర్తిభనించిన
నతని చేష్ట లెఱిగి యాత్మ నవ్వు.
0272
పొగడవచ్చు తన్ను గగనము దాహంగ
నందులోని సత్య మాత్మ కెఱుక.
0273
పొలము మేయునట్లె పులితోలుతో నావు
తిరిపమునకు జేయు తీవ్ర తపము.
0274
వలలు పన్ను విధము వ్యాధుండు పొదనుండి
దుష్ఠుఁడొదిగి చేయు దొంగ తపము.
0275
చంపుకొనక నాశ సన్యాసి ననునాడు
దిక్కు మొక్కు లేక దిగులువడును.
0276
విగ్రహింప లేక నియతాత్ము లట్లుండు
వారికన్న ద్రోహపరులు లేరు.
0277
ఎఱ్ఱని గురిగింజ కెటులుండు నల్లుపట్లు
మంచివారి యందు మసి యొకింత.
0278
మనను తేటగాక మాటిమాటికి నీట
మునిఁగి తేలు జనులు మూల మూల
0279
ములుకు బాధనిచ్చు ముచ్చటగానుండి
వీణ ముదమునిచ్చు కోణయయ్య.
0280
గొరగ వద్దు పెంచుకొనఁగ వద్దు జగతి
దోసమన్న దాని త్రోసిపుచ్చ.

29.  దొంగతనము
0281
బ్రతుకఁదలతువేని పరిహాస పడకుండ
మదిని దొంగతనము మరచిపొమ్ము.
0282
దొంగిలింపకున్న దొంగిలించిన యట్లె
యట్టి తలపు మనసునందు గలుగ.
0283
వెరిగినట్లు వెరిగి వెరిగిన దంతయుఁ
తరిగిపోవు దొంగతనపు ధనము.
0284
చోర బుద్ధి వచ్చి చొచ్చుకపోయిన
బ్రతుకు కాలమెల్ల పతన మగును.
0285
జాలిగుండె కలుఁగ జాలదు చిర్చింప
దుష్టబుద్ధి కలుఁగ దొంగిలింప.
0286
నీతిగాను బ్రతుకఁ జేతగా దొకనికి
యాశ గలిగెనేని మోసగింప
0287
చిక్కనముగ బ్రతుక చేతైన వానికి
నపహారింప దలఁచు నెపము లేదు.
0288
మేర నెఱుఁగు నతఁడు మీరడు ధర్మంబు
మోర నెపమునందె చోరుడుండు.
0289
చోర వృత్తికన్న వేరెరుంగని యట్టి
చీడవురుగు చెడును శీఘ్ర గతని.
0290
దొంగవాని కిహమె దూరమై పోవంగ
నిగ్రహునికి దక్కు నింగి సుఖము.

30.  సత్యము
0291
సత్యమేదియన్న స్వల్పమ్ముగా నైన
దోషముండ  నట్టి భాషణమ్ము.
0292
సత్య దూరమైన సత్యంబుగా నొప్పు
దోహదంబుగాగ దోషముడిగి.
0293
మనను తెల్పు దాని మరుగుపఱచు వాని
చిత్తమందు సతము జిచ్చురగులు.
0294
అన్యత మాడకున్న నాత్మసాక్షిగఁ దాను
మసలు సకల జనుల మనసు లందు.
0295
సత్యదృష్టి యాత్మ సాక్షాత్కరించిన
యజ్ఞకర్త కన్న విజ్ఞుఁ డతడు.
0296
నిజముకన్న కీర్తి నిక్కంబు లేదొండు
కష్ట రహిత మన్ని నిష్ట లందు.
0297
నిర్వహించినట్లె సర్వ ధర్మంబులు
నిజము నిజముగాను నిలుపుకొన్న.
0298
అంగశుద్ధి స్నానమాడిన సరిపోవు
నాత్మశుద్ధి సత్య మందుటందె.
0299
మెలుఁగులన్ని మెలుఁగు వెలిగింపజాలవు
సజ్జనాళి మెలుఁగు సత్య మగును.
0300
అరయ సత్యమొకటె పరమార్థమైనది
సత్యమునకు సాటి జగతి లేదు.

No comments:

Post a Comment